Hair Fall: వయస్సు 20 దాటకముందే జుట్టు ఊడుతోందా..;? ఇలా చెక్ పెట్టండి
జుట్ట రాలడంలో ప్రధాన కారణాల్లో ఒత్తిడి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. మారుతోన్న జీవన విధానం, ఒత్తిడితో కూడుకున్న జీవితం కారణంగా జుట్టు రాలడం సహజంగా మారిపోయింది. ఇక శరీరంలో శరీరంలో ఐరన్, విటమిన్ డి తగ్గినా.. జుట్టు రాలుతుంది. ఇక థైరాయిడ్‌తో బాధపడే వారిలో కూడా జుట్టు రాలుతుందని నిపుణులు..

ప్రస్తుత రోజుల్లో జుట్టు రాలడం పెద్ద సమస్యగా మారిపోయింది. ఒకప్పుడు వయసు మళ్లిన వారిలో మాత్రమే కనిపించే జుట్టు రాలుడు సమస్య ఈ మధ్య తక్కువ వయసులో ఉన్న వారిలోనూ కనిపిస్తోంది. 30 ఏళ్లకే బట్టతలలు దర్శనమిస్తున్నాయి. ఇంతకీ అసలు జుట్ట ఎందుకు రాలుతుంది.? దీని వెనకాల ఉన్న అసలు కారణం ఏంటి.? ఎలాంటి నివారణ చర్యలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక పురుషుల్లో బట్టతల రావడానికి ప్రధాన కారణం ఆండ్రోజెనెటిక్ అలోపేసియా. ఈ సమస్య జన్యుపరమైన, హార్మోన్లలో వ్యత్యాసాల వల్ల వస్తుంది. డైహైడ్రోటెస్టోస్టెరాన్ (DHT), టెస్టోస్టెరాన్ ఉప ఉత్పత్తి, ఇది వెంట్రుకల కుదుళ్లను తగ్గిస్తుంది, దీని వలన జుట్టు పలుచగా మారి చివరికి ఊడిపోతాయి. అయితే కొన్ని రకాల చర్యల ద్వారా జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు ఏంటి.? ఎలా నివారించాలో చూద్దాం..
జుట్ట రాలడంలో ప్రధాన కారణాల్లో ఒత్తిడి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. మారుతోన్న జీవన విధానం, ఒత్తిడితో కూడుకున్న జీవితం కారణంగా జుట్టు రాలడం సహజంగా మారిపోయింది. ఇక శరీరంలో శరీరంలో ఐరన్, విటమిన్ డి తగ్గినా.. జుట్టు రాలుతుంది. ఇక థైరాయిడ్‌తో బాధపడే వారిలో కూడా జుట్టు రాలుతుందని నిపుణులు చెబుతున్నారు. సరైన నిద్ర లేకపోయినా, జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా జుట్టు రాలే అవకాశాలు ఉన్నాయి. ఇక తల స్నానానికి ఉపయోగించే నీటిలో గాఢత ఎక్కువగా ఉన్నా జుట్టు రాలుతుంది.
సమస్యకు పరిష్కారం ఇదే..
జుట్టు రాలడం తగ్గాలంటే తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు వహించాలి. జుట్టు సంరక్షణ కోసం ఆహారంలో ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్ బీ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం వంటి చేయాలి. వారానికి కనీసం రెండు సార్లు తల స్నానం చేయాలి. స్నానం చేయడానికి ముందు రోజు నూనెతో తలకు మర్ధన చేశారు. జుట్టును కూడా 4 నుంచి 6 వారాలకు ఒకసారి జుట్టును కత్తిరించుకోవాలి. ఎండ ఎక్కువ ఉన్నప్పుడు బయటకు వెళ్తే కచ్చితంగా తలపై టవల్ లేదా క్యాప్ ఉండేలా చూసుకోవాలి. నిమ్మకాయ, కలబందను మిక్స్ చేసి నెలకొకసారి జుట్టు అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు ఒత్తుగా మారుతాయి.