Cobblers Pose: ఈ ఆసనంతో ట్యాబ్లెట్స్ అవసరం లేకుండా నడుము నొప్పికి బైబై చెప్పొచ్చు!

ఈ మధ్య కాలంలో ఎంతో మంది ఇబ్బంది పెట్టే సమస్యల్లో నడుము నొప్పి కూడా ఒకటి. ఎక్కువ సేపు కూర్చొని పని చేసే వాళ్లకు ఈ సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అంతే కాకుండా బరువులు ఒక్కటే సారి ఎత్తినా, ఒకే భంగిమలో ఎక్కువగా నిద్రపోయినా, బరువున్న బ్యాగులు మోసినీ నడుము నొప్పి వస్తుంది. ఈ నడుము నొప్పి సమస్యను ఇంట్లోనే చిన్న టిప్స్‌తో ఈ ఒక్క ఆసనం వేస్తే ఈజీగా చెక్ పెట్టొచ్చు. అదే కోబ్లర్స్ పోజ్. నడుము నొప్పి సమస్య ఉన్నవారు ఈ ఆసనం ప్రతి రోజూ..

Cobblers Pose: ఈ ఆసనంతో ట్యాబ్లెట్స్ అవసరం లేకుండా నడుము నొప్పికి బైబై చెప్పొచ్చు!
Cobblers Pose
Follow us
Chinni Enni

|

Updated on: Jul 12, 2024 | 1:23 PM

ఈ మధ్య కాలంలో ఎంతో మంది ఇబ్బంది పెట్టే సమస్యల్లో నడుము నొప్పి కూడా ఒకటి. ఎక్కువ సేపు కూర్చొని పని చేసే వాళ్లకు ఈ సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అంతే కాకుండా బరువులు ఒక్కటే సారి ఎత్తినా, ఒకే భంగిమలో ఎక్కువగా నిద్రపోయినా, బరువున్న బ్యాగులు మోసినీ నడుము నొప్పి వస్తుంది. ఈ నడుము నొప్పి సమస్యను ఇంట్లోనే చిన్న టిప్స్‌తో ఈ ఒక్క ఆసనం వేస్తే ఈజీగా చెక్ పెట్టొచ్చు. అదే కోబ్లర్స్ పోజ్. నడుము నొప్పి సమస్య ఉన్నవారు ఈ ఆసనం ప్రతి రోజూ వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ కోబ్లర్స్ ఆసనాన్నే.. బద్ద కోనాసనం అని కూడా పిలుస్తారు. ఈ నడుము నొప్పిని తగ్గించే బద్ద కోనాసనం ఎలా వేస్తారు? ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

బద్ద కోనాసనం ఎలా వేయాలి..

ముందుగా ఈ ఆసనం వేసేందుకు యోగా మ్యాట్ మీద కూర్చోవాలి. ఆ తర్వాత కాళ్లను నిదానం ముందుకు చాపండి. పాదాలు ఒక దానితో మరొకటి తాకాలి. బొటన వేళ్లు పైకి ఉండాలి. అర చేతులను భూమికి ఆనించాలి. నిటారుగా కూర్చుని మీ గడ్డం భాగాన్ని కాస్త లోపలికి ఆనించాలి. మీ చూపు ఎదురుగా ఉండాలి. ఆ తర్వాత మీ కాళ్లను మెల్లికా శరీరం వైపుకు తీసుకు రావాలి.

బొటన వేళ్లు మాత్రం కాస్త బయటి వైపు చూస్తున్నట్లు ఉండాలి. పాదాలను సాధ్యమైనంత వరకు మీ యోని ప్రాంతానికి తీసుకెళ్లండి. ఆ తర్వాత మీ చేతులను మోకాళ్ల మీద పెట్టండి. ఇప్పుడు ఈ ఆసనంలో కనీసం రెండు నిమిషాలు అయినా నిదానం శ్వాస తీసుకుంటూ కూర్చోవాలి. అయితే కీళ్ల నొప్పులు ఉన్న వారు మాత్రం ఈ ఆసనం అస్సలు వేయకండి.

ఇవి కూడా చదవండి

ఈ ఆసనం వేయడం వల్ల నడుము నొప్పి ఎలా తగ్గుతుంది..

ఈ ఆసనం హిప్ కండరాలను సాగేలా చేసి.. వెనుక భాగంలో ఉండే ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే దిగువ పొత్తికడుపు, కటి కండరాలను బలోపేతం చేస్తుంది. ఇలా నడుము నొప్పి తగ్గుతుంది. అంతే కాకుండా తుంటి, తొడల భాగాల్లో ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది. శరీరం అంతా రక్త ప్రసరణ జరిగేలా చేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..