AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lipstick: లిప్‌స్టిక్ వాడితే క్యాన్సర్.. కిడ్నీ వ్యాధులు వస్తాయా.. అసలు నిజం ఇదే..

ఈ ఆధునిక యుగంలో లిప్‌స్టిక్ వాడని మహిళలు ఉండడం చాలా తక్కువ. అయితే మీరు వాడే లిప్‌స్టిక్‌లో విషం ఉందా.. లిప్‌స్టిక్ వాడితే కిడ్నీలు, క్యాన్సర్‌ రోగాలు వస్తాయా..? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజమెంత ఉంది..? నిపుణులు చెబుతున్న ఆ ఒక్క నిజం ఏంటీ..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Lipstick: లిప్‌స్టిక్ వాడితే క్యాన్సర్.. కిడ్నీ వ్యాధులు వస్తాయా.. అసలు నిజం ఇదే..
Does Lipstick Cause Cancer
Krishna S
|

Updated on: Nov 05, 2025 | 7:35 PM

Share

ఈ రోజుల్లో లిప్‌స్టిక్‌ వాడని మహిళలు ఉండడం చాలా అరుదు. చాలా మంది లిప్‌స్టిక్ లేనిదే బయటకు వెళ్లరు. తమకు ఇష్టమైన షేడ్స్‌ను ఉత్సాహంగా కొనుగోలు చేసి వాడుతుంటారు. అయితే ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో లిప్‌స్టిక్‌లకు వ్యతిరేకంగా భారీ ప్రచారం జరుగుతోంది. కొన్ని లిప్‌స్టిక్‌లలో కాడ్మియం అనే విషపూరిత పదార్థం ఉందని, ఇది మూత్రపిండాల వ్యాధి, కడుపు క్యాన్సర్‌కు కారణమవుతుందని సమాచారం వ్యాపించింది.

నిజంగా భయపడాల్సిన అవసరం ఉందా? జాగ్రత్తగా ఉండటం మంచిదే కానీ భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. లైసెన్స్ పొందిన లిప్‌స్టిక్‌లలో కాడ్మియం జాడలు ఉన్నప్పటికీ.. అవి చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయని, అవి హానికరం కావని చర్మవ్యాధి నిపుణులు, ఆంకాలజిస్టులు చెబుతున్నారు. కాడ్మియం క్యాన్సర్‌కు కారణమైనప్పటికీ.. నాణ్యమైన సౌందర్య సాధనాలలో దాని స్థాయిలు శరీరానికి హానికరమైన స్థాయిల కంటే చాలా తక్కువగా ఉంటాయి. ధూమపానం, ఊబకాయం, సరైన ఆహారం లేకపోవడం వంటి అంశాలు క్యాన్సర్‌కు ప్రధాన కారణాలని ఆయన గుర్తు చేశారు.

నకిలీవి వాడొద్దు..

భద్రతా పరీక్షలు తప్పనిసరి అయినప్పటికీ.. నకిలీ ఉత్పత్తుల వాడకమే అసలైన సమస్య. ఈ నకిలీ ఉత్పత్తులలో విషపూరిత పదార్థాలు అధికంగా ఉండే అవకాశం ఉంది. నాణ్యమైన లిప్‌స్టిక్‌ల మితమైన వాడకం మూత్రపిండాల వ్యాధి లేదా కడుపు క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశం దాదాపు లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

 ఈ చిట్కాలు పాటించండి..

వినియోగదారులు నకిలీ ఉత్పత్తులను నివారించి, సురక్షితంగా ఉండటానికి నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు.

  • విశ్వసనీయ బ్రాండ్లు లేదా ఆథరైజ్‌డ్ రిటైలర్ల నుండి మాత్రమే లిప్‌స్టిక్‌లను కొనుగోలు చేయండి. అనుమానాస్పద డిస్కౌంట్లు లేదా ఆఫర్లను నివారించండి.
  • ఉత్పత్తి లేబుల్‌పై గడువు తేదీ, తయారీదారు సమాచారాన్ని తప్పనిసరిగా చెక్ చేయండి.
  • రాత్రి పడుకునే ముందు లిప్‌స్టిక్‌ను పూర్తిగా తొలగించడం ఉత్తమం.
  • మీకు అలెర్జీ సమస్యలు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
  • భారత్ సహా చాలా దేశాలలో సౌందర్య సాధనాలు మార్కెట్లోకి రాకముందే భద్రతా పరీక్షలు తప్పనిసరి. కాబట్టి భద్రతా
  • ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న కంపెనీల ఉత్పత్తులనే కొనాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..