AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangladesh: ఇస్కాన్‌కు జమాతే ఇస్లామీ బెదిరింపు.. 24 గం. ఆలయాన్ని మూసివేయాలని అల్టిమేటం జారీ

బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వం మారినప్పటి నుంచి హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇస్కాన్ నేత చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్ట్ తర్వాత.. ఇప్పుడు జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ కార్యకర్తలు ఇస్కాన్ ఆలయాన్ని 24 గంటల్లో మూసివేయాలని అల్టిమేటం జారీ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

Bangladesh: ఇస్కాన్‌కు జమాతే ఇస్లామీ బెదిరింపు.. 24 గం. ఆలయాన్ని మూసివేయాలని అల్టిమేటం జారీ
Bangladesh Iskcon Temple
Surya Kala
|

Updated on: Nov 28, 2024 | 7:13 AM

Share

భారతీయుల త్యాగాలతో ఆర్ధిక సాయంతో ఏర్పడిన బంగ్లాదేశ్ కు ఇప్పుడు ఆ దేశంలో హిందువులు, హిందూ ఆలయాలు నచ్చడం లేదు.. ముఖ్యంగా షేక్ హసీనా ప్రభుత్వం గద్దె దిగి తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనస్‌ పదవి చేపట్టిన తర్వాత ఆ దేశంలో హిందులపై దాడులు తీవ్రంగా పెరిగిపోయాయి. బంగ్లాదేశ్ లో మైనార్టీల గొంతుగా మారిన ఇస్కాన్ అధినేత చిన్మోయ్ కృష్ణ దాస్ ను మహమ్మద్ యూనస్‌ సర్కార్ అరెస్ట్ చేసింది. కనీసం బెయిల్ రాకుండా చేయడమే కాదు.. కృష్ణ దాస్ తరపున కేసు వాదిస్తున్న లాయర్ కూడా హత్య గావింప బడ్డాడు. చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టుపై బంగ్లాదేశ్‌లో ఉత్కంఠ పెరుగుతోంది. మరోవైపు ఇస్కాన్‌పై నిషేధం విధించాలని కోరుతూ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఇప్పుడు జమాత్ కార్యకర్తలు ఇస్కాన్‌పై బెదిరింపులకు దిగుతున్నారు.

బంగ్లాదేశ్‌లోని సోనాలి మార్కెట్‌లో ఉన్న ఇస్కాన్ ఆలయాన్ని 24 గంటల్లో మూసివేయాలని అల్టిమేటం జారీ చేశారు. జమాత్ కార్యకర్తలు ఇస్కాన్ ను బెదిరించడం కాదు.. ఇస్కాన్ ఆలయం పెరుతున్న బోర్డు కూడా తీసి తమ సంస్థ పేరు ఉన్నబోర్డుని పెట్టుకున్నారు.

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌కు సంబంధించిన వివాదం ఏమిటి?

బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత హిందువులపై హింస పెరిగింది. హిందువుల హక్కుల కోసం ఇస్కాన్‌ నేత చిన్మోయ్‌ కృష్ణ దాస్‌ తన గళాన్ని వినిపిస్తున్నారు. అక్టోబరు చివరి వారంలో జరిగిన ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణలున్నాయి.

ఇవి కూడా చదవండి

నవంబర్ 25న చిన్మోయ్ కృష్ణ దాస్‌ను దేశద్రోహం ఆరోపణలపై విమానాశ్రయం నుంచి అరెస్టు చేశారు. దీంతో ఆయన మద్దతుదారులు, హిందూ సంఘాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ కోర్టు చిన్మయ్ దాస్‌కు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. దాని తర్వాత హిందువులు, ఆయన మద్దతుదారులు నిరసన వ్యక్తం చేస్తుండగా.. పోలీసులు వారిపై దాడులు చేసినట్లు త్లెఉస్తొన్ది. దీంతో కోర్టు ఆవరణలో సమీపంలో హింసాత్మక నిరసనలు చెలరేగాయి. ఆ హింసలో చిన్మోయ్ కృష్ణ దాస్‌ తరపున వాదిస్తున్న ప్రభుత్వ న్యాయవాది మరణించారు.

ఇస్కాన్‌పై జమాత్‌ ప్రచారం!

న్యాయవాది సైఫుల్ ఇస్లాం మరణంతో బంగ్లాదేశ్‌లోని ఛాందసవాద సంస్థ జమాత్-ఎ-ఇస్లామీ చర్య కోసం ఇస్కాన్‌పై ఒత్తిడి తెచ్చే అవకాశం మరోసారి లభించింది. కొన్ని రోజుల క్రితం ఇస్కాన్‌ను నిషేధించాలని యూనస్ ప్రభుత్వాన్ని జమాత్ డిమాండ్ చేసింది.

అయితే ఇలా జమాత్ సంస్థ చేయడానికి గల కారణం నివేదికల ప్రకారం బంగ్లాదేశ్‌లో హిందువుల ఐక్యత కారణంగా, హిందూ ఉద్యమం బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్, చట్టబద్ధమైన ఎన్నికలకు చోటు కల్పించవచ్చని.. వాటిని మళ్లీ నిషేధించవచ్చని భావిస్తోన్నట్లు తెలుస్తోంది.

బంగ్లాదేశ్‌లో 65 ఇస్కాన్ దేవాలయాలు

ఇస్కాన్‌కు బంగ్లాదేశ్‌ వాప్తంగా మొత్తం 65 దేవాలయాలున్నాయి. 50 వేలకు పైగా అనుచరులు ఉన్నారు. ఢాకాలో 13 ఇస్కాన్ దేవాలయాలు ఉండగా, చిట్టగాంగ్‌లో 14, సిల్హెట్‌లో 9, ఖుల్నాలో 8, రంగ్‌పూర్‌లో 7 ఇస్కాన్ ఆలయాలు ఉన్నాయి. ఒకవైపు ఇస్కాన్‌ ఆలయాన్ని మూసివేస్తామని జమాత్‌ కార్యకర్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. మరోవైపు ఇస్కాన్‌పై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది. జమాత్ ఒత్తిడికి తలవంచి నిస్సహాయంగా మారిన బంగ్లాదేశ్ యూనస్ ప్రభుత్వం ఇప్పటికే ఇస్కాన్‌ను ఛాందసవాద సంస్థగా ప్రకటించింది. ఇప్పుడు ఈ నిరాధార ఆరోపణలపై బంగ్లాదేశ్ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..