Hair Care Tips: ఉప్పు నీటి కారణంగా మీ జుట్టు రాలిపోతుందా? అయితే ఇలా చేయండి..

Hair Care Tips: చాలా మంది ఇళ్లలో మాత్రమే హార్డ్ వాటర్ ఉపయోగించబడుతుంది. ఉప్పునీరు చర్మానికి, జుట్టుకు హానీ తలపెడుతుంది. అందుకే.. ఉప్పు నీటి సమస్యను వదిలించుకోవడానికి..

Hair Care Tips: ఉప్పు నీటి కారణంగా మీ జుట్టు రాలిపోతుందా? అయితే ఇలా చేయండి..
Hairfall Issue
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 28, 2021 | 7:04 PM

Hair Care Tips: చాలా మంది ఇళ్లలో మాత్రమే హార్డ్ వాటర్ ఉపయోగించబడుతుంది. ఉప్పునీరు చర్మానికి, జుట్టుకు హానీ తలపెడుతుంది. అందుకే.. ఉప్పు నీటి సమస్యను వదిలించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వాటిని ఫిల్టర్ చేస్తుంటారు. కానీ, అలా చేసినా జుట్టుకు, చర్మానికి ప్రమాదకరమే అని చెబుతుంటారు. సాధారణంగా ఉప్పు నీటిలో మినరల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ మినరల్ కంటెంట్ ఎక్కువగా ఉంటే జుట్టుకు సంబంధించిన సమస్యలు మొదలవుతాయి. వెంట్రుకలు బలహీనపడటం, జుట్టు నిస్తేజంగా మారడం, పొడిబారడం జరుగుతుంది. చివరకు జుట్టు రాలుతుంది. ఉప్పు నీటితో ఎక్కువగా తలస్నానం చేయడం వల్ల ఈ సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఉప్పు నీటి వల్ల చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలను మీరు కూడా ఎదుర్కొంటున్నారా? అయితే, ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు చిన్న చిట్కాలను నిపుణులు చెబుతున్నారు. వీటిసాయంతో జుట్టు రాలే సమస్యను నివారించవచ్చునని తెలిపారు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాటర్‌ను ఫిల్టర్ చేయడం.. మీ కుళాయిలో నీళ్లు ఉప్పు నీరు అయితే వాటిని ఫిల్టర్ చేయడం ఉత్తమం. ఇలా చేయడం ద్వారా ఉప్పు నీటిలో ఉండే మినరల్ కంటెంట్ తగ్గుతుంది. హార్డ్ వాటర్‌ని ఫిల్టర్ చేయడం ద్వారా.. జుట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం లబిస్తుంది. నీటిని ఫిల్టర్ చేసే మిషన్లు కూడా ప్రస్తుతం విరివిగా అందుబాటులో ఉన్నాయి.

వర్షంలో తడకుండా ఉండాలి.. ఉప్పు నీటిలో జుట్టు తడవడం వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది. అందుకే దాదాపుగా వర్షంలో తడకుండా ఉండేందుకు ప్రయత్నించండి. వర్షం నీటిలో తడవడం వల్ల జుట్టు పొడిబారడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

షాంపూ వాడకం మంచిది.. ఉప్పు నీళ్లతో స్నానం చేసే వారు షాంపూని వాడితే ప్రయోజనం ఉంటుంది. ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. అయితే, వారానికి ఒకసారి మాత్రమే ఇలా చేయాలి. ఎందుకంటే.. షాంపులో రసాయనాలు ఉంటాయి. ఎక్కువగా ఉపయోగిస్తే జుట్టు బలహీనపడి.. రాలిపోతుంది.

కండీషనర్ తప్పనిసరి.. ఉప్పునీటి వల్ల జుట్టు పొడిబారడం, డల్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి జుట్టును హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. జుట్టును హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి కండీషనర్ ను అప్లై చేయాలి. ఉప్పు నీళ్లతో తలస్నానం చేసిన తర్వాత జుట్టుకు కండీషనర్ అప్లై చేసి 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు హైడ్రేషన్‌తో పాటు మృదువుగా కూడా ఉంటుంది.

Also read:

New Year Celebrations: మందుబాబులకు గుడ్ న్యూస్.. వైన్ షాప్స్, బార్లపై రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం..!

ESIC Recruitment 2021-22 : ఈఎస్ఐసిలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..

Andhra Pradesh: కృష్ణా జిల్లాలో దారుణం.. ప్రభుత్వ పథకాలు అందనీయడం లేదంటూ వ్యక్తి ఆత్మహత్య..

యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం