- Telugu News Photo Gallery Tulasi Health Benefits: Tulasi Can Control High Cholesterol And Keep Heart Healthy
Tulsi Health Benefits: పవిత్ర తులసితో గుండె పోటు సమస్యకు చెక్..! ఎలాగో తెలిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయరు..
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే గుండెను ఆరోగ్యంగా పదిలంగా ఉండాలి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవాలి. నిజానికి, కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. HDL, LDL అనే రెండు రకాల కొలెస్ట్రాల్‌లు ఉంటాయి. వీటిల్లో రక్తంలో ఎల్‌డిఎల్ స్థాయిలు అధికంగా ఉంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. LDL లేదా చెడు కొలెస్ట్రాల్ పెరుగుదల ఎక్కువగా ఉంటే గుండె ధమనులలో రక్త ప్రసరణను దెబ్బతీస్తుంది..
Updated on: Feb 27, 2024 | 11:54 AM

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే గుండెను ఆరోగ్యంగా పదిలంగా ఉండాలి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవాలి. నిజానికి, కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. HDL, LDL అనే రెండు రకాల కొలెస్ట్రాల్‌లు ఉంటాయి. వీటిల్లో రక్తంలో ఎల్‌డిఎల్ స్థాయిలు అధికంగా ఉంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.

LDL లేదా చెడు కొలెస్ట్రాల్ పెరుగుదల ఎక్కువగా ఉంటే గుండె ధమనులలో రక్త ప్రసరణను దెబ్బతీస్తుంది. ఇది స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాకుండా అధిక రక్తపోటుతో సహా అనేక ఇతర శారీరక సమస్యలు సంభవిస్తాయి. ఎల్‌డిఎల్‌ని తగ్గించడంలో తులసి ప్రధాన పాత్ర పోషిస్తుంది.

హిందువులు తులసి మొక్కను పవిత్రంగా పూజిస్తారు. తులసి ఆకుల్లో అనేక పోషక గుణాలు ఉన్నాయి. అందుకే తులసిని ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తారు. తులసి ఆకుల టీని రోజూ తీసుకోవడం వల్ల ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న తులసి శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ (రక్తం గడ్డకట్టడానికి కారణమయ్యే కదిలే అణువులు)తో పోరాడుతుంది. ఫలితంగా LDL స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి ఒత్తిడి మరొక కారణం. ప్రతిరోజూ ఉదయం తులసి టీ తాగితే.. ఇది శరీరం, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఫలితంగా చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే గుండెతో పాటు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. తులసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కొలెస్ట్రాల్ కాలేయంపై కూడా ప్రభావం చూపుతుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

ఊపిరితిత్తులు గుండెతో అనుసంధానించబడి ఉంటాయి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు లేదా శ్వాస సమస్యలతో బాధపడేవారికి తులసి సమర్థవంతమైన ఔషధం. తులసిని తేనె, అల్లంతో కలిపి తీసుకుంటే శ్వాస సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. కాబట్టి, పచ్చి తులసి ఆకులు లేదా తులసి ఆకు టీ మొటిమలు, దద్దుర్లతో సహా వివిధ చర్మ సమస్యలను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా తులసి పాత్ర ముఖ్యమైనది.





























