Hair Care: జట్టు బాగా రాలుతుందా..? నిపుణుల సూచనలతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు తెలుసా..?

ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలడం సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. ఈ సమస్యను తగ్గించడానికి అనేక రకాల కెమికల్ ప్రొడక్ట్స్, ఆయుర్వేద ప్రొడక్ట్స్,

Hair Care: జట్టు బాగా రాలుతుందా..? నిపుణుల సూచనలతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు తెలుసా..?
Hair Fall
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 17, 2022 | 10:05 AM

ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలడం సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. ఈ సమస్యను తగ్గించడానికి అనేక రకాల కెమికల్ ప్రొడక్ట్స్, ఆయుర్వేద ప్రొడక్ట్స్, హోమ్ రెమిడీస్ ఉపయోగిస్తుంటారు. అయినా ఈ సమస్య పరిష్కారం కాదు. తాజాగా డెర్మాటాలజిస్ట్ నిపుణులు డాక్టర్ గీతికా మిట్టల్ గుప్తా తన ఇన్ స్టాలో కొన్ని చిట్కాలను తెలియజేశారు. రోజుకు 50 నుంచి 100 వరకు జుట్టు రాలడం సాధరణమని.. అంతకు మించి రాలిపోతే తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని తెలిపారు. అయితే ఈ సమస్యను అధిగమించడానికి ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని చిట్కాలను తెలియజేశారు.

జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ముందుగా.. CBC, విటమిన్ డి 3, BR2 సహా అనేక రక్త పరీక్షలను చేయించుకోవాలని తెలిపారు. ఇలా చేయడం వలన జుట్టు రాలడానికి గల కారణాలు తెలిసిపోతాయి. అలాగే ఇంట్లోనే కొన్ని చిట్కాలను ప్రయత్నించవచ్చు.

– జుట్టును బిగుతుగా ఉండే హెయిర్ స్టైల్స్ చేయకూడదు.. అలాగే పోనీటెయిల్స్ చేయకూడదు. దీనివలన జుట్టు తెగిపోతుంది. దీంతో జుట్టు రాలిపోతుంది. – సిల్క్ దిండు కవర్ ఉపయోగించాలి. ఇది రాపిడిని తగ్గించి జుట్టు చిట్లిపోకుండా చేస్తుంది. – మీ జుట్టు రకానికి సరిపోయే షాంపూలను మాత్రమే ఉపయోగించాలి. – జుట్టు రాలడాన్ని నియంత్రించేందుకు ప్రతి రోజూ కొన్ని హెయిర్ సీరమ్‏లను ఉపయోగించండి. – జుట్టు సమస్యలకు తగ్గించేందుకు మంచి నిద్ర, ఒత్తిడి లేని జీవనశైలి అవసరం. అలాగే పోషకాహరం తీసుకోవాలి. ఎల్లప్పుడు హైడ్రేట్ గా ఉండేలా చూసుకోవాలి. అలాగే మొటిమల విషయంలో హోమ్ రెమిడీస్ కాకుండా. ముందుగా వైద్యులను సంప్రదించాలని సూచించారు.

గమనిక: – ఈ కథనం కేవలం నిపుణుల సలహాలు.. ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. సూచనలు పాటించే ముందు వైద్యులను సంప్రదించాలి.

Also Read: Bigg Boss OTT: బిగ్‏బాస్ ఓటీటీ కంటెంస్టెంట్స్ వీళ్లే.. నెట్టింట్లో పైనల్ లిస్ట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Rashmika Mandanna: లవ్ మ్యారేజ్ చేసుకోవడం పై నోరు విప్పిన నేషనల్ క్రష్.. అతడే నా భర్త అంటూ..

Horoscope Today: వీరికి మానసిక ఒత్తిడి ఎక్కువ.. చేసే పనులలో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశి ఫలాలు..

Mirnalini Ravi: ఎర్ర చీరలో వయ్యారాలు వలకబోస్తున్న ‘మృణాళిని రవి’ లేటెస్ట్ ఫొటోస్…