AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో కారు ప్రమాదం ముగ్గురు వైద్యులు సహా ఐదుగురు మృతి

UPలోని కన్నౌజ్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన కన్నౌజ్ ప్రమాదంలో ఐదుగురు వైద్యుల ప్రాణాలు కోల్పోయిన కథ ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది. వీరిలో ఒకరైన డాక్టర్ అరుణ్ కుమార్ MBBS చదివేందుకు తన పొలాన్ని కూడా అమ్మేశాడు. అరుణ్ కుమార్ కు మొత్తం తొమ్మిది మంది తోడబుట్టిన వాళ్లు ఉన్నారు. వీరిలో ఆరుగురు అక్కాచెల్లెళ్లు, ఇద్దరు సోదరుల బాధ్యత అరుణ్ భుజస్కంధాలపై ఉంది.

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో కారు ప్రమాదం ముగ్గురు వైద్యులు సహా ఐదుగురు మృతి
Kannauj Car Accident
Surya Kala
|

Updated on: Nov 28, 2024 | 10:59 AM

Share

బుధవారం తెల్లవారుజామున కన్నౌజ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కన్నౌజ్‌తో పాటు మొత్తం యూపీని కుదిపేసింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఇప్పటికీ జీవన్మరణ మధ్య పోరాటం చేస్తున్నారు. ఈ ఐదుగురిలో ముగ్గురు వైద్యులుగా పనిచేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు కళ్లలో కన్నీరుని ఆపుకోలేకపోయారు. ఒకరి వివాహ వార్షికోత్సవం నవంబర్ 30న ఉంది. మరొకరి మృతిడి పెళ్లి ఈ ఏడాది జనవరిలో జరిగనుంది. కుటుంబంలోని పెద్ద కొడుకు తన తొమ్మిది మంది తోబుట్టువుల బాధ్యత మొత్తాన్ని ఒంటరిగా మోస్తున్నాడు. ఈ ప్రమాదంలో అందరికీ ప్రాణాలు పోసే వైద్య వృత్తిని చేపట్టిన వైద్యులు అక్కడిక్కడే మృతి చెందడం అందరినీ కలిచివేసింది.

బుధవారం ఉదయం ఇటావా సైఫాయ్ మెడికల్ కాలేజీకి చెందిన ఆరుగురు సిబ్బంది లక్నోలో ఓ వివాహ వేడుకక్కి వెళ్లి వస్తుండగా ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. డాక్టర్ స్నేహితుడి సోదరుడి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో తలగ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై వీరి కారు అదుపు తప్పి డివైడర్‌ను డీ కొట్టింది. అప్పుడు వీరి కారుని అటువైపు వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు డాక్టర్స్, ఒకరు లాబ్ టెక్నీషియన్ , ఒకరు స్టోర్ కీపర్ గా తమ విధులను నిర్వహిస్తున్నారు.

నవంబర్ 30న వివాహ వార్షికోత్సవం

ఆ అయిదుగురిలో ముగ్గురు అలాంటి డాక్టర్లు.. వీరి కథ విని అందరి కళ్లు చెమ్మగిల్లాయి. భదోహి నివాసి సంతోష్ మౌర్యకు ఇద్దరు పిల్లలు. 7వ తరగతి చదువుతున్న కూతురు, 3వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. నవంబర్ 30న సంతోష్ వివాహ వార్షికోత్సవం. ఇతని వివాహ వర్షికోత్సాన్ని జరుపించడానికి తోటి డాక్టర్లు సిద్ధమవుతున్నారు. బాడీ బిల్డింగ్ అంటే ఇష్టపడే డాక్టర్ నరదేవ్. ఎన్నో బాడీ బిల్డింగ్ పోటీల్లో కూడా పాల్గొన్నాడు. తన హాబీని సోషల్ మీడియాలో తెలియజేస్తూ రకరాకాల ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉండేవాడు.

ఇవి కూడా చదవండి

ఒక వైద్యుడికి బాడీ బిల్డింగ్ అంటే చాలా ఇష్టం

నరదేవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉండేవాడు. తన బాడీ బిల్డింగ్‌కు సంబంధించిన అనేక వీడియోలను పోస్ట్ చేసేవాడు. నరదేవ్ జనవరిలో వివాహం చేసుకోబోతున్నాడు. అయితే ఇంతలోనే మృత్యువు కబళించింది. ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కన్నౌజ్‌లోని మోచిపూర్ అకిల్‌పూర్ నివాసి అరుణ్ కుమార్‌ కథ అంతకంటే దారుణం.. ఇతనికి మొత్తం తొమ్మిది మంది సోదరులు, సోదరీమణులు ఉన్నారు. వీరిలో ఆరుగురు సోదరీమణులు,3 సోదరులు ఉన్నారు. అరుణ్ తండ్రి వ్యవసాయం చేస్తుంటాడు. కుటుంబంలోని పిల్లలందరూ చాలా ప్రామిసింగ్, హార్డ్ వర్కింగ్ పర్సన్స్.

ఎంబీబీఎస్‌ కోసం తన పొలాన్ని కూడా అమ్మేశాడు

అరుణ్ మెడికల్ చదువుల కోసం అతని తండ్రి పొలాన్ని కూడా అమ్మేశాడు. ఆ తర్వాత MBBS చేసి ఇప్పుడు MDకి సిద్ధమవుతున్నాడు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. తన మొత్తం కుటుంబాన్ని బాగా చూసుకోవాలని.. తన తోడబుట్టిన వారు లైఫ్ లో సెటిల్ అయ్యేలా చేయాలనుకున్నాడు. అయితే ఇంట్లోనే ఈ ప్రమాదం అతని మొత్తం కుటుంబంన్ని విషాదంలోకి నెట్టేసింది. అరుణ్‌ మృత దేహాన్ని చూసి అరుణ్ చెల్లెళ్లు, తల్లి షాక్ తిన్నారు. అతని వృద్ధ తల్లి స్పృహతప్పి పడిపోయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..