- Telugu News Photo Gallery Tips to Lose Weight With PCOS: Why Do Women With PCOS Struggle To Lose Weight? know here
PCOS-Weight Loss: పీసీఓఎస్ సమస్య ఉంటే ఎందుకు బరువు పెరుగుతారో తెలుసా? అసలు కారణం ఇదే
నేటి కాలంలో అమ్మాయిలు యుక్తవయస్సు నుంచే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS)తో బాధపడుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా PCOS సమస్య తలెత్తుతుంది. పెద్ద సమస్య ఏమిటంటే ఈ పరిస్థితి నుండి తప్పించుకునేందుకు సరైన మందులు కూడా లేవు..
Updated on: Jul 12, 2024 | 1:15 PM

నేటి కాలంలో అమ్మాయిలు యుక్తవయస్సు నుంచే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS)తో బాధపడుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా PCOS సమస్య తలెత్తుతుంది. పెద్ద సమస్య ఏమిటంటే ఈ పరిస్థితి నుండి తప్పించుకునేందుకు సరైన మందులు కూడా లేవు.

PCOS తో ఉన్న అతి పెద్ద సమస్య అధిక బరువు, ఊబకాయం. అయితే PCOS తో బరువు తగ్గడం చాలా కష్టమని చాలా మంది భావిస్తారు. నిపుణులు ఏం చెబుతున్నారంటే.. PCOS సమస్య ఉంటే, శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. అండాశయాలలో ఆండ్రోజెన్లు (పురుష హార్మోన్లు) ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. బరువు తగ్గడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా మెరుగుపడుతుంది.

శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ స్థాయి నియంత్రణలో ఉన్నప్పుడు, అండాశయంలోని పురుష హార్మోన్ ఆండ్రోజెన్ స్థాయి తగ్గుతుంది. ఇది PCOS లక్షణాలను నియంత్రణలో ఉంచుతుంది. శరీరంలోని ఇతర హార్మోన్ల స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి.

ఎత్తు, వయస్సు ప్రకారం సరైన శరీర బరువును నిర్వహిస్తే.. రెగ్యులర్ పీరియడ్స్ సక్రమంగా వస్తాయి. పిసిఒఎస్‌తో క్రమరహిత పీరియడ్స్ చాలా అరుదు. ఈ సమస్యను తొలగించడానికి బరువు తగ్గడం అవసరం. పీసీఓఎస్‌తో బాధపడుతున్న మహిళలకు హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. వీరిలో కొలెస్ట్రాల్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. అధిక రక్తపోటు వస్తుంది. ఈ సమస్యలను నివారించడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి బరువు తగ్గడం అవసరం.

PCOSతో బాధపడటం పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. గర్భం ధరించడంలో ఇబ్బంది తలెత్తుతుంది. బరువు తగ్గడం అండోత్సర్గాన్ని సాధారణీకరిస్తుంది. హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. అయితే PCOSలో బరువు తగ్గడం కష్టమేమీ కాదు. కాస్త సవాలుతో కూడుకున్నప్పటికీ ఆరోగ్యకరమైన ఆహారం, యోగా, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం ద్వారా బరువు సులువుగా తగ్గవచ్చు.




