Karnataka: మీరు తాగుతున్న టీ విషపూరితం అని మీకు తెలుసా..! క్యాన్సర్ కు వెల్కమ్ చెబుతున్నరంటూ హెచ్చరిక..
ఫుడ్ సేఫ్టీ అధికారులు పానీ పూరీ దుకాణాలు, బండ్ల నుంచి తేయాకుకు సంబంధించిన నమూనాలు సేకరించారు. ఈ శాంపిల్స్ లో టీ విషపూరితమైనదని రుజువు అయింది. ఈ రోజు ఈ విషయం ఎలా రుజువు అయిందో తెలుసుకుందాం.. టీ, రోడమైన్ బి, కార్మోసైన్ ఫుడ్ కలర్ వంటి ఉత్పత్తులను టీ ఆకులను ప్రాసెసింగ్ చేసే సమయంలో వీటిని కలుపుతారని ఢిల్లీలోని ధర్మశాల ఆసుపత్రి క్యాన్సర్ సర్జన్ డాక్టర్ అన్షుమన్ చెప్పారు. దీనితో తయారు చేసిన టీ తాగడం వల్ల శరీరంలో వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు

టీ లేకుండా భారతీయుల రోజు ప్రారంభం కాదు. కొంతమంది రోజుని టీ తాగాడంతోనే ప్రారంభిస్తారు. మరికొందరికి టీ తాగకపోతే తలనొప్పి వస్తుంది. ఈ వ్యసనం కారణంగా ఆందోళన కూడా ప్రారంభమవుతుంది. టీ ప్రియులు తమకు ఇష్టమైన పానీయం తాగకుండా ఉండలేరు. అయితే ఈ టీ మనల్ని క్యాన్సర్ పేషెంట్‌గా కూడా మార్చగలదని మీకు తెలుసా..! కడుపు లేదా ఇతర సమస్యలకు టీ ప్రధాన కారణం అయినప్పటికీ.. ఇప్పటికీ కొంతమంది టీకి బానిసలుగా మారి సమయానికి టీ తాగితే చాలు అన్నట్లుగా ఎదురుచూస్తారు. టీ తయారు చేస్తున్నప్పుడు దీనికి రంగులు వేస్తున్నారు. ఇలా చేయడం వల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నివేదికలో విషపూరితమైన టీని తయారుచేస్తున్నట్లు.. కర్ణాటకలో సేకరించిన టీ ఆకుల శాంపిల్స్ పరీక్షలో వెల్లడైందని పేర్కొన్నది.
ఇంతకుముందు కర్ణాటకలో పానీ పూరీ నుంచి నీటి శాంపిల్స్ తీసుకున్నారు. ఈ శాంపిల్స్ లలోని 71 నమూనాలలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని వెల్లడైంది. ఇదే రాష్ట్రంలో గోబీ మంచూరియన్, కాటన్ మిఠాయి వంటి స్ట్రీట్ ఫుడ్స్‌లో కలర్ మిక్సింగ్ కేసుల గురించి FSSAI నివేదించింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు పానీ పూరీ దుకాణాలు, బండ్ల నుంచి తేయాకుకు సంబంధించిన నమూనాలు సేకరించారు. ఈ శాంపిల్స్ లో టీ విషపూరితమైనదని రుజువు అయింది. ఈ రోజు ఈ విషయం ఎలా రుజువు అయిందో తెలుసుకుందాం..
అసలు విషయం ఏమిటి
ఫుడ్ సేఫ్టీ అధికారులు కర్నాటకలోని పానీపూరి వంటి స్ట్రీట్ బండ్ల వద్ద లభించే టీ ఆకుల శాంపిల్స్ ను సేకరించారు. నివేదికల ప్రకారం టీ డస్ట్, పురుగుమందులు, రంగులను కలపడం ద్వారా టీ ఆరోగ్యానికి ప్రమాదకరం అని తేలింది. ఉత్తర కర్ణాటక నుంచి దాదాపు 50 శాంపిల్స్ తీసుకోగా టీ ఆకులను తయారు చేసే సమయంలో భారీ మొత్తంలో పురుగుమందులు వాడుతున్నట్లు తేలిందని చెబుతున్నారు. నివేదికల ప్రకారం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే Rhodamine-B , Tartrazine సంకలితాలను ఆహార పదార్థాలను ఆకర్షణీయంగా చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇది పెను ప్రమాదానికి సంకేతమని హెచ్చరిస్తున్నారు.
నిపుణులు ఏమని చెప్పారంటే
టీ, రోడమైన్ బి, కార్మోసైన్ ఫుడ్ కలర్ వంటి ఉత్పత్తులను టీ ఆకులను ప్రాసెసింగ్ చేసే సమయంలో వీటిని కలుపుతారని ఢిల్లీలోని ధర్మశాల ఆసుపత్రి క్యాన్సర్ సర్జన్ డాక్టర్ అన్షుమన్ చెప్పారు. దీనితో తయారు చేసిన టీ తాగడం వల్ల శరీరంలో వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలం తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. రోడమైన్ బి అనేది క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనం. అయితే వీటిని టీలో కలపకపోతే ప్రమాదం లేదన్నారు.
మిల్క్ టీ సైడ్ ఎఫెక్ట్స్
చాలా మంది భారతీయులు పాలతో కూడిన టీని ఇష్టపడతారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఈ టీని రోజూ తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఈ పద్ధతిలో తయారుచేసిన టీని ఖాళీ కడుపుతో తాగుతారు. దీని కారణంగా జీవక్రియ బలహీనంగా మారుతుంది. ఇలా చాలా కాలం పాటు జరిగితే ఆ వ్యక్తి ఉబ్బరం, ఆమ్లత్వం, ఇతర కడుపు సంబంధిత ఆరోగ్య సమస్యలకు గురవుతారు. టీలో కెఫిన్ ఉంటుంది. ఇది రాత్రి సమయంలో నిద్ర వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఈ టీని ఎక్కువగా తీసుకుంటే రాత్రి నిద్రలేమికి గురవుతారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








