Cold Relief: జలుబు నుంచి తక్షణ ఉపశమనానికి ఇలా చేయండి..! గంటలో సాధారణ స్థితికి వస్తారు..
Cold Relief: వర్షాకాలం ప్రారంభం కావడంతో వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. దీంతో చాలామంది అనేక
Cold Relief: వర్షాకాలం ప్రారంభం కావడంతో వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. దీంతో చాలామంది అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. ఈ సీజన్‌లో ఎక్కువగా జ్వరం, ఫ్లూ, అలసట, దగ్గు, జలుబు వస్తుంది. ఈ కాలంలో పిల్లలు, వృద్ధులు ఎక్కువగా అనారోగ్యం బారిన పడుతారు. ముఖ్యంగా జలుబుతో చాలామంది బాధపడుతుంటారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తొందరగా దీనికి గురవుతారు. అంతేకాదు జలుబు వైరస్ వల్ల వస్తుంది. ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. దీని నుంచి మీక తక్షణమే ఉపశమనం కావాలంటే ఇంట్లో దొరికే పదార్థాల ద్వారా ఇలా చేయండి.
1. ఉప్పు నీటితో గార్గ్ జలుబుతో గొంతు నొప్పిగా ఉంటుంది. అందుకు కొద్దిగా వేడినీటిలో ఉప్పు వేసి గార్గ్ చేయాలి. దగ్గు, గొంతు నొప్పి తగ్గుతుంది. ఇది శ్లేష్మం క్లియర్ చేయడానికి సహాయపడుతుంది. 2. గోరువెచ్చని నీరు తాగాలి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు గోరు వెచ్చని నీరు తాగితే మంచి ఉపశమనం ఉంటుంది. ముఖ్యంగా జలుబుకు గురైన వారు వేడినీటిని మాత్రమే తాగాలి. 3. పండ్లు, కూరగాయలు తినాలి జలుబు చేసినప్పుడు విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినాలి. విటమిన్ సి జలుబును వదిలించడానికి తోడ్పడుతుంది. టమోటాలు, పాలకూర, ఉసిరి, సిట్రస్ పండ్లు, ఆహారంలో చేర్చాలి. 4. బోన్‌సూప్ బోన్ సూప్ మీకు సోడియం, పొటాషియం వంటి ఖనిజాలను అందిస్తుంది. జలుబుతో బాధపడుతున్నప్పుడు బోన్ సూప్ తాగడం వల్ల కోల్పోయిన రుచి దొరుకుతుంది. ఇంకా సూప్‌లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తికి అవసరమైన పోషకం. 5. ఆవిరి పొడి దగ్గు, నాసికా చికాకు, ఛాతి బిగుతు ఆవిరిని పీల్చడం ద్వారా తగ్గించవచ్చు. జలుబు, ఫ్లూ నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి ఉదయం, సాయంత్రం ఆవిరి తీసుకోవాలి.