Sleep Myths: పెద్దలు పెట్టిన ఈ శయన సూత్రాలు పాటించండి.. ఆరోగ్యంగా, దీర్ఘాయుష్యంతుడిగా జీవించండి
Sleeping Myth or Fact: ఎమ్మెన్సీ కంపెనీలలో ఉద్యోగాలు.. వారి సమయానికి అనుగుణంగా విధులు నిర్వహించాల్సిన పరిస్థితి.. దీంతో వేళాపాళా లేని ఉద్యోగ సమయాలయ్యాయి. దీంతో తినే సమయం నుంచి నిద్రించే సమయం..
Sleeping Myth or Fact: ఎమ్మెన్సీ కంపెనీలలో ఉద్యోగాలు.. వారి సమయానికి అనుగుణంగా విధులు నిర్వహించాల్సిన పరిస్థితి.. దీంతో వేళాపాళా లేని ఉద్యోగ సమయాలయ్యాయి. దీంతో తినే సమయం నుంచి నిద్రించే సమయం వరకూ అన్నింటిలోనూ మార్పులు వచ్చాయి. వీటి ప్రభావం ఆరోగ్యంపై కూడా పడుతుంది. కానీ మన పురాణాల్లో నిద్రించే సమయంలో కొన్ని నియమాలను, పద్దతులను సూచించాయి. ఆ సూత్రాలను పాటిస్తే.. మనిషి ఆరోగ్యంగా ఉంటారని పెద్దల నమ్మకం.. శయన నియమాలను గురించి తెలుసుకుందాం.
పడుకోవాలంటే పాటించాల్సిన పదహారు సూత్రాలు :
*నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో ఒంటరిగా నిద్రపోకూడదు. అంతేకాదు దేవాలయం, స్మశానవాటికలో కూడా పడుకోకూడదని మనుస్మృతిలో పేర్కొంది. *నిద్రపోతున్నవారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదని విష్ణుస్మృతి తెలిపింది. *విద్యార్థి, నౌకరు, ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతుంటే .. వీరిని మేల్కొలపవచ్చునని చాణక్య నీతి చెప్పిన సూత్రం *దేవీ భాగవతం.. ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం బ్రహ్మా ముహూర్తంలో నిద్ర లేవాలని సూచింది. పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దని పద్మ పురాణము పేర్కొంది. *తడి పాదాలతో నిద్రించవద్దు. పొడి పాదాల తో నిద్రించడం వలన ధనం ప్రాప్తిస్తుందని అత్రి స్మృతిలో పేర్కొంది. *విరిగిన పడకపై, ఎంగిలి మొహం తో పడుకోవడం నిషేధమని మహాభారతం తెలిపింది. *నగ్నంగా, వివస్త్రలులై పడుకోకూడదు ఇది గౌతమ ధర్మ సూత్రం సూచిస్తుంది. *తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన విద్య, పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన ప్రబల చింత, ఉత్తరం వైపు తల పెట్టి నిద్రించిన హాని, మృత్యువు, ఇక దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించినచో ధనము, ఆయువు ప్రాప్తిస్తుంది. ఆచార మయూఖ్ లో పేర్కొంది. *పగటిపూట ఎపుడు కూడా నిద్రించవద్దు. పగటిపూట నిద్ర రోగహేతువు, ఆయుక్షీణత కలుగచేస్తుంది *పగటిపూట సూర్యోదయం, సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి , దరిద్రులు అవుతారని బ్రహ్మా వైవర్తపురాణం పేర్కొంది. *సూర్యాస్తమయానికి ఒక ప్రహారం .. అంటే సుమారు మూడు గంటల తరువాత నే నిద్రపోవాలి. * ఎడమవైపు పడుకోవడం వలన స్వస్థత లభిస్తుంది. * దక్షిణ దిశలో పాదములు పెట్టి ఎపుడు నిద్రించరాదు. యముడు, దుష్ట గ్రహాల నివాసం వుంటారు. దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. మెదడుకు రక్త సరఫరా మందగిస్తుంది. మతిమరుపు, మృత్యువు లేదా అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడుతాయని పెద్దల నమ్మకం. * గుండెపై చేయి వేసుకుని, కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు. * మంచం పై త్రాగడం, తినడం చేయకూడదు. * పడుకొని పుస్తక పఠనం చేయరాదు.. అలా చేయడం వలన నేత్ర జ్యోతి మసకబారుతుంది. *.నుదుటన బొట్టు లేదా తిలకం ధరించి నిద్రించడం అశుభం కావున పడుకొనే ముందు తీసివేయండి.
ఈ పదహారునియమాలను అనుసరింస్తూ నిద్రించే వారు యశస్వి, ఆరోగ్యవంతుడు, దీర్ఘాయుష్మంతుడు అవుతారని మన పూర్వీకుల నమ్మకం.
Also Read: ఇతరులు చేసే తప్పులకు.. వేరొకరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది.. చాణుక్యుడు వివరించిన నీతి సూత్రాలు