Konidela Upasana: క్రిస్మస్‌ రోజు ఉపాసన ధరించిన ఈ డ్రస్‌ ధర ఎంతంటే..

మెగాస్టార్ కోడలు, రామ్‌చరణ్‌ సతీమణి గానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అపోలో ఫౌండేషన్‌ వైస్‌ ఛైర్‌ పర్సన్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటోంది.

Konidela Upasana: క్రిస్మస్‌ రోజు ఉపాసన ధరించిన ఈ డ్రస్‌ ధర ఎంతంటే..
Follow us
Basha Shek

|

Updated on: Dec 28, 2021 | 1:52 PM

మెగాస్టార్ కోడలు, రామ్‌చరణ్‌ సతీమణి గానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అపోలో ఫౌండేషన్‌ వైస్‌ ఛైర్‌ పర్సన్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటోంది. ప్రధానంగా మూగ జీవాల సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు, క్యాంపెయిన్లు నిర్వహిస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్‏గా ఉండే ఉపాసన ఫిట్‏నెస్, వైద్యం, కుకింగ్‌ టిప్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తుంటారు. కాగా ఇటీవల క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంది మెగా ఫ్యామిలీ. మెగా- అల్లు కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి సందడి చేశారు. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి.

కాగా క్రిస్మస్‌ వేడుకల్లో సెంట్రాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు ఉపాసన- రామ్‌ చరణ్‌ దంపతులు. ఈ సందర్భంగా రెడ్‌ అండ్‌ వైట్‌ కలర్‌ కాంబినేషన్‌ సిల్క్‌ మిడ్డీ డ్రస్‌లో ఎంతో అందంగా కనిపించింది ఉపాసన. డ్రెస్‌పై స్ట్రిప్స్‌, సెల్ఫ్‌ టై ఫ్యాషన్‌ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ డ్రెస్ గురించి చాలామంది ఆరాతీయగా పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. చూడడానికి ఎంతో సాదాసీదాగా కనిపించే ఈ డ్రస్‌ ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ‘డోల్స్‌ అండ్‌ గబ్బానా బ్రాండ్‌కు చెందినదట. ధర కూడా సుమారు రూ. 2.5 లక్షలకు పైగానే ఉంటుందట. కాగా ఈ డ్రెస్‌ ధర విషయం తెలుసుకున్న అభిమానులు, నెటిజన్లు ముక్కుమీద వేలేసుకుంటున్నారు. కాగా ఏ డ్రస్‌లోనైనా ఉపాసన అందంగా కనిపిస్తుందంటూ చాలామంది కామెంట్లు పెట్టారు.

Also Read:

Omicron: కరోనా నుంచి కోలుకున్నాక కూడా కొన్ని నెలల పాటు ఒంట్లోనే వైరస్‌.. అమెరికన్‌ శాస్త్రవేత్తల అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు..

Rajinikanth: మరోసారి మంచి మనసు చాటుకున్న రజనీకాంత్.. పేద విద్యార్థుల కోసం..

Kurnool: పుల్లారెడ్డి మిఠాయిల దుకాణంలో చోరీ.. నగదుతో పాటు స్వీట్స్‌ కూడా అపహరించుకెళ్లిన దొంగ..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే