Rashmika Mandanna: లవ్ మ్యారేజ్ చేసుకోవడం పై నోరు విప్పిన నేషనల్ క్రష్.. అతడే నా భర్త అంటూ..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Feb 17, 2022 | 6:37 AM

ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ హీరోయిన్లలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఒకరు. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది.

Rashmika Mandanna: లవ్ మ్యారేజ్ చేసుకోవడం పై నోరు విప్పిన నేషనల్ క్రష్.. అతడే నా భర్త అంటూ..
Rashmika

ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ హీరోయిన్లలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఒకరు. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల అల్లు అర్జున్ సరసన పుష్ప బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్‏లోనూ ఈ అమ్మడు బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. తాజాగా.. తాను లవ్ మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తే ఇంట్లో ఒప్పించి చేసుకుంటానని మనసులో మాటలు బయటపెట్టింది. నిన్న జరిగిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ప్రమోషన్స్‏లో ప్రేమ, ప్రేమ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. ఎవరి దగ్గర అయితే సెక్యూర్‏గా ఫీల్ అవుతామో.. కంఫర్ట్‏గా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ స్నేహంగా ఉంటాం అనిపిస్తుందో అతడే జీవితంకు మంచి లైఫ్ పార్టనర్.. అలాంటి వాడినే భర్తకు ఎంచుకుంటానని చెప్పుకొచ్చింది.

టాలెంటెడ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో రష్మిక హీరోయిన్ గా కనిపించనుంది. ఇందులో రాధిక, కుష్బు కీలకపాత్రలలో నటించిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలై పోస్టర్స్, టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ క్రమంలో నిన్న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రష్మిక తన పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. ఇద్దరు వ్యక్తులు సమనంగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అది లవ్ అవుతుంది… అలా కాకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేనప్పుడు అది వన్ సైడ్ లవ్ గానే ఉంటుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్నా.. ఇంట్లో వారిని ఒప్పించే చేసుకుంటానని మనసులో మాట చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన ఫోకస్ పూర్తిగా కెరీర్ పైనే పెట్టినట్లు తెలిపింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా రష్మిక రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాము మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు.

Also Read: Viral Photo: అపరంజి బొమ్మ.. అందాల జాబిల్లి.. అప్పట్లో తెలుగునాట సెన్సేషన్.. ఎవరో గుర్తించారా..?

Sreeleela : ఈ ముద్దుగుమ్మ అదృష్టం మామూలుగాలేదుగా.. మహేష్ మూవీలో ఆ పాత్రలో శ్రీలీల

AP Movie Ticket Issues: ఊ అంటారా.. ఊఊ అంటారా? సినిమా టికెట్లపై తేల్చేయనున్న ప్రత్యేక కమిటీ

Bhumika: బీచ్ లో రచ్చ చేస్తు ఫోటోలకు ఫోజులిచ్చిన టాలీవుడ్ ముద్దుగుమ్మ… తరగని అందంతో భూమిక వైరల్ అవుతున్న ఫొటోస్…

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu