Lifestyle: వాటర్ మిలాన్‌ను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా.? అయితే ఇది తెలుసుకోవాల్సిందే..
అంతేకాకుండా వాటర్ మిలాన్‌లో ఉండే అమైనో ఆమ్లం సిట్రులైన్, రక్తపోటును నియంత్రించే మరియు రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచే నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. తక్కువ కేలరీలు, ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉండే వాటర్ మిలాన్‌ను తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గొచ్చు. అయితే ప్రస్తుత తరుణంలో ప్రతీ ఇంట్లో ఫ్రిడ్జ్ అనివార్యంగా...

పుచ్చకాయ చూడగానే నోరూరించే ఈ పండు మండె ఎండల్లో ఒక మంచి ఉపశమనంలా ఉంటుంది. పుష్కలంగా నీటి శాతం ఉండే ఈ పండును కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. వాటర్ మిలాన్‌లో సుమారు 90 శాతం నీరే ఉంటుంది. దీంతో ఈ సమ్మర్‌లో వాటర్ మిలాన్‌ను తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అలాగే ఇందులో ఉన్న ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
అంతేకాకుండా వాటర్ మిలాన్‌లో ఉండే అమైనో ఆమ్లం సిట్రులైన్, రక్తపోటును నియంత్రించే మరియు రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచే నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. తక్కువ కేలరీలు, ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉండే వాటర్ మిలాన్‌ను తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గొచ్చు. అయితే ప్రస్తుత తరుణంలో ప్రతీ ఇంట్లో ఫ్రిడ్జ్ అనివార్యంగా మారింది. దీంతో వాటర్ మిలాన్‌ను కూడా ఫ్రిడ్జ్‌లో నిల్వ చేస్తున్నారు. ఇంతకీ వాటర్ మిలాన్‌ను ఫ్రిడ్జ్‌లో పెట్టడం మంచిదా.? కాదా.? నిపుణులు ఏం చెబుతున్నారు.? ఇప్పుడు తెలుసుకుందాం.
వాటర్ మిలాన్‌ను ఫ్రిడ్జిలో నిల్వ చేయడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఇందులో ఉండే పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వాటర్ మిలాన్‌ను కట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెడితే మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. సాధారణ గది ఉష్ణోగ్రతలో ఉన్న వాటర్‌మిలాన్‌నుతో పోల్చితే ఫ్రిడ్జ్‌లో పెట్టిన పుచ్చకాయలో పోషకాలు తక్కువగా ఉంటాయని సూచిస్తున్నారు. ఇదేదో అషామాషీగా చెబుతోన్న విషయం కాదు.
పరిశోధనలు చేసి మరీ ఈ విషయాన్ని చెబుతున్నారు. 14 రోజుల పాటు అనేక రకాల పుచ్చకాయలను పరీక్షించిన తర్వాత ఈ విషయాన్ని తెలిపారు. వాటర్ మిలాన్ ఫ్రిడ్జ్ ఉష్ణోగ్రత వద్ద కేవలం వారంలో కుళ్ళిపోవచ్చని చెబుతున్నారు. అదే గది ఉష్ణోగ్రత వద్ద 14 నుంచి 21 రోజులు వరకు ఉంటుంది. చూశారుగా వాటర్ మిలాన్‌ను ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల కలిగే నష్టాలు ఏంటో.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..
