Idli – Health: ఇడ్లీతో తీరని ముప్పు.. వారికి షాక్.! వెలుగులోకి షాకింగ్ విషయాలు..

వేడి వేడి ఇడ్లీ.. కొద్దిగా నెయ్యి, కారంపొడి తగిలించి తింటే.. ఆహా ఆ టేస్టే వేరు! దక్షిణ భారతదేశ ప్రజలకు ఇష్టమైన అల్పాహారంలో ఇడ్లీదే అగ్రస్థానం. అలాంటి ఇడ్లీ వల్ల జీవవైవిధ్య ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. ఇదొక్కటే కాదు ప్రపంచవ్యాప్తంగా 151 వంటకాలు జీవ వైవిధ్యానికి ముప్పుగా పరిణమించాయని అధ్యయనం పేర్కొంది. వాటిలో ఇడ్లీతోపాటు చనా మసాలా , రాజ్మా, చికెన్ జాల్‌ఫ్రెజి కూడా ఉన్నాయి.

Idli - Health: ఇడ్లీతో తీరని ముప్పు.. వారికి షాక్.! వెలుగులోకి షాకింగ్ విషయాలు..

|

Updated on: Feb 27, 2024 | 7:27 AM

వేడి వేడి ఇడ్లీ.. కొద్దిగా నెయ్యి, కారంపొడి తగిలించి తింటే.. ఆహా ఆ టేస్టే వేరు! దక్షిణ భారతదేశ ప్రజలకు ఇష్టమైన అల్పాహారంలో ఇడ్లీదే అగ్రస్థానం. అలాంటి ఇడ్లీ వల్ల జీవవైవిధ్య ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. ఇదొక్కటే కాదు ప్రపంచవ్యాప్తంగా 151 వంటకాలు జీవ వైవిధ్యానికి ముప్పుగా పరిణమించాయని అధ్యయనం పేర్కొంది. వాటిలో ఇడ్లీతోపాటు చనా మసాలా , రాజ్మా, చికెన్ జాల్‌ఫ్రెజి కూడా ఉన్నాయి. పర్యావరణానికి ముప్పుగా పరిణమించే మొదటి 25 ఆహారాలు భారతీయులు ఇష్టంగా తినేవే ఉండడం విశేషం. జీవవైవిధ్యానికి ముప్పు కలిగించే ఆహారాల లిస్ట్‌లో.. ఇడ్లీ ఆరోస్థానంలో ఉంది. స్పానిష్ రోస్ట్ ల్యాంబ్ డిష్ అయిన ‘లెచాజో’ అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో బ్రెజిల్‌కు చెందిన మీట్ సెంట్రిక్ ఆఫెరింగ్స్ ఉంది. రాజ్మా కూర ఏడో స్థానంలో ఉంది. ఈ అధ్యయన వివరాలు సింగపూర్ యూనివర్సిటీలోని ఎలిస్సా చెంగ్ అండ్ కొలీగ్స్ నిర్వహించే ఓపెన్ యాక్సెస్ జర్నల్ ప్లాస్ PLOSలో ప్రచురితమైంది. బియ్యం, పప్పుధాన్యాల ఆధారిత వంటకాలు కూడా అధిక స్కోరు సాధించడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. వ్యవసాయం చేసే ప్రదేశాల్లో క్షీరదాలు, పక్షులు, ఉభయచర జీవులపై పడే ప్రభావాన్ని పరిశోధకులు అంచనా వేశారు. బియ్యం, పప్పుధాన్యాలతో కూడిన ఆహారం వల్ల జీవ వైవిధ్యంపై అధిక ప్రభావం పడుతుందని అధ్యయనంలో తేలింది. మన దేశంలో ధాన్యం, పప్పు ధాన్యాల సాగుకు తరచుగా భూ మార్పిడి అవసరమని, ఈ కారణంగా అనేక జీవజాతులు ఆవాసాలు కోల్పోతున్నాయని అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us