AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న వయస్సులోనే జుట్టు నెరిసిపోవడానికి కారణం అదేనట.. ముందే అలర్టవ్వండి

నేటి కాలంలో, చిన్న వయస్సులోనే జుట్టు తెల్లగా మారుతుంది. కొంతమంది జుట్టుకు రంగులు కూడా వేస్తున్నారు.. అయితే చిన్న వయసులోనే నెరిసిన వెంట్రుకలు ఎందుకు వస్తున్నాయి? దీని గురించి నిపుణులు ఏమంటున్నారు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

చిన్న వయస్సులోనే జుట్టు నెరిసిపోవడానికి కారణం అదేనట.. ముందే అలర్టవ్వండి
White Hair
Shaik Madar Saheb
|

Updated on: Nov 28, 2024 | 10:31 AM

Share

నేటి కాలంలో, చిన్న వయస్సులోనే జుట్టు నెరిసే సమస్య బాగా పెరిగింది. ఒకప్పుడు వృద్ధుల్లో ఈ సమస్య కనిపించేది.. కానీ.. ఇప్పుడు 30 నుంచి 35 సంవత్సరాల వయస్సులో ఉన్న వారి జుట్టు కూడా బూడిద రంగులోకి మారి.. క్రమంగా తెల్లబడుతోంది.. మీకు కూడా ఈ సమస్య ఉన్నా.. చిన్న వయసులోనే జుట్టు ఎందుకు నెరిసిపోతుంది..? లోపం ఏమిటి..? నిపుణులు ఏం చెబుతున్నారు.. పూర్తి వివరాలు తెలుసుకోండి.. శరీరంలో విటమిన్ల లోపం వల్ల జుట్టు నెరసిపోయే ప్రమాదం పెరుగుతుందని.. ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్‌ హాస్పిటల్‌ డెర్మటాలజీ విభాగం మాజీ అధిపతి డాక్టర్‌ భావుక్‌ ధీర్‌ చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్ బి12, విటమిన్ డి, విటమిన్ బి9 లోపించడం వల్లనే చిన్నవయసులోనే జుట్టు నెరిసిపోతుందని.. ఇదే కారణమని తెలిపారు.. 2019లో, ది లాన్సెట్ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన ఒక నివేదికలో.. చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడానికి ప్రధాన కారణం విటమిన్ లోపం అని పేర్కొంది. క్యాల్షియం లోపం వల్ల చాలా మందిలో జుట్టు కూడా బూడిద రంగులోకి మారుతుందని వివరించారు.

పిత్తం అధికంగా ఉత్పత్తి అయినా జుట్టు తెల్లబడవచ్చు…

శరీరంలో పిత్తం ఎక్కువగా ఉత్పత్తి అయ్యే వారి జుట్టు కూడా చిన్న వయసులోనే తెల్లగా మారుతుందని ఢిల్లీ ప్రభుత్వంలోని ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ ఆర్.పి.పరాశర్ చెబుతున్నారు. అంతే కాకుండా చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడానికి సరైన ఆహారం కూడా ఒక ప్రధాన కారణం. పైత్యరసం అధికంగా ఉత్పత్తి కావడం వల్ల జుట్టు మూలాలు దెబ్బతింటాయి. దీని వల్ల జుట్టు నెరిసిపోతుంది. పిత్తం అధికంగా ఉత్పత్తి కావడం వల్ల కొంతమందికి శరీరంలో మెలనిన్ లేకపోవడం వల్ల జుట్టు రంగుపై ప్రభావం చూపుతుంది. మీ శరీరంలో పిత్తం అధికంగా ఉత్పత్తి అవుతుంటే త్రిఫలాన్ని తినండి.. మీరు రోజూ శీతలీ ప్రాణాయామం కూడా చేయవచ్చు.

విటమిన్ లోపాన్ని ఎలా అధిగమించాలి

విటమిన్ బి12, బి9 లోపాన్ని అధిగమించాలంటే ఆకుకూరలు, పండ్లను ఆహారంలో చేర్చుకోవడం చాలా అవసరమని డైటీషియన్ డాక్టర్ అంజిల్ వర్మ చెబుతున్నారు. ఇది కాకుండా, మీరు గుడ్డు, సాల్మన్ చేపలను కూడా తినవచ్చు. విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి, పాలు, పెరుగు, గుడ్లు తినవచ్చు. అయితే, మీరు ముందుగా మీ విటమిన్ బి12, విటమిన్ డి పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. ఈ విటమిన్ లోపిస్తే వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు. దీనితో, విటమిన్ లోపాన్ని సులభంగా భర్తీ చేయవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి