Premature Graying of Hair: చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటానికి అసలు కారణం ఇదేనట..!
వయసు పైబడే కొద్దీ జుట్టు నెరియడం సర్వసాధారణం. కానీ నేటి కాలంలో చిన్న వయస్సులోనే జుట్టు తెల్ల రంగులోకి మారుతుంది. ఓ రకంగా చెప్పాలంటే నేటి కాలంలో యువతలో ఈ సమస్య సర్వసాధారణమైపోయింది. పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యంతో పాటు ఇందుకు ఇంకా అనేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. దీనివల్ల చిన్నతనంలోనే పిల్లల వయసు ఎక్కువగా కనిపించి క్రమంగా వారిలో ఆత్మన్యూనతా..

వయసు పైబడే కొద్దీ జుట్టు నెరియడం సర్వసాధారణం. కానీ నేటి కాలంలో చిన్న వయస్సులోనే జుట్టు తెల్ల రంగులోకి మారుతుంది. ఓ రకంగా చెప్పాలంటే నేటి కాలంలో యువతలో ఈ సమస్య సర్వసాధారణమైపోయింది. పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యంతో పాటు ఇందుకు ఇంకా అనేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. దీనివల్ల చిన్నతనంలోనే పిల్లల వయసు ఎక్కువగా కనిపించి క్రమంగా వారిలో ఆత్మన్యూనతా భావం కలుగుతుంది.
సాధారణంగా తెల్ల జుట్టు సమస్యను అరికట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. వాటిని దాచడానికి చాలా మంది హెయిర్ కలర్‌లు ఉపయోగిస్తుంటారు. కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు. అంతకంటే ముందుగా చిన్నతనంలోనే జుట్టు నెరియడానికి గల కారణాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. చిన్న వయస్సులో జుట్టు తెల్ల రంగులోకి మారడానికి కారణాలను ఘజియాబాద్‌లోని చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ సౌమ్య సచ్‌దేవా వివరించారు. ఆమె ఏం చెబుతున్నారంటే.. నేటి రోజుల్లో 16 నుంచి 28 ఏళ్ల పిల్లల్లో జుట్టు నెరిసే సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. దీని వెనుక చాలా కారణాలున్నాయి. వ్యవస్థాగత కారణాలు కూడా ఉండవచ్చు. శరీరంలో పలు రకాల పోషకాలు లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంద. అకాలంగా జుట్టు తెల్లబడటానికి గల కారణాలు అన్వేషించడానికి విటమిన్ B12, D3, థైరాయిడ్, సీరం ఫెర్రిటిన్ పరీక్షలు చేయించుకోవచ్చు.
ఈ బ్లడ్ టెస్ట్‌ల ద్వారా శరీరంలో ఏ విటమిన్ తక్కువగా ఉందో తెలుసుకోవచ్చు. దీని ఆధారంగా వైద్యులు సప్లిమెంట్లను ఇస్తారు. అలాగే అనారోగ్య జీవనశైలి కూడా జుట్టు అకాలంగా నెరసిపోవడానికి మరో ప్రధాన కారణం. వీటిలో మద్యం, సిగరెట్, ఇతర వ్యసనాలు, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం, రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం సరైన సమయానికి నిద్ర లేవకపోవడం వంటివాటితోపాటు చెడు ఆహారపు అలవాట్లు కూడా కారణమే. ఈ జీవనశైలి కారకాలన్నీ కలగలిసి జుట్టును ప్రభావితం చేస్తాయి. అంతే కాకుండా ఈ రోజుల్లో కూరగాయలు, పండ్లలో అనేక రకాల రసాయనాలు కలుపుతున్నారు. వీటిని తిన్ని జుట్టు త్వరగా నెరిసిపోతుందని డాక్టర్ సౌమ్య హెచ్చరిస్తున్నారు. ఇక కొన్ని సమస్యలు వంశపారంపర్యంగా రావడం మనం గమనిస్తూనే ఉంటాం. అలాంటి వాటిలో జుట్టు తెల్లబడడం కూడా ఒకటి. పిల్లల తల్లిదండ్రులకో, వారి తాతముత్తాతలకో ఇలా చిన్న తనంలో జుట్టు నెరిసే సమస్ ఉంటే.. వారికి కూడా చిన్నతనంలోనే ఈ సమస్య వచ్చే అవకాశాలుంటాయి.








