Brazilian Model: పెళ్లి చేసుకుంటే రూ.3.70 కోట్ల ఎదురు కట్నం ఇస్తా.. అరబ్ షేక్ ఆఫర్.. తిరస్కరించిన మోడల్
ఓ అరబ్ షేక్ ఓ మోడల్‌కు వింత ఆఫర్ ఇచ్చారు. తనను పెళ్లి చేసుకుంటే రూ.3.70 కోట్ల ఎదురు కట్నం ఇస్తామని ఆఫర్ చేశారు...
ఓ అరబ్ షేక్ ఓ మోడల్‌కు వింత ఆఫర్ ఇచ్చారు. తనను పెళ్లి చేసుకుంటే రూ.3.70 కోట్ల ఎదురు కట్నం ఇస్తామని ఆఫర్ చేశారు. కానీ ఆమెకు అప్పటికే వివాహం అయింది. ఆమెకు పెళ్లి ఎవరితో అయ్యిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎందుకంటే ఆమె పరిణయమడింది ఆమెతోనే.. అవును ఇది నిజం.. బ్రెజిల్ అందాల భామ, మోడల్ క్రిస్ గలేరా ప్రత్యేకత ఏమిటంటే తనను తాను వివాహం చేసుకోవడమే. పెళ్లి కోసం మగతోడు అసలు వద్దని నిర్ణయించుకున్న ఆమె చివరకు తనను తాను వివాహం చేసుకుంది. బ్రెజిల్‌లోని సావో పోలో చర్చిలో పెళ్లి చేసుకోవడానికి ముందు గలేరా దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ 33 ఏళ్ల ఈ అందాల భామ గురించి నెటిజన్లు తెగ మాట్లాడుకుంటున్నారు. కొందరు ఈమెను విమర్శిస్తున్నా.. గలేరా మాత్రం వారిని అస్సలు పట్టించుకోవడం లేదు. కానీ ఆ నెటిజన్లలో ఒకతను మాత్రం ఆమెను అమితంగా అకట్టుకున్నాడు. అతను చేసిన కామెంట్ గలేరాకు వింతగా అనిపించింది.
ఆ కామెంట్ ఏమిటంటే..? ఇటీవల గలేరా తనకు ఒక అరబ్ షేక్ వివాహం ఒక వింత ప్రతిపాదన చేశాడని చెప్పింది. గలేరా తనను తాను వివాహం చేసుకున్న విషయం తెలిసిన ఆ అరబ్ కుబేరుడు ఆమెను ముందు విచిత్ర ప్రస్తావన తీసుకొచ్చాడని తెలిపింది. ఆమె ముందు తనకు తాను విడాకులు ఇచ్చుకోవాలని సూచించాడని పేర్కొంది. అంతేనా ఆ తరువాత అతడిని గలేరా పెళ్లి చేసుకుంటే ఏకంగా అయిదు లక్షల డాలర్లు( రూ.3.70 కోట్లు) ఎదురు కట్నం ఇస్తానని తెలిపినట్లు చెప్పుకొచ్చింది. గలేరా అతడితో ఒకసారి మాట్లాడిందట. కానీ తన స్వేచ్ఛను వదలుకోలేనని చెప్పి ఆ అరబ్ షేక్‌కు గలేరా పెళ్లికి నో అనేసిందట. డబ్బుల కోసం వివాహం చేసుకోనని చెప్పేసిందట.