Lifestyle: కామెర్లు వస్తే కళ్లు ఎందుకు పసుపు రంగులోకి మారుతాయో తెలుసా.?

అమెరికన్ ఫ్యామిలీ ఫిజిషియన్ ప్రకారం, కామెర్లు చర్మం, శ్లేష్మ పొరలు, కళ్ళలోని తెల్లటి భాగం పసుపు రంగులోకి మారుతాయి. శరీరం బిలిరుబిన్ అనే సమ్మేళనాన్ని సరిగ్గా ప్రాసెస్ చేయలేనప్పుడు, ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమైనప్పుడు బిలిరుబిన్ ఉత్పత్తి అవుతుంది. కాలేయం ఈ మురికి పదార్థాన్ని ఫిల్టర్ చేస్తూనే ఉంటుంది...

Lifestyle: కామెర్లు వస్తే కళ్లు ఎందుకు పసుపు రంగులోకి మారుతాయో తెలుసా.?
Jaundice
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 12, 2024 | 11:16 PM

కామెర్లు సహజంగా వచ్చే వ్యాధి. మనలో చాలా మంది ఒక్కసారైనా ఈ వ్యాధ బారిన పడే ఉంటాం. అయితే కామెర్లను లైట్‌ తీసుకుంటే దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కామెర్లు వ్యాధి సోకిన వారి ముఖం, కళ్లు, మూత్రం పసుపు రంగులోకి మారుతాయి. అలాగే చర్మం దురద, ఆకలి మందగించడం, వాంతులు వంటి సమస్యలు వచ్చే వస్తాయి. అయితే కామెర్లు వచ్చిన సమయంలో కళ్లు పసుపు రంగులోకి ఎందుకు మారుతాయి, కామెర్లు ఎందుకు వస్తాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

అమెరికన్ ఫ్యామిలీ ఫిజిషియన్ ప్రకారం, కామెర్లు చర్మం, శ్లేష్మ పొరలు, కళ్ళలోని తెల్లటి భాగం పసుపు రంగులోకి మారుతాయి. శరీరం బిలిరుబిన్ అనే సమ్మేళనాన్ని సరిగ్గా ప్రాసెస్ చేయలేనప్పుడు, ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమైనప్పుడు బిలిరుబిన్ ఉత్పత్తి అవుతుంది. కాలేయం ఈ మురికి పదార్థాన్ని ఫిల్టర్ చేస్తూనే ఉంటుంది. శరీరంలో దాని పరిమాణం అధికంగా మారినప్పుడు, కాలేయం దానిని శుభ్రం చేయలేకపోతుంది. దీనివల్ల కామెర్లు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

బైలిరుబిన్‌ అనేది పసుపురంగులో ఉండే ఒక వ్యర్థ పదార్థం. ఎర్రరక్తకణాలలోని హిమోగ్లోబిన్‌ తొలగిపోయాక మిగిలిపోయే భాగం ఇది. బైలిరుబిని లివర్‌కు వెళ్లగానే అక్కడ దానిపై కొన్ని కెమికల్స్‌ పనిచేస్తాయి. ఆ కెమికల్‌ రియాక్షన్‌తో అది అన్‌కాంజుగేటెడ్‌ బైలిరుబిన్‌ అనే పదార్థంగా తయారవుతుంది. కాలేయం దీన్ని పైత్యరసంలోకి పంపిస్తుంది.

ఇది చివరికి యూరిన్‌ ద్వారా విసర్జితమవుతుంది. యూరిన్‌ పసుపు రంగులో ఉండడానికి ఇదే కారణంగా చెప్పొచ్చు. లివర్‌ సరిగా పనిచేయనప్పుడు, రక్తంలో బిలిరుబిన్ అనే వ్యర్థ పదార్థం పేరుకుపోతుంది. రక్తంలో ఈ పదార్ధం పెరుగుదల కారణంగా, కళ్లు, గోర్లు పసుపు రంగులోకి మారతాయి. బైలిరుబిని కంటెంట్‌ ఇంకా ఎక్కువైతే.. పసుపు రంగు ఆకుపచ్చ రంగుగా మారవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..