Mumbai: గర్ల్‌ఫ్రెండ్‌ను వాట్సాప్‌లో బ్లాక్ చేసిన ప్రియుడు.. మానసిక క్షోభను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న పైలట్

ప్రియుడి పెట్టిన మానసిక చిత్రహింసలకు విసిగిపోయిన ఎయిర్ ఇండియా పైలట్ డేటా కేబుల్‌తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన ముంబైలోని పోవై ప్రాంతంలో జరిగింది. తన ప్రియుడు తనను మానసికంగా వేధించేవాడని ఆరోపించారు. అంతేకాదు అతను వాట్సాప్‌లో ప్రియురలినికి 12 రోజుల పాటు బ్లాక్ లో పెట్టాడు. దీంతో ప్రియురాలైన పైలట్ 13 వ రోజు డేటా కేబుల్‌తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Mumbai: గర్ల్‌ఫ్రెండ్‌ను వాట్సాప్‌లో బ్లాక్ చేసిన ప్రియుడు.. మానసిక క్షోభను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న పైలట్
Pilot Srusti
Follow us
Surya Kala

|

Updated on: Nov 28, 2024 | 9:38 AM

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని పోవై పోలీస్ స్టేషన్‌లో ఆదిత్య పండిట్ అనే యువకుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆదిత్య తన ప్రియురాలిని మానసికంగా వేధించేవాడని ఆరోపించారు. ఆదిత్య ప్రియురాలి పేరు సృష్టి తులి. సృష్టి ఎయిర్ ఇండియాలో పైలట్. ఆదిత్య తనకు నచ్చినట్లే సృష్టి బతకాలని, తినాలని ఇలా అన్ని విషయాలపై సృష్టిపై ఒత్తిడి తెచ్చేవాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సృష్టి, ఆదిత్య మధ్య సంబంధం రెండేళ్ల పాటు కొనసాగింది. అయితే ఏదో విషయంలో ఏర్పడిన గొడవతో ఆదిత్య సృష్టిని వాట్సాప్‌లో 12 రోజుల పాటు బ్లాక్ చేశాడు. దీంతో ఆమె 13వ రోజు ఆదిత్యకు ఫోన్ చేసి.. తాను ఇప్పుడు ఆత్మహత్య చేసుకోబోతోందని చెప్పింది.

ఆదిత్య పండిట్, సృష్టి తులి ఇద్దరూ రెండేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆదిత్య పండిట్ తన ప్రియురాలైన సృష్టి తులిని నిరంతరం హింసించేవాడు. చిన్న చిన్న విషయాలకే ఇద్దరి మధ్య పెద్ద గొడవలు జరిగేవని తెలుస్తోంది. ఒకసారి షాపింగ్ చేస్తున్న సమయంలో వివాదం చోటు చేసుకుంది. అతని కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు ఆదిత్య తన ప్రియురాలు సృష్టిని మార్గమధ్యంలో విడిచిపెట్టాడు. తర్వాత సృష్టి తన స్నేహితురాలి సహాయంతో ఇంటికి చేరుకుంది. ఆదిత్య ఈ ప్రవర్తన సృష్టిని చాలా బాధించేది అని తెలుస్తోంది. అయితే ఆదిత్య ప్రేమ కోసం సృష్టి.. అతను తనను పెట్టిన బాధలను అన్నిటినీ మర్చిపోయి మళ్ళీ అతనితో ఉండేది.

నాన్ వెజ్ ఫుడ్ విషయంలో కొట్లాట

ఆదిత్య పండిట్‌కి నాన్‌వెజ్‌ అంటే ఇష్టం లేదన్న కారణంతో ఒకసారి నాన్‌వెజ్‌ ఫుడ్‌పై వాగ్వాదం జరిగింది. ఆదిత్య రెస్టారెంట్‌లో సృష్టిని బహిరంగంగా అవమానించాడు. అయితే ఆదిత్య ఈ ప్రవర్తనపై సృష్టి ఎప్పుడూ కప్లింట్ చేయలేదు. ఏదో ఒకరోజు ఆదిత్య మాములుగా మారతాడని సృష్టి భావించింది. అయితే ఇటీవల ఆదిత్య సోదరి వివాహం నిశ్చయం అయింది. అప్పుడు మళ్ళీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆదిత్య పెళ్లికి వెళ్దామని సృష్టిపై చాలా ఒత్తిడి తెచ్చాడు. ఈ విషయంపై కూడా వీరిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది.

ఇవి కూడా చదవండి

వాట్సాప్‌లో 12 రోజుల పాటు బ్లాక్ చేయబడింది

ఆదిత్య వాట్సాప్‌లో సృష్టిని 12 రోజుల పాటు బ్లాక్ చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సృష్టి నవంబర్ 25వ తేదీ రాత్రి ఆదిత్యకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పింది. అది విన్న ఆదిత్యకి భయం వేసింది. అతను హడావిడిగా సృష్టి ఫ్లాట్‌కి చేరుకున్నాడు. అయితే అప్పటికే తలుపు లోపలి నుంచి లాక్ చేయబడింది. అటువంటి పరిస్థితిలో.. కీ హోల్డర్ సహాయంతో తలుపు తెరచి . లోపలికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతున్న సృష్టి మృతదేహం కనిపించింది. సృష్టి తన డేటా కేబుల్‌ను ఉపయోగించి ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకుంది.

ప్రేమికుడిని అదుపులోకి తీసుకున్నపోలీసులు

సృష్టి తండ్రి ఫిర్యాదు మేరకు ఆమె ప్రేమికుడు ఆదిత్య పండిత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో అరెస్టు చేశారు. మృతురాలి సృష్టి తులి తండ్రి ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు పోవై పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తదుపరి విచారణ జరుగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..