Vaccines: కొవిడ్ టీకాలతో ప్రయోజనాల కంటే ప్రమాదాలే ఎక్కువ..? భయపెడుతున్న అధ్యయనాలు.!

కరోనా వైరస్ ప్రపంచంపై దాడిచేసి సృష్టించిన మారణహోమం అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని ఈ మహమ్మాలి బలితీసుకుంది. ఆ తర్వాత వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో కొవిడ్ భూతానికి కళ్లెం పడింది. అయితే, ఈ టీకాల వల్ల ప్రయోజనాల కంటే ప్రమాదాలే ఎక్కువ ఉన్నట్టు తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను ‘వ్యాక్సిన్’ సైన్స్ జర్నల్ ప్రచురించింది.

Vaccines: కొవిడ్ టీకాలతో ప్రయోజనాల కంటే ప్రమాదాలే ఎక్కువ..? భయపెడుతున్న అధ్యయనాలు.!

|

Updated on: Feb 27, 2024 | 8:12 AM

కరోనా వైరస్ ప్రపంచంపై దాడిచేసి సృష్టించిన మారణహోమం అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని ఈ మహమ్మాలి బలితీసుకుంది. ఆ తర్వాత వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో కొవిడ్ భూతానికి కళ్లెం పడింది. అయితే, ఈ టీకాల వల్ల ప్రయోజనాల కంటే ప్రమాదాలే ఎక్కువ ఉన్నట్టు తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను ‘వ్యాక్సిన్’ సైన్స్ జర్నల్ ప్రచురించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనా విభాగం గ్లోబల్ వ్యాక్సిన్ డేటా నెట్‌వర్క్ పరిశోధకులు కొవిడ్-19 వ్యాక్సిన్లు ప్రత్యేక ప్రతికూల సంఘటనలుగా పరిగణించే 13 వైద్య సమస్యలను తీవ్రతరం చేసినట్టు గుర్తించారు. అర్జెంటినా, ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, స్కాట్‌లాండ్ దేశాల్లో కొవిడ్ టీకా తీసుకున్న 99 మిలియన్ల మందిపై అధ్యయనం నిర్వహించారు. MRNA టీకా తీసుకున్న వారిలో హృదయ కండర వాపునకు కారణమయ్యే మయోకార్డిటిస్ ముప్పును గుర్తించారు. ఫైజర్-బయోఎన్‌టెక్, మోడెర్నా టీకాలు MRNA టీకాలే. ఈ టీకాలు ఒకటి, రెండు, మూడో డోసులు తీసుకున్న వారిలో మయోకార్డిటిస్ కేసులను కనుగొన్నారు. రెండో మోతాదు తీసుకున్న తర్వాత అంచనా రేటుతో పోలిస్తే 6.1 రెట్లు ఎక్కువగా ఈ ముప్పు కనబడినట్టు గుర్తించారు.

ఆస్ట్రాజెనెకా టీకా మూడో డోసు తీసుకున్న తర్వాత గుండెకు సంబంధించిన మరో ముప్పు అయిన పెరికార్డిటిస్ ప్రమాదం 6.9 రెట్లు పెరిగినట్టు గుర్తించారు. అలాగే, మోడెర్నా టీకా మొదటి, నాలుగో మోతాదు తీసుకున్న వారిలో వరుసగా 1.7 రెట్లు, 2.6 రెట్లు ఈ ప్రమాదం పెరిగినట్టు అధ్యయనం పేర్కొంది. అలాగే, ఆస్ట్రాజెనెకా షాట్ తీసుకున్న వారు అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన గ్విలియన్ బారే సిండ్రోమ్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. రక్తం గడ్డకట్టే ప్రమాదం 3.2 రెట్లు ఎక్కువ అని అధ్యయనం తేల్చింది. మోడెర్నా టీకా తీసుకున్న తర్వాత న్యూరోలాజికల్ డిజార్డర్ అయిన అక్యూట్ డిసెమినేటెడ్ ఎన్సెఫలోమైలిటిస్ వచ్చే ప్రమాదం 3.8 రెట్లు ఎక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది. ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న తర్వాత ఈ ముప్పు 2.2 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు నివేదించింది. కరోనా టీకా వల్ల కలిగే ప్రయోజనాల కంటే ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు నొక్కి చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..
అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..
OTTలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?
OTTలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?
తండ్రి కోసం జనాల మధ్య కష్టపడుతున్న చిరుత హీరోయిన్..
తండ్రి కోసం జనాల మధ్య కష్టపడుతున్న చిరుత హీరోయిన్..