AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bappi Lahiri: ఆ పాత మధురం రష్యా గాయకుడి నోట.. బప్పీలహరి పాట.. వీడియో వైరల్..

Bappi Lahiri : భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తన సంగీతంతో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న బప్పిలహిరి (69)మరణంతో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. సినీ పరిశ్రమకు డిస్కో సాంగ్స్(Disco Song) ను..

Bappi Lahiri: ఆ పాత మధురం రష్యా గాయకుడి నోట.. బప్పీలహరి పాట.. వీడియో వైరల్..
Bappilahari
Surya Kala
|

Updated on: Feb 16, 2022 | 9:27 PM

Share

Bappi Lahiri : భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తన సంగీతంతో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న బప్పిలహిరి (69)మరణంతో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. సినీ పరిశ్రమకు డిస్కో సాంగ్స్(Disco Song) ను  పరిచయం చేసిన బప్పీలహరి.. భారతీయ సంగీతాన్ని.. వెస్ట్రన్ మ్యూజిక్ కలిపి మిక్స్ చేసి.. సరికొత్తగా సంగీతాన్ని ఆవిష్కరించారు. దాదాపు నలభై ఏళ్ళు పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగిన బప్పీలహరి.. తన ఐకాన్ సాంగ్స్ తో సంగీత ప్రియులను అలరించారు.

బప్పీలహరి అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. ఆయన కుమారుడు అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో ఉన్నారు. తండ్రి మరణ వార్త విన్న ఆయన అమెరికా నుంచి భారత్ కు పయనమనట్లు తెల్సుతుంది. దీంతో బప్పి తనయుడు ఇండియా వచ్చిన అనంతరం ముంబై లో అంతిమక్రియలు నిర్వహించనున్నారు. 1952లో పశ్చిమబెంగాల్ లో బప్పిలహిరి జన్మించారు. దాదాపు 500 సినిమాలకు, 5 వేల పాటలకు ఆయన సంగీతాన్ని అందించారు.

అయితే ఇప్పుడు బప్పీలహరి తన సాంగ్స్ తో దేశ సరిహద్దులను దాటి అభిమానులను సంపాదించుకున్నారు.. తాజాగా ఓ పాత పాట ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతోంది. రష్యా కు చెందిన ఓ వ్యక్తి  మిదున్ చక్రవర్తి, బప్పీలహరి కాంబినేషన్ లో వచ్చిన హిట్ సాంగ్‌ను ఆలపించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. రష్యన్ పాడిన డిస్కో డ్యాన్సర్ పాట ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఇప్పుడు మళ్ళీ చక్కర్లు కొడుతోంది. ఈ వైరల్ వీడియోలోని వ్యక్తి అచ్చం మిథున్ చక్రవర్తిలా డ్రెస్ చేసుకున్నారు. టాలెంట్ షోలో భాగంగా ఈ పాట పాడినట్టు తెలుస్తోంది. 2015 లో నవంబర్ లో అప్ లోడ్ చేసిన ఈ వీడియోని దాదాపుగా 1.5కోట్ల మంది వీక్షించడం విశేషం.

Also Read:

కొత్త ఆటగాళ్లకు అదిరిపోయే వెల్కమ్‌ చెప్పిన రాజస్థాన్‌ రాయల్స్‌.. షారుఖ్‌ ఖాన్‌ పాటతో..