Jujube: పోషకాల పుట్ట రేగు పండ్లు.. ఈ సీజన్‌లో మిస్ చేయకుండా తినండి..
వింటర్ సీజన్‌లో లభించే పండ్లలో రేంగు పండ్లు కూడా ఒకటి. ఈ కాలంలో ఇవి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. చాలా మంది వీటిని తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ సీజన్‌లో రేంగు పళ్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది..

వాతావరణ పరిస్థితుల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. కాలాలు మారుతూ ఉంటాయి. ఇలా కాలాలు మారుతున్న సమయంలో అనేక రకాల పండ్లు లభిస్తూ ఉంటాయి. ఈ సీజనల్ వారీగా లభించే ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక పోషకాలు లభిస్తాయి. ఇలా శీతాకాలంలో ఎక్కువగా లభించే వాటిల్లో రేగు పండ్లు కూడా ఒకటి. ఇది వరకు సీజన్ల వారీగా లభించే పండ్లను ఎక్కువగా తినేవారు. అందుకే ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు అలా ఎవరూ తినడం లేదు. రేగు పండ్లు పోషకాల పుట్ట అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రేగు పండ్లు తినడం వల్ల అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇందులో అనేక రకాలో పోషకాలు లభిస్తాయి. వీటిని తినడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మరి రేగు పండ్లు తింటే ఎలాంటి ఆరోగ్య లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
రోగ నిరోధక శక్తి:
రేగు పండ్లు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. రేగు పండ్లు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. ఇవి శరీరంలో ఇమ్యూనిటీని పెంచడంలో ఎంతో చక్కగా హెల్ప్ చేస్తాయి. దీంతో వైరస్‌లు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.
జీర్ణ సమస్యలు మాయం:
రేగు పండ్లలో ఫైబర్ అనేది ఎక్కువగా లభిస్తుంది. ఇవి తినడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. విటమిన్లు సి, ఎ, పొటాషియం, ఫైబర్, అమైనో యాసిడ్స్ లభిస్తాయి. ఇవి పొట్ట సమస్యలు తలెత్తకుండా చేస్తాయి.
శరీరానికి రక్షణ కల్పిస్తాయి:
రేగు పండ్లలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, పాలి ఫెనాల్స్ వంటివి ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ కారణంగా శరీరం దెబ్బతినకుండా రక్షణగా నిలుస్తాయి.
రక్త హీనత ఉండదు:
రేగు పండ్లలో ఐరన్ కంటెంట్ కూడా లభిస్తాయి. కాబట్టి వీటిని తినడం వల్ల రక్త హీనత సమస్య తలెత్తదు. అదే విధంగా శరీరంలో ఇన్ ఫ్లమేషన్ సమస్యను తగ్గిస్తాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి.
ఆర్థరైటిస్ సమస్యకు చెక్:
ప్రస్తుత కాలంలో చాలా మంది ఆర్థరైటిస్ సమస్యతో బాధ పడుతున్నారు. ఇలాంటి వారు రేగు పండ్లు తింటే ఈ ప్రాబ్లమ్ నుంచి త్వరగా బయటపడొచ్చు. అంతే కాకుండా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు రాకుండా చేస్తుంది. కండరాలు బలంగా ఉండేలా చేస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..








