Digestion Problems: తిన్న ఆహారం జీర్ణం కావడం లేదా.. ఈ హోమ్ రెమిడీస్‌తో చెక్ పెట్టండి!
ప్రస్తుతం మారిన లైఫ్ స్టైల్ విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా.. అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఇంతకు ముందు లేనట్టుగా పలు దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడు సమయ పాలన లేని ఆహారం తీసుకోవడం వల్ల కూడా తీవ్రమైన సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రస్తుతం చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో అజీర్తి కూడా ఒకటి. తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల అనేక సమస్యలు కలుగుతున్నాయి. ఈ సమస్య నుంచి బయట..

ప్రస్తుతం మారిన లైఫ్ స్టైల్ విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా.. అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఇంతకు ముందు లేనట్టుగా పలు దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడు సమయ పాలన లేని ఆహారం తీసుకోవడం వల్ల కూడా తీవ్రమైన సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రస్తుతం చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో అజీర్తి కూడా ఒకటి. తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల అనేక సమస్యలు కలుగుతున్నాయి. ఈ సమస్య నుంచి బయట పడటానికి మందులు వాడుతున్నారు. దీంతో మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతున్నాయి. అజీర్తి సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ఒక్కసారి ఇంటి చిట్కాలు పాటించి చూడండి.. దీని వల్ల త్వరగా ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. మరి అవేంటో ఓ లుక్ వేసేయండి.
జీలకర్ర వాటర్:
అజీర్తి, గ్యాస్, వాంతులు, మల బద్ధకం సమస్యలతో బాధ పడేవారు జీలకర్ర నీరు తాగడం చాలా మంచిది. ప్రతి రోజూ కొన్ని రోజుల పాటు జీలకర్ర వాటర్ తాగితే.. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. శ్వాసకు సంబంధించిన సమస్యలను కూడా జీరా వాటర్ పరిష్కరిస్తుంది.
శొంఠి టీ:
శొంఠితో తయారు చేసే టీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. శొంఠిని ఆయుర్వేదంలో ఎన్నో అనారోగ్య సమస్యలకు పరిష్కారంగా ఉపయోగిస్తూ ఉంటారు. అజీర్తి సమస్యతో ఉన్నవారు.. శొంఠి టీ తాగితే త్వరిత గతిన.. ఈ సమస్య నుంచి బయట పడొచ్చు.
మజ్జిగ:
మజ్జిగ కూడా అజీర్తి సమస్యకు చెక్ పెడుతుంది. ఇందులో ప్రోబయోటిక్స్ గుణాలు అనేవి మెండుగా ఉంటాయి. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడమే కాకుండా.. మంచి బ్యాక్టీరియాను అభివృద్ధి చేస్తుంది. అంతే కాకుండా శరీరాన్ని చల్ల బరుస్తుంది. గ్యాస్, కడుపులో ఉబ్బరం, మల బద్ధకం సమస్యలను తగ్గిస్తుంది.
యాపిల్:
అజీర్తితో బాధ పడేవారు యాపిల్ తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పెక్టిన్ అనే సాల్యుబుల్ ఫైబర్.. జీర్ణ సమస్యలు రాకుండా చేయడంలో హెల్ప్ చేస్తుంది.
బొప్పాయి:
అజీర్తి సమస్యలతో ఇబ్బంది పడేవారు బొప్పాయి పండు తినడం వల్ల కూడా మంచి రిలీఫ్ నెస్ పొందొచ్చు. బొప్పాయి తినడం వల్ల పేగుల్లో ఉండే మలినాలు, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లగొడుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)








