Cactus Fruit: డ్రాగన్ ఫ్రూట్ కంటే.. బ్రహ్మజెముడు పండులో పోషకాలు మెండు.. ఈ పండుతింటే ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో
Cactus Fruit: బ్రహ్మజెముడు ఔషధ మొక్క. ఇంకా చెప్పాలంటే ఇటీవల చైనా నుంచి దిగుమతి అవుతున్న డ్రాగన్ ఫ్రూట్ కంటే వెయ్యి రేట్లు పోషకాలు, ఔషధగుణాలు కలిగిన అత్యుత్తమ బ్రహ్మజెముడు పండ్లు. నిలువెల్లా ముళ్లనుండే బ్రహ్మజెముడు..
Cactus Fruit: బ్రహ్మజెముడు ఔషధ మొక్క. ఇంకా చెప్పాలంటే ఇటీవల చైనా నుంచి దిగుమతి అవుతున్న డ్రాగన్ ఫ్రూట్ కంటే వెయ్యి రేట్లు పోషకాలు, ఔషధగుణాలు కలిగిన అత్యుత్తమ బ్రహ్మజెముడు పండ్లు. నిలువెల్లా ముళ్లనుండే బ్రహ్మజెముడు నీటి ఎద్దడిని తట్టుకుని ఇసుక నేలల్లో పెరిగే మొక్క.. అందుకనే వీరిని ఎడారి మొక్కలని కూడా అంటారు. ముళ్ళు ఎక్కువ ఉండడంతో.. వ్యవసాయ పంట రక్షణ కోసం వీటిని పొలం చుట్టూ కంచెగా పెంచుతారు. పిండినల్లి తప్ప మరే ఇతర కీటకాలు ఆశించని ఈ మొక్కలు మంచి వాణిజ్య పంట.
ఎరుపు, గులాబి రంగులో ఉండే బ్రహ్మ జెముడు పండ్లలో మంచి పోషకాలున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ కంటే 1000 రెట్లు B12, A, C విటమిన్లు ఉన్నాయి. వీటి పండ్లతో జామ్స్, స్వాకష్, ఐస్‌క్రీమ్స్, జ్యూస్, జెల్లీలు తయారు చేసుకోవచ్చు. పండు గింజల నుంచి నూనె కూడా తీయవచ్చు. ఈ మొక్కలో ఎలాంటి హానికర పదార్థాలు లేవని అమెరికన్ పుడ్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికే ప్రకటించింది. అంతేకాదు ఈ బ్రహ్మజెముడు పండ్లను అమెరికన్లు అల్పాహారంగా తీసుకుంటారు.
బ్రహ్మజెముడు పండ్ల గుజ్జుతో ప్రూట్ బార్ , బ్రహ్మజెముడు పండ్ల స్క్వాష్ లను తయారు చేస్తున్నారు. అంతేకాదు హానికరం కానీ హెర్బల్ ఆల్కహాల్ ను తయారీ చేయడానికి కూడా పరిశోధనలు చేస్తున్నారు. ఈ పండులో పోషక విలువతో పాటు ఔషధ గుణాలు ఉన్నాయి. కాలేయ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధి నివారణకు బ్రహ్మజెముడు పండ్లు ఉపయోగపడతాయి. కార్బొహైడ్రేడ్లు, విటమిన్లు, పీచుపదార్థాలు అధికంగా ఉన్నాయి. ఈ పండ్లలో ఔషధ గుణాలు స్థూలకాయం, మధుమేహం, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తాయి.
ఏ బ్రహ్మజెముడు పండులో అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు ,బీటాలైన్లు, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు వంటి ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి
Also Read: Pro Kabaddi 2021: ప్రో కబాడీ లీగ్ సీజన్ 8 . ఆటగాళ్లు వేలానికి రెడీ.. ఎప్పుడు ఎక్కడ ఏ తేదీల్లో అంటే..