Maha Kumbha Mela: మహా కుంభమేళా ప్రతి 12 ఏళ్లకి ఎందుకు వస్తుంది? మతపరమైన ప్రాముఖ్యత ఏమిటంటే

12 సంవత్సరాల విరామం తర్వాత భారతదేశంలో హిందువులు పండుగ మహా కుంభమేళాను ఘనంగా నిర్వహించనున్నారు. కుంభమేళా హిందూ మతంలో అతిపెద్ద, అత్యంత పవిత్రమైన జాతర. కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అయితే ప్రతి 12 ఏళ్ల తర్వాత మాత్రమే మహా కుంభమేళా జరుపుకునే సంప్రదాయం ఏమిటి? దీని గురించి తెలుసుకుందాం..

Maha Kumbha Mela: మహా కుంభమేళా ప్రతి 12 ఏళ్లకి ఎందుకు వస్తుంది? మతపరమైన ప్రాముఖ్యత ఏమిటంటే
Kubhamela
Follow us
Surya Kala

|

Updated on: Nov 28, 2024 | 11:00 AM

కుంభమేళా అనేది భారతీయ సంస్కృతికి సంబంధించిన ఒక ప్రధాన మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమం. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒక నిర్దిష్ట ప్రదేశంలో నిర్వహించబడుతుంది. ఇది ప్రత్యేకంగా నాలుగు ప్రధాన ప్రదేశాలలో ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్), హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లలో నిర్వహించబడుతుంది. ఈ కుంభ మేళా సమయంలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. హిందూ మత పరమైన దృక్కోణంలో కుంభమేళా చాలా ముఖ్యమైనది. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఎందుకు వస్తుంది అనే దానితో ముడిపడి ఉన్న లోతైన నమ్మకాలు, పురాణాలు ఉన్నాయి. ఈ రోజు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం..

12 ఏళ్ల వ్యవధి మాత్రమే ఎందుకు?

ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళా ఎందుకు నిర్వహించబడుతుందనే దాని వెనుక అనేక మత విశ్వాసాలు ఉన్నాయి. కుంభమేళా మూలం సముద్ర మథనానికి సంబంధించిన పౌరాణిక కథతో ముడిపడి ఉందని నమ్మకం. దేవతలు, రాక్షసులు కలిసి సముద్రాన్ని మథనం చేసినప్పుడు అమృతం ఉద్భవించింది. ఈ అమృతాన్ని పొందడానికి దేవతలు, రాక్షసుల మధ్య 12 దివ్య రోజుల పాటు యుద్ధం జరిగింది. ఈ 12 దివ్య రోజులు భూమిపై 12 సంవత్సరాలకు సమానమని నమ్మకం. ఈ సమయంలో అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు 12 ప్రదేశాలలో పడ్డాయని.. ఆ అమృత బిందువులు నాలుగు భూమిపై పడ్డాయని కూడా నమ్ముతారు. కనుక ఈ ప్రదేశాల్లో కుంభమేళా నిర్వహిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహం 12 సంవత్సరాలలో 12 రాశుల చుట్టూ తిరుగుతుంది. గురు గ్రహం ఒక నిర్దిష్ట రాశిలో ఉన్నప్పుడు అదే సమయంలో కుంభమేళా నిర్వహించబడుతుంది.

మహా కుంభమేళా 2025 స్నానం చేసేందుకు ముఖ్యమైన తేదీలు

మొదటి రాజ స్నానం 13 జనవరి 2025న పుష్య పౌర్ణమి రోజున నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

రెండవ రాజ స్నానం మకర సంక్రాంతి 14 జనవరి 2025 రోజున చేస్తారు.

మూడవ రాజ స్నానం 2025 జనవరి 29న మౌని అమావాస్య రోజున చేస్తారు.

నాల్గవ రాజ స్నానం వసంత పంచమి, 3 ఫిబ్రవరి 2025 రోజున చేస్తారు.

ఐదవ రాజ స్నానం మాఘ పూర్ణిమ, 12 ఫిబ్రవరి 2025 రోజున చేస్తారు.

2025 ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున చివరి రాజ స్నానం చేస్తారు.

2025లో మహా కుంభ మేళా ఎప్పుడు నిర్వహిస్తారంటే..

ఈ సంవత్సరం మహా కుంభ మేళా 13 జనవరి 2025 నుంచి ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభం కానుంది. మహా కుంభ మేళా సమయంలో సంగమంలో స్నానం చేయడం వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయని నమ్మకం.12 ఏళ్ల తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా నిర్వహించనున్నారు. మహా కుంభ మేళా 2025 ఫిబ్రవరి 26న మహా శివరాత్రి రోజున ముగుస్తుంది.

రాచ స్నానం ప్రాముఖ్యత ఏమిటి?

కుంభమేళా సమయంలో పవిత్ర నదులలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. ఈ సమయంలో ఈ నదుల నీరు అమృతం వలె స్వచ్ఛంగా మారుతుందని నమ్ముతారు. కుంభమేళాలో స్నానం చేయడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. కుంభమేళాలో స్నానం చేయడం వల్ల సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుంది. కుంభమేళా సందర్భంగా లక్షలాది మంది భక్తులు పవిత్ర నదుల్లో స్నానాలు ఆచరిస్తారు. ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్)లో నిర్వహించే కుంభమేళాలో రాయల్ స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గంగా, యమునా, సరస్వతి నదులు ఇక్కడ కలుస్తాయి కనుక ఈ ప్రాంతానికి ప్రత్యేక మతపరమైన ప్రాముఖ్యత ఉంది. మత విశ్వాసాల ప్రకారం ఇక్కడ స్నానం చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.