Kondapolam Trailer: ఆకట్టుకుంటున్న కొండపొలం మూవీ ట్రైలర్.. ‘చదువుకున్న గొర్రె చదువురాని గొర్రెతో మాట్లాడటం చూశావా’
Kondapolam Trailer: మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు.
Kondapolam Trailer: మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఉప్పెన సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ యంగ్ హీరోకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈ హీరో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో కొండపొలం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించి చిత్ర యూనిట్ ట్రైలర్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది.
ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ రెండు పాత్రలో కనిపిస్తాడు. ఒకటి గొర్రెల కాపరిగా మరొకటి చదువుకునే పాత్రల్లో ఒదిగిపోయాడు. అడవి నేపథ్యం నుంచి బాగా చదువుకున్న యువకుడు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో అతడు ఎదుర్కొనే ఇబ్బందులను ట్రైలర్‌లో చూపించారు. ‘చదువుకున్న గొర్రె చదువురాని మరో గొర్రెతో మాట్లాడటం చూశావా?’ అంటూ రకుల్.. వైష్ణవ్ ఆటపట్టిస్తూ చెప్పిన డైలాగ్ బాగా ఆకట్టుకుంటోంది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు.
ఈ సినిమా అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన మూవీ ఫస్ట్‌లుక్, టీజర్, లిరికల్ సాంగ్‌కు విశేష స్పందన లభించింది. ఈ మూవీని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డిలు సంయక్తంగా నిర్మిస్తున్నారు. పూర్తి అడవి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్, వైష్ణవ్ తేజ్ ఇద్దరూ గ్రామీణ ప్రాంతానికి చెందిన జంటగా కనిపించనున్నారు. ఎం.ఎం.కీరవాణి అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది.