AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eye Care: ఈ అలవాట్లతో కళ్ల సమస్యలే రావు.. ఆరోగ్యంగా ఉంటాయి..

కళ్లు శరీరంలో ముఖ్యమైన ముఖ్యం. ఇది చాలా సున్నితంగా ఉంటాయి. కంటి చూపును చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే కంటి చూపు పోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పే అలవాట్లు అలవరచుకుంటే కళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి..

Eye Care: ఈ అలవాట్లతో కళ్ల సమస్యలే రావు.. ఆరోగ్యంగా ఉంటాయి..
Remedies for Dry EyesImage Credit source: pixabay
Chinni Enni
|

Updated on: Nov 28, 2024 | 12:49 PM

Share

కంటి చూపు అనేది చాలా ముఖ్యం. కళ్లు సరిగ్గా కనిపిస్తేనే ఏదన్నా చేయగలం.. దేనినైనా గుర్తించగలం. కళ్లు సరిగా కనిపించకుండా ఏ పనీ చేయలేం. అందుకే శరీరంలో అతి ముఖ్యమైన భాగాల్లో కళ్లు ముందు ఉంటాయి. పెద్దలు కూడా సర్వేద్రియానాం ప్రధానం అంటారు. మీ కళ్లను ఎంత ఆరోగ్యంగా చూసుకుంటే.. మీరు అన్నింటినీ చూడగలరు. మనిషికి కంటి చూపు చాలా ముఖ్యం. ఈ విషయం తెలిసి కూడా తమ నిర్లక్ష్యాలతో అనేక దృష్టి సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. చిన్న పిల్లలోనే కళ్ల జోడు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతీ పది మందిలో ఒకరు కంటి సమస్యలతో బాధ పడుతున్నారు. కళ్లు ఆరోగ్యంగా ఉండాలేంటే ఈ అలవట్లను అలవాటు చేసుకోండి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.

స్క్రీనింగ్‌కి దూరంగా ఉండండి:

ఈ మధ్య కాలంలో కంటి సమస్యలు ఎక్కువగా పెరిగిపోవడానికి ముఖ్య కారణాల్లో స్క్రీనింగ్ కూడా ఒకటి. సెల్ ఫోన్స్, ల్యాప్ ట్యాప్స్, టీవీలు ఎక్కువగా చూడటం వల్ల ఆ రేడియేషన్‌కి కంటి సమస్యలు బాగా ఎక్కువ అవుతున్నాయి. దీంతో కంటిపై ఒత్తిడి అనేది ఎక్కువగా పడుతుంది. కళ్లు పొడిబారడం, నొప్పులు రావడం జరుగుతుంది. కాబట్టి స్క్రీనింగ్ సమయాన్ని తగ్గించాలి.

సన్ గ్లాసెస్ ధరించండి:

కళ్లు ఆరోగ్యంగా పని చేయాలంటే సన్ గ్లాసెస్ ధరించాలి. బయట నుంచి వచ్చే యూవీ కిరణాల నుంచి కళ్లు రక్షించుకోవాలంటే సన్ గ్లాసెస్ ధరించాలి. దీని వల్ల సూర్య రశ్మి నేరుగా కళ్ల మీద పడదు. దీంతో కంటి సమస్యలు తక్కువగా వస్తాయి.

ఇవి కూడా చదవండి

నీటిని తాగండి:

కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు కళ్లు తేమగా ఉండేలా చూసుకోవాలి. కాబట్టి కళ్లు ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉండేలా నీటిని తాగాలి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కళ్లు పొడిబారవు. కంటి లూబ్రికేషన్‌ను మెయిన్‌టైన్ చేయవచ్చు.

పరీక్షలు చేయించుకోండి:

మీ కల్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు కూడా చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే ఏవైనా సమస్యలను మొదటిలోనే పరిష్కరించుకోవచ్చు. లేదంటే అవి మరింత పెద్దగా పెరిగే ప్రమాదం ఉంది.

ఆహారం:

కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారంతోనే కళ్లు 75 శాతం ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి మీరు తినే ఫుడ్స్‌లో విటమిన్లు ఏ, ఇ, సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉండేలా చూసుకోండి. అదే విధంగా కంటి నిండా నిద్ర కూడా చాలా అవసరం. నిద్ర సరిగ్గా ఉంటేనే కళ్లు చక్కగా కనిపిస్తాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..