Gangubai Kathiawadi: విడుదలకు ముందే ‘గంగూబాయ్​ కతియావాడీ’కు మరో షాక్.. కుటుంబం పరువు తీశారంటూ..

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించిన గంగూబాయ్​ కతియావాడీ సినిమా పై రోజుకొక వివాదం పుట్టుకొస్తుంది. తాజాగా ఫిబ్రవరి 25న థియేటర్లలో సందడి చేయనున్న 'గంగూబాయ్​ కతియావాడీ' సినిమాకు ఊహించని షాక్‌ తగిలింది.

Gangubai Kathiawadi: విడుదలకు ముందే 'గంగూబాయ్​ కతియావాడీ'కు మరో షాక్.. కుటుంబం పరువు తీశారంటూ..
Alia Bhatt
Rajeev Rayala

|

Feb 17, 2022 | 5:32 PM

Gangubai Kathiawadi: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించిన గంగూబాయ్​ కతియావాడీ సినిమా పై రోజుకొక వివాదం పుట్టుకొస్తుంది. తాజాగా ఫిబ్రవరి 25న థియేటర్లలో సందడి చేయనున్న ‘గంగూబాయ్​ కతియావాడీ’ సినిమాకు ఊహించని షాక్‌ తగిలింది. ఈ సినిమా పై గంగూబాయ్​ కుటుంబసభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో తన తల్లిని వేశ్యగా చూపించారని ఆరోపిస్తూ గంగూబాయ్​ దత్తపుత్రుడు రావుజీ షా కోర్టుకెక్కారు. “నా తల్లిని వేశ్యగా మార్చారు. ఇప్పుడు అనేకమంది అమ్మ అసలు వేశ్యనా లేదా సామాజిక కార్యకర్తనా అంటూ అవమానిస్తున్నారు. ఇలాంటి మాటలు మమ్మల్ని బాధిస్తున్నాయి. మా అందరి మానసిక స్థితి బాగాలేదు.. మా అమ్మగురించి అలాంటి మాటలు మాట్లాడుతుంటే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం.” అని ఆవేదన వ్యక్తం చేశారు బాబు రావుజీ షా.

డబ్బు కోసం దురాశతో కుటుంబం పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు గంగూబాయి మనవరాలు భారతి. డబ్బుపై దురాశతో ఈ సినిమా మేకర్స్‌ అంతా నా కుటుంబం పరువు తీశారు. దాన్ని ఎట్టిపరిస్థితిలోనూ అంగీకరించలేం. ఈ ప్రాజెక్ట్‌తో ముందుకు సాగడానికి ముందు మీరు మా కుటుంబం అనుమతి అడగలేదు. అలాగే మీరు పుస్తకం రాసేటప్పుడు మా దగ్గరికీ ఎవ్వరూ రాలేదు. సినిమా తీయడానికి ముందు మా అనుమతి తీసుకోండి అని అన్నారు. నా అమ్మమ్మ తన జీవితాంతం అక్కడ సెక్స్ వర్కర్ల అభ్యున్నతికి కృషి చేసింది. కానీ ఈ వ్యక్తులు మా అమ్మమ్మను అభ్యంతరకరంగా చూపిస్తున్నారు?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు భారతి. దీనిపై సంజయ్ లీలా భన్సాలీ, అలియా భట్‌లకు సమన్లు ​జారీ చేసిన ముంబయి కోర్టు

ముంబయిలోని మాఫియా క్వీన్‌ గంగూబాయ్​ జీవితం ఆధారంగా సంజయ్‌ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో బాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సినిమా ‘గంగూబాయి కతియావాడి’. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో అలియా భట్ ప్రధాన పాత్రలో కనిపిస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందే ట్రైలర్‌ని విడుదల చేసి మేకర్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశారు. 2.37 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో అలియా తన నట విశ్వరూపాన్ని చూపించి ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమాలో అలియా భట్‌తో పాటు అజయ్ దేవగన్ కూడా కనిపించబోతున్నాడు. ముంబై డాన్ కరీం లాలా పాత్రలో అజయ్ దేవగన్ నటించగా.. ఇప్పటికే కరోనా కారణంగా చాలాసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ నెల 25న విడుదల అవుతోంది.

ట్రైలర్‌లో వచ్చిన కొన్ని డైలాగ్స్‌ గంగూభాయి పాత్రను నిర్ధారిస్తున్నాయి. ట్రైలర్‌లో వచ్చే ‘కామాటిపురలో అమావాస్య రాత్రి కూడా వెలుగు ఉంటుంది.. ఎందుకంటే అక్కడ గంగూబాయి ఉంటుంది’, ‘మీకు నా మాటలు అభ్యంతకరంగా అనిపించవచ్చు. కానీ మీకంటే ఎక్కువ గౌరవం మాకే ఉంది. ఎందుకంటే.. మీరు ఒక్కసారి మర్యాద పోగొట్టుకుంటే మొత్తం పోయినట్లే. కానీ మేము ప్రతి రోజూ రాత్రి మా గౌరవాన్ని అమ్ముకుంటాం.. కానీ మా గౌరవం ఎప్పటికీ పోదు’ అని చెప్పే డైలాగ్‌లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. గతంలో కూడా అనేక సినిమాలలో కథపై, పాటలపై, డైలాగ్స్‌పై వివాదాలు చెలరేగాయి.. శ్రీ మంజునాథ సినిమాలో శివుడిని విమర్శిస్తూ పాట, శ్రీ రామదాసు సినిమాలో రాముడిని విమర్శిస్తూ పాట అంటూ వివాదం రేగిన విషయం తెలిసిందే. … 2021, డిసెంబర్‌… టీమిండియా మాజీ సారథి కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ ‘83’ మూవీ పై కూడా వివాదం తలెత్తింది. ఈ సినిమా నిర్మాతలు చీటింగ్ చేశారంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫైనాన్షియల్ కంపెనీ ఫిర్యాదు చేసింది. సినిమా హక్కులు ఇస్తామని చెప్పి 15.90 కోట్లు ఖర్చు చేయించారని.. తీరా చూస్తే తమను మోసం చేశారంటూ ముంబై కోర్టును ఆశ్రయించారు. అలాగే  2020 అక్టోబర్‌… శ్రీలంక మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ పై తమిళనాడులో వివాదం రేగింది. చివరికి ఈ సినిమా నుంచి తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి తప్పుకున్నారు. శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సను మురళీధరన్‌ గతంలో సపోర్ట్ చేయడమే తమిళుల ఆగ్రహానికి కారణం.

తెలుగులో గతంలో వచ్చిన దేవినేని, వంగవీటి బయోపిక్‌లపై ఆంధ్రప్రదేశ్‌లో వివాదాలు చెలరేగాయి తమ అనుమతి లేకుండా సినిమాను తెరకెక్కించడంపై వారి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు 2019… ఎవరికి వారు ఇష్టానుసారంగా అమ్మ జయలలిత బయోపిక్ లను రెడీ చేస్తున్నారనీ, రేపు తెరపైకి వచ్చేసరికి తప్పుగా చూపించే ఆస్కారం లేకపోలేదు అంటూ మద్రాస్ హై కోర్టును ఆశ్రయించారు జయలలిత మేనకోడలు దీప జయకుమార్‌. ఇక 2019… నందమూరి బాలకృష్ణ తీసిన ఎన్టీఆర్‌ బయోపిక్‌లో నాదెండ్ల భాస్కరరావు పాత్ర విషయంలో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఇదే సినిమాలో తన పాత్రను కూడా విలన్‌గా చూపిస్తున్నారని లక్ష్మీపార్వతి ఆరోపణలు చేశారు. అలాగే స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం. ఈ చిత్ర కథపై కూడా వివాదం రేగింది. పన్నులు వసూళ్ల పేరుతో ప్రజలను చిత్రహింసలు పెట్టిన పాలెగాడు నరసింహారెడ్డి అని, కేవలం తమకు దక్కాల్సిన భరణాల విషయంపైనే బ్రిటీష్‌ వారిపై తిరుగుబాటు చేసిన వ్యక్తి స్వాతంత్ర సమరయోధుడు కాజాలడని వాదించారు కొంతమంది. మరో పక్క రాయల్టీగా డబ్బుల కోసం కేసు పెట్టారు ఉయ్యాలవాడ వంశస్థులు. అదేవిధంగా 2018.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా లో వెన్నుపోటు పాట తో ఆర్జీవి వివాదాస్ప‌దం అయ్యింది.  చంద్రబాబుని విలన్‌గా చూపించారని.. ఆ పాట పై టిడిపి శ్రేణులు ఫైర్ అయ్యారు. ఆర్జీవి పై టిడిపి నేత‌లు.. టిడిపి నేత‌ల పై ఆర్జీవి కేసులు న‌మోదు చేసుకున్నారు కూడా..

మరిన్ని ఇక్కడ చదవండి :

Sreemukhi: మెస్మరైజ్ చేస్తున్న శ్రీముఖి లేటెస్ట్ ఫోటోస్.. ఆమె అందానికి ఫిదా అవ్వాల్సిందే

ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్స్ ధరలపై కమిటీ కీలక నిర్ణయం.. వారం రోజుల్లోనే ప్రభుత్వం నుంచి..

Priyamani: పరువాలతో మైమరిపిస్తున్న ప్రియమణి లేటెస్ట్ శారీ పిక్స్ వైరల్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu