Lifestyle: కొంచెం ఆల్కహాల్‌కే హ్యాంగోవరా.? మీరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లే..
న్యూయార్క్ పోస్ట్ యొక్క నివేదిక ప్రకారం, దీర్ఘకాలిక కోవిడ్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వారు ఆల్కహాల్ కారణంగా త్వరగా హ్యాంగోవర్‌కు గురవుతున్నట్లు తేలింది. ఈ విషయాలను క్యూరియస్ జర్నల్‌లో ప్రచురించారు. ఎక్కువ కాలం కోవిడ్ ఇన్ఫెక్షన్‌తో ఇబ్బందిపడ్డ వారికి తీవ్రమైన హ్యాంగోవర్ సమస్య వేధిస్తుందని చెబుతున్నారు..

మద్యం సేవిస్తే ఉదయాన్నే హ్యాంగోవర్ రావడం సర్వసాధారణమైన విషయం తెలిసిందే. అయితే ఓ మోతాదుకి మించి మద్యం సేవిస్తే హ్యాంగోవర్ రావడం కామన్ కానీ కొద్దిగా మద్యానికే ఈ సమస్య ఎదురైతే మాత్రం లాంగ్ కోవిడ్ సమస్యతో బాధపడుతున్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఇదేదో ఆషామాషీగా చెబుతోన్న విషయం కాదు, పరిశోధనలు చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు.
న్యూయార్క్ పోస్ట్ యొక్క నివేదిక ప్రకారం, దీర్ఘకాలిక కోవిడ్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వారు ఆల్కహాల్ కారణంగా త్వరగా హ్యాంగోవర్‌కు గురవుతున్నట్లు తేలింది. ఈ విషయాలను క్యూరియస్ జర్నల్‌లో ప్రచురించారు. ఎక్కువ కాలం కోవిడ్ ఇన్ఫెక్షన్‌తో ఇబ్బందిపడ్డ వారికి తీవ్రమైన హ్యాంగోవర్ సమస్య వేధిస్తుందని చెబుతున్నారు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని పోస్ట్ అక్యూట్ కోవిడ్ సిండ్రోమ్ క్లినిక్‌లో కొంతమంది కోవిడ్ బాధుతులను పరిగణలోకి తీసుకొని అధ్యయనం చేపట్టారు.
పరిశోధనల్లో తేలిన విషయం ప్రకారం.. 11 నెలలుగా కోవిడ్‌తో పోరాడుతున్న ఒక మహిళ ఇన్‌ఫెక్షన్‌కు ముందు ఎలాంటి సమస్యలు లేకుండా వైన్ తీసుకునేది. కానీ ప్రస్తుతం ఆమె కేవలం ఒక గ్లాస్ వైన్‌త తీసుకోగానే హ్యాంగోవర్‌కు గురైంది. మూడు నెలలుగా కోవిడ్ ఇన్ఫెక్షన్‌తో పోరాడుతున్న మహిళలో కూడా ఇలాంటి మార్పునే గుర్తించారు. ఇక మరో వ్యక్తి కోవిడ్‌కు ముందు పెద్ద మొత్తం ఆల్కహాల్ తీసుకున్నా ఎలాంటి సమస్య లేదు. కానీ కరోనా తర్వాత కేవలం ఒక బీర్ తాగితేనే తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు.
పరిశోధకుల అభిప్రాయం కోవిడ్ ఇన్ఫెక్షన్ కారణంగా రక్త ప్రవాహంలో అనుణువల స్థాయిలను పెంచవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇది కొన్ని సార్లు హ్యాంగోవర్‌కు కారణమవుతుందని చెబుతున్నారు. అయితే కరోనా వైరస్‌క, ఆల్కహాల్‌కు మధ్య ఎలాంటి సంబంధం ఉందన్న విషయంపై పరిశోధకులు సరైన అంచనాకు రాలేకపోయారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..




