Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేం పనిరా సామీ..! జీతం పెంచకపోవడంతో మాల్ ఉద్యోగి చేసిన పనికి అంతా షాక్..!

నిందితుడు కమల్ పవార్ షాపింగ్ మాల్‌లోని ఎలక్ట్రానిక్ విభాగంలో ఉంచిన వస్తువులను ధ్వంసం చేశాడు. 11 టీవీ స్క్రీన్లను ఒకదాని తర్వాత ఒకటిగా పగలగొట్టాడు.

ఇదేం పనిరా సామీ..! జీతం పెంచకపోవడంతో మాల్ ఉద్యోగి చేసిన పనికి అంతా షాక్..!
Caused Damage In The Mall
Balaraju Goud
|

Updated on: Nov 28, 2024 | 10:14 AM

Share

మధ్యప్రదేశ్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో ఓ ఉద్యోగి తన యజమానిపై ప్రతీకారం తీర్చుకున్నారు. మాల్‌లోని వస్తువులను ధ్వంసం చేసి భారీ నష్టం కలిగించాడు. సుమారు రూ.18 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను సదరు ఉద్యోగి పాడు చేశాడు. షాపింగ్ మాల్‌లోని ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఉంచిన ఎల్‌ఈడీ టీవీ, ఫ్రిజ్‌లను ఉద్యోగి పగులగొట్టిన మొత్తం సంఘటన సీసీ టీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యింది.

ఈ ఘటనలో నిందితుడు కమల్ పవార్ షాపింగ్ మాల్‌లోని ఎలక్ట్రానిక్ విభాగంలో ఉంచిన వస్తువులను ధ్వంసం చేశాడు. 11 టీవీ స్క్రీన్లను ఒకదాని తర్వాత ఒకటిగా పగలగొట్టాడు. దీని తరువాత, అతను రిఫ్రిజిరేటర్ విభాగానికి వెళ్లి 71 రిఫ్రిజిరేటర్లను పాడు చేశాడు. అయితే ఈ పనిని బయటి వ్యక్తి చేయలేదని, మాల్ స్వంత ఉద్యోగులచే చేశారని అనుమానించిన యాజమాని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. దీంతో అసలు వ్యవహారం బయటపడింది.

మాల్ ఉద్యోగి కమల్ పవార్ దీపావళికి ముందు తన మాల్ ఆపరేటర్ నుండి జీతం పెంచాలని డిమాండ్ చేశాడు. కానీ అతని డిమాండ్ నెరవేరకపోవడంతో, అదే కోపంలో మూడు రోజులు సెలవు తీసుకున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత మాల్‌లో ఇలా చేశాడు. ఈ ఘటనపై మాల్ మేనేజర్ సంజయ్ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాల్‌లోని వస్తువులను పాడు చేశారనే ఆరోపణలతో సదరు ఉద్యోగిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినప్పటికీ నిందితుడి మానసిక పరిస్థితిని సాకుగా చూపి బెయిల్ పొందారు. ప్రస్తుతం పోలీసులు తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

ఈ మొత్తం విషయం గురించి కొత్వాలి టిఐ రవికాంత్ దేహరియా మాట్లాడుతూ, ఈ సంఘటన సిసిటివి ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ ఘటనపై మాల్ నిర్వాహకుడు ఫిర్యాదు చేయడంతో, తక్షణమే చర్య తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మాల్ మేనేజర్ సంజయ్ గుప్తా మాట్లాడుతూ.. తన సొంత ఉద్యోగి ఇలాంటి ఘటనకు పాల్పడతాడని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. దాదాపు రూ.18 లక్షల విలువైన టీవీ, ఫ్రిజ్ వంటి పాడైన ఈ విద్యుత్ ఉపకరణాలను విక్రయించడమే వారి ముందున్న అతిపెద్ద సవాలుగా మారిందన్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..