భక్తుడి బ్యాగ్‌లోని సెల్ ఫోన్ కొట్టేసిన కోతి.. పాపం ముప్పతిప్పలు పెట్టి చివరికి ??
అల్లరి చేష్టలకు కేరాఫ్ కోతి. ఆలయాల వద్ద ఎక్కువగా సందడి చేస్తుంటాయి ఈ కోతులు. దైవ దర్శనానికి వచ్చిన భక్తుల చేతుల్లో ఉన్న బ్యాగులను, ప్రసాదాలను, ఇతర వస్తువులను లాక్కెళ్లిపోయి ముప్పు తిప్పలు పెడుతుంటాయి. తాజాగా కొండగట్టు అంజన్న ఆలయంలో ఓ భక్తుడిని ముప్పు తిప్పలు పెట్టింది ఓ కోతి. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నవ్వులు పూయిస్తోంది.
ఈ కోతి చేష్టలు నెటిజన్లను నవ్వించినా.. ఆ భక్తుడిని మాత్రం చాలా టెన్షన్ పెట్టేసింది. కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన భక్తుడు స్వామి దర్శనానికి వెళ్తున్నాడు. స్వామి స్మరణలో ఆదమరిచి ఉన్న ఆ భక్తుడి బ్యాగుపైన కన్నేసింది ఓ కోతి. ఇంకేముంది..అతని చేతిలో ఉన్న బ్యాగ్ లాక్కొని వెళ్లి ఆలయ గోపురం పైన కూర్చుంది. ఎంత బ్రతిమిలాడినా బ్యాగు ఇవ్వలేదు. బ్యాగులో ఏమున్నాయోనని అంతా వెతికింది. కానీ దానికి తినడానికి ఏమీ దొరకలేదు. ఇంతలో ఓ పులిహోర ప్యాకెట్ తెచ్చి ఆ కోతికి చూపించాడు ఆ భక్తుడు. దాంతో బ్యాగును వదిలేసి పులిహోర ప్యాకెట్ పట్టుకొని వెళ్లిపోయింది. వెళ్తూ వెళ్తూ నీవిచ్చిన పులిహోరకి బ్యాగ్ మాత్రమే వస్తుంది.. ఫోన్ కావాలంటే ఇంకేదైనా తీసుకురా అన్నట్టు.. సెల్ ఫోను పట్టుకొని వెళ్లిపోయింది. దీంతో ఆ భక్తుడు సెల్ఫోన్ కోసం నానా తంటాలు పడ్డాడు. ఆ భక్తుడు నిస్సహాయంగా చూస్తుండిపోయాడు. దాంతో కోతికి ఏమనిపించిందో కానీ, చివరికి గోపురం పైనే ఫోన్ వదిలిపెట్టి అక్కడినుండి వెళ్ళిపోయింది. వెంటనే గోపురం పైకి ఎక్కి సెల్ ఫోన్ తీసుకున్నాడు ఆ భక్తుడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dhanush: నయనతారపై కేసు పెట్టిన ధనుష్
రిలీజ్ అయిన 20 రోజుల్లోనే OTTకి వచ్చిన నిఖిల్ కొత్త సినిమా
Top 9 ET News: పుష్ప2కు రూ.300 కోట్ల రెమ్యూనరేషన్ మనోడే టాప్
Priyanka Jain: తిరుమలలో ప్రియాంక ప్రాంక్ వీడియో !! హెచ్చరించిన భక్తులు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

