Chanakya Niti: ఇతరులు చేసే తప్పులకు.. వేరొకరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది.. చాణుక్యుడు వివరించిన నీతి సూత్రాలు
Chanakya Niti: గుప్తల కాలాన్ని స్వర్ణయుగం. ఆ కాలానికి చెందిన చాణక్యుడు తన అసమాన ప్రతిభాపాటవాలతో గుప్త సామ్రాజ్యంలో సుస్థిర పాలనకు బీజం వేశాడు. తత్వవేత్తగా, ఆర్థికవేత్తగా, ఆచార్యునిగా మన్ననలు అందుకున్నాడు కౌటిల్యుడు..
Chanakya Niti: గుప్తల కాలాన్ని స్వర్ణయుగం. ఆ కాలానికి చెందిన చాణక్యుడు తన అసమాన ప్రతిభాపాటవాలతో గుప్త సామ్రాజ్యంలో సుస్థిర పాలనకు బీజం వేశాడు. తత్వవేత్తగా, ఆర్థికవేత్తగా, ఆచార్యునిగా మన్ననలు అందుకున్నాడు కౌటిల్యుడు. ఆయన రచించిన రాజనీతి గ్రంథమైన అర్థశాస్త్రం ప్రస్తుత సమకాలీన రాజకీయాలకు అద్దం పడుతోంది. భారతీయ ఆర్థశాస్త్ర పితామహుడిగా ప్రసిద్ధిగాంచిన చాణక్యుడు రాజనీతి, అర్థశాస్త్రాలను ఆకళింపు చేసుకున్నాడు. చాణక్యుడు తెలిజేసిన చాలా సూత్రాలు ఇప్పటి సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
ఇతరులు చేసే పనులు వల్ల వేరొకరు ఎలా కర్మఫలాలు అనుభవించాల్సి వస్తుందనే దాని గురించి ఆచార్య చాణక్య తన చాణక్య నీతిలో వివరించారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. ఒక రాజు పాలనలో మంత్రులు, పూజారులు, సలహాదారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేనప్పుడు, ఆ రాష్ట్ర రాజు కూడా తన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించలేకపోతాడు. ఫలితంగా అతను తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. అందుకే.. అతని తప్పుడు నిర్ణయాలకు కేవలం రాజ మందిరంలోని పూజారులు, సలహాదారులు, మంత్రులు మాత్రమే బాధ్యత వహిస్తారు. అంతేకాదు.. రాజు తప్పుడు నిర్ణయాల వల్ల అతని రాజ్యంతో సంబంధం ఉన్న వ్యక్తులతో సహా రాజ్యంలోని ప్రజలందరూ శిక్షించబడతారు. అందుకే రాజుకు సరైన మార్గాన్ని చూపించడం రాజమందిరంలో ఉండే పూజారి, సలహాదారు, మంత్రి ప్రధాన విధి. రాజుకు సరైన సలహా ఇవ్వడం, అతను తప్పు చేయకుండా నిరోధించడం వారి విధని ఆచార్య చాణక్యుడు తెలిపారు.
2. వివాహం తర్వాత, భార్యాభర్తల సంబంధమే కాదు.. వారి జీవితాలు కూడా ఒకరితో మరొకరు ముడిపడి ఉంటాయని ఆచార్య చాణక్య చెప్పారు. ఈ నేపథ్యంలో, భార్య తప్పు చేస్తే.. తన విధులను సక్రమంగా నిర్వర్తించకపోతే, ఆమె భర్త కూడా ఆమె చర్యలకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల ఇద్దరూ ఎల్లప్పుడూ ఒకరికొకరు సఖ్యతతో.. మెలగుతూ.. సరైన మార్గాన్ని అనుసరించాలని సూచించారు.
3. ఒక శిష్యుడు ఒక మంచి పని చేస్తే, అప్పుడు గురువు కూడా కీర్తిని పొందుతాడు. ఒకవేళ అతను తప్పు చేస్తే, దాని పర్యవసానాలను గురువు కూడా అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల, గురువు తన శిష్యుడు తప్పు చేయకుండా ఆపి, అతనికి మార్గనిర్దేశం చేయాలి అని చాణక్య కర్మ ఫలాలను వివరించారు.
Also Read: గ్రామస్థుల కోసం.. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 108 కేజీల కారంతో స్నానం చేసిన పూజారి ఎక్కడంటే