AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skincare: అందమైన చర్మం మీసొంతం కావాలా?.. అయితే ఈ 7 సూత్రాలు పాటించండి..

Skincare: ముఖారవిందం కోసం అనేక రకాల చికిత్సలు చేయించుకోవడం, అనేక రకాల క్రీములు వాడటం చూస్తుంటాం. కానీ, చిన్న చిన్న అంశాలను మాత్రం విస్మరిస్తుంటాం.

Skincare: అందమైన చర్మం మీసొంతం కావాలా?.. అయితే ఈ 7 సూత్రాలు పాటించండి..
Beauty Tips
Shiva Prajapati
| Edited By: |

Updated on: Aug 11, 2021 | 6:49 AM

Share

Skincare: ముఖారవిందం కోసం అనేక రకాల చికిత్సలు చేయించుకోవడం, అనేక రకాల క్రీములు వాడటం చూస్తుంటాం. కానీ, చిన్న చిన్న అంశాలను మాత్రం విస్మరిస్తుంటాం. మనకు ఇంటలో లభించే చిన్నపాటు వస్తువులతోనే అందమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా సరైన నిద్ర ముఖారవిందాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందట. ముఖ వర్చస్సును పెంచుకోవడానికి రాత్రి కీలక సమయం అని నిపుణులు చెబుతున్నారు. నిద్ర తరువాత క్లీన్, టోన్, మాయిశ్చరైజ్, ఆరోగ్యకరమైన ఆహారం, సహజ పదార్థాలు అందం పెరిగేందుకు ఉపకరిస్తాయి. చర్మ సంరక్షణకు పాటించాల్సిన విధానాలు..

మంచి నిద్ర.. సాధారణంగా ముఖారవిందం కోసం క్రీమ్స్, క్లెన్సర్‌ని ఉపగిస్తుంటారు. అయితే, ఇవి శాశ్వత పరిష్కారం కాదు. ఎక్సోఫోలియేటింగ్ క్లెన్సర్స్ కారణంగా చర్మం దెబ్బతినడం, పొడివారడం, నిర్జీవంగా మారడానికి దోహదపడుతాయి. గాఢమైన నిద్ర.. దీనికి చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు. సరైన నిద్ర పోవడం వల్ల ముఖ వర్చస్సు సహజసిద్ధంగా పెరుగుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ కలిగి ఉండాలి.. వంటగదిలో లభించే ఈ ఆపిల్ సైడర్ వెనిగర్.. ఎలాంటి రసాయనాలు వాడకుండానే మీ ముఖ వర్చస్సును సహజంగా పెంచేలా ఉపకరిస్తుంది. దీని ద్వారా మీ చర్మం మృదువుగా మారుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ మీ చర్మాన్ని మృదువుగా చేయడమే కాకుండా.. ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ గాయాలను త్వరగా మాన్పుతుంది. ప్రతీ రోజూ ముఖంపై ఆపిల్ సైడర్‌ వెనిగర్‌ని అప్లై చేయడం వలన కొద్ది రోజుల తరువాత మీ ముఖంలో మార్పులు స్పష్టంగా గమనించవచ్చు.

పడుకునే ముందు ఫేస్ మాస్క్.. చాలా మంది ఉదయం సమయంలో ఫేస్ మాస్క్ వేసుకుంటుంటారు. అయితే, రాత్రి పడుకునే ముందు షీట్/ఫేస్ మాస్క్ వేసుకోవడం ఉత్తమం అని బ్యూటీషియన్స్ చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు ఫేస్ మాస్క్ వేసుకోవడం ద్వారా గాఢమైన నిద్ర కారణంగా ఉదయానికి ముఖం ఫ్రెష్‌గా, మరింత మెరుస్తూ కనిపిస్తుంటుంది.

సాయంత్రం వేళల్లో సాల్టీ ఫుడ్ తినొద్దు.. సాయంత్రం సమయంలో సాల్ట్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తినొద్దు. అలాంటి ఆహారం తీసుకోవడం వల్ల మీ కళ్ల కింద ఉబ్బినట్లుగా మారుతుంది. అయితే, ఒకవేళ కళ్ల కింద ఉబ్బినట్లుగా ఉన్నట్లయితే.. డీ-పఫింగ్ రెమెడీని వాడితే తగ్గుతుంది. కానీ, సాధ్యమైనంత వరకు ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోకపోవడం ఉత్తమం అని చెబుతున్నారు.

నూనెలకు భయపడవద్దు.. నూనెల గురించి అస్సలు దిగులు చెందొద్దు. ముఖ్యమైన నూనె పదార్థాలు.. చర్మం బయటి పొరను కాపాడుతాయి. అలాగే డీఎన్ఏ దెబ్బతినకుండా పోరాడటానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి. ప్రతీ రోజూ రాత్రి వేళ.. ఆయిల్‌తో చర్మాన్ని మర్ధనా చేయాలి. ఆపై రోజువారీ నైట్ క్రీమ్‌ను ముఖానికి అప్లై చేసుకుని పడుకోవాలి.

విటమిన్ సి.. ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం కోసం ముఖ్యమైన పదార్ధాలలో ఒకటి విటమిన్ సి ఒకటి. ఇది ముఖారవిందం పెరుగుదలకు సూపర్‌గా పని చేస్తుంది. ముదురు మచ్చలను తొలగిస్తుంది. స్కిన్‌టోన్‌ను మెరుగుపరుస్తుంది. అంతేకాదు.. విటమిన్ సి మీ కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాల నిర్మూలనకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే నిద్రపోయే ముందు.. విటమిన్ సి అధికంగా ఉండే క్రీమ్‌ను మీ కళ్ల కింద మచ్చలు కలిగిన ప్రాంతాల్లో రాయండి. కొద్ది రోజుల్లోనే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.

Also read:

Crime News: తల్లిని బెదిరించి ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం.. ఆపై పురుగుల మందు తాగించి..

Immunity booster : పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ ఆహారాన్ని తినిపించండి..

Viral Video: హలో బ్రదర్ ఇదేం డ్యాన్స్.. ఇలా కూడా చేస్తారా?.. వీడియో చూడండి.. కడుపుబ్బా నవ్వుకోండి..