Donkey Milk: గాడిదపాలతో ముడుతలకు చెక్..! ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Donkey Milk: క్లియోపాత్ర ఒక గొప్ప అందగత్తె. ఆమె కాంతివంతమైన చర్మం కోసం ప్రతిరోజు గాడిద పాలతో స్నానం చేసేదట.

Donkey Milk: గాడిదపాలతో ముడుతలకు చెక్..! ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
Donkey Milk
Follow us

|

Updated on: Sep 27, 2021 | 6:44 PM

Donkey Milk: క్లియోపాత్ర ఒక గొప్ప అందగత్తె. ఆమె కాంతివంతమైన చర్మం కోసం ప్రతిరోజు గాడిద పాలతో స్నానం చేసేదట. ఇది విని మీరు ఆశ్చర్యపోవచ్చు కానీ చరిత్ర అదే చెబుతుంది. అంతేకాదు గాడిదపాలతో ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జ్వరం, గాయాలను త్వరగా తగ్గిస్తుంది. టైప్ II డయాబెటిస్ పేషెంట్లకు చాలా మంచిది. గాడిద పాలు మానవ పాలకు దగ్గరగా ఉంటాయి అందువల్ల శిశువులకు పట్టిస్తారు. గాడిద పాలలో వ్యాధి కారకాలు ఉండవు. అందుకే ఆరోగ్యానికి మాత్రమే కాదు సౌందర్య సాధనాలలో కూడా వాడుతారు.

1. యాంటీ ఏజింగ్, హీలింగ్ గాడిద పాలలో ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఏజింగ్, హీలింగ్ లక్షణాలుగా పనిచేస్తాయి. ఈ కొవ్వు ఆమ్లాలు చర్మంపై ముడుతలను తొలగిస్తాయి. దెబ్బతిన్న చర్మాన్ని పునరుత్పత్తి చేస్తాయి. అంతేకాదు గాడిద పాలలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి చర్మంపై ఏర్పడే దద్దుర్లను నయం చేస్తాయి.

2. యాంటీఆక్సిడెంట్, న్యూట్రియెంట్ సహజ అమృతంగా పిలువబడే గాడిద పాలలో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ E, అమైనో ఆమ్లాలు, విటమిన్లు A, B1, B6, C, E, ఒమేగా 3, 6 ఉంటాయి. ఇవన్నీ చర్మాన్ని మృదువుగా చేయడానికి తోడ్పడుతాయి. అంతేకాకుండా విటమిన్ డి అనేది మానవ చర్మానికి అత్యంత అవసరం. ఇది సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. అయితే గాడిద పాలలో ఇది సమృద్ధిగా దొరుకుతుంది. సూర్యరశ్మికి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ఈ పాలను తరచు అప్లై చేస్తుంటే కాంతివంతమైన మెరిసే చర్మా్న్ని పొందవచ్చు.

3. మాయిశ్చరైజర్ గాడిద పాలు చర్మానికి శక్తివంతమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మృదువుగా మారుస్తాయి. గాడిద పాలను ఆరోగ్యానికి మాత్రమే కాదు సౌందర్య సాధనాలలో కూడా వాడుతున్నారు. సబ్బు, ఫేస్‌ క్రీమ్‌లు, మొదలైన బ్యూటీ ప్రొడాక్ట్స్‌ని తయారు చేస్తున్నారు. గాడిద ప్రతిరోజూ ఒక లీటరు పాలను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలో విస్తృతంగా అందుబాటులో లేనప్పటికీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఐరోపా అంతటా గాడిద పాలు ప్రజాదరణ పొందాయి. మనకు ఆవు, గేదె, మేక, ఒంటే పాల డెయిరీలను మాత్రమే చూశాము.. అయితే.. త్వరలో హర్యానా హిస్సార్‌లో గాడిదల పాల డెయిరీని ఎన్‌ఆర్‌సీఈ ప్రారంభించనుంది.

Hyderabad City Police: బయట బోరున వర్షం.. ఇంతలోనే మహిళకు పురిటి నొప్పలు.. పోలీసులు ఏం చేశారంటే..

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా విడుదలవుతున్న ‘మార్క్యూ ఎం3 స్మార్ట్’ ఫోన్.. ధర చాలా తక్కువ.. అద్భుత ఫీచర్స్‌..

Love Story Movie Success Celebrations: సక్సెస్ సెలబ్రేషన్స్ లో ‘లవ్ స్టోరీ’ మూవీ టీం ఫొటోస్…