AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Pepper: వంటల్లో ఈ ఒక్కటి వాడారంటే.. జీర్ణ సమస్యల నుంచి క్యాన్సర్ వరకు అన్నీ పరార్‌!

కడుపు నొప్పి, అజీర్ణం, అసిడిటీతో బాధపడుతున్నారా? తరచుగా మందులు వాడాల్సి వస్తోందా? వంటగదిలో దొరికే ఈ మసాలాతో ఈ సమస్యలన్నీ వదిలించుకోవచ్చు. అజీర్ణం, అసిడిటీ నుంచి అనేక శారీరక సమస్యలకు వివిధ వంటగది మసాలాలతో పరిష్కరించుకోవచ్చు. అటువంటి వాటిలో ఒకటి మిరియాలు. ముఖ్యంగా నల్ల మిరియాలు బలేగా పనిచేస్తాయి. మిరియాల్లో పుష్కలమైన పోషక విలువల కారణంగా మిరియాలను సుగంధ ద్రవ్యాలలో రారాజుగా పిలుస్తారు..

Srilakshmi C
|

Updated on: Jul 12, 2024 | 1:02 PM

Share
పసుపు, మిరియాల పొడిని పాలలో కలుపుకుని తాగడం వల్ల తీవ్రమైన జలుబు సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఇది క్యాన్సర్, అనేక వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది. ఇది కాకుండా, మీరు నల్ల మిరియాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే శరీరం సహజంగా ఫిట్‌గా ఉంటుంది. నల్ల మిరియాల పొడి, నల్ల ఉప్పు, నిమ్మరసం కలిపి తాగితే గ్యాస్, ఎసిడిటీ సమస్యల నుండి తక్షణ ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.

1 / 5
మిరియాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫ్లాట్యులెన్స్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఫలితంగా ఈ మసాలా శరీర  జీర్ణవ్యవస్థ, రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మిరియాలు వివిధ వంటకాలలో ఉపయోగిస్తారు. ఇది వంటకు మంచి రుచిని తీసుకొస్తుంది. అయితే మిరియాలను వండడానికి బదులు తినడం వల్ల కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుందని నిపుణులు అంటున్నారు. ఇది శరీర ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేస్తుంది. అలాగే ప్రేగులను కూడా శుభ్రపరుస్తుంది. ఫలితంగా ఎసిడిటీ సమస్య నుంచి తేలిగ్గా విముక్తి పొందవచ్చు.

2 / 5
అయితే, మిరియాలు రుచికి కారంగా ఉంటాయి. అందువల్ల వీటని నేరుగా తినలేరు. అలాంటప్పుడు రకరకాల వంటల్లో వీటిని వినియోగించవచ్చు. ఇలాంటి వంటలను తినడం వల్ల వివిధ కడుపు సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అంతే కాకుండా ప్రతి రోజూ తింటే మలబద్దకం సమస్య కూడా దరిచేరదు.

3 / 5
ఇందులో ఉండే పైపెరిన్, యాంటీ ఒబెసిటీ గుణాలు శరీర బరువును తగ్గించడంలో ఎంతగానో సహకరిస్తాయి. అలాగే, నువ్వుల నూనెను వేడి చేయండి. అందులో నల్లమిరియాలు వేసి చల్లార్చండి. ఈ నూనెతో కీళ్ల నొప్పుల ప్రాంతంలో మర్దన చేస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. నెయ్యి, నల్ల మిరియాలు క్రమం తప్పకుండా తీసుకుంటే డయాబెటిస్, కీళ్ల నొప్పులు, మెడ నొప్పి, మోకాళ్ల నొప్పుల వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

4 / 5
మిరియాలలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. విటమిన్‌-ఎ, సి కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలోని వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.  పాలలో మిరియాలపొడి, పసుపు, శొంఠి వేసుకుని కషాయంలా మరిగించి..  నిద్రపోయే ముందు తాగితే ఊపిరితిత్తుల సమస్యలు ఉండవంటున్నారు నిపుణులు. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఒక గ్లాసుడు నీటిలో నల్ల మిరియాల నూనెను కలిపి తీసుకుంటే మంచిది. క్రమం తప్పకుండా ఇలా చేస్తే త్వరలోనే మీ బరువు సమస్యను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

5 / 5
Follow Us
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?

సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!

పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..

రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..

మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!