Rosemary Tea: మీరు తాగే టీ, కాఫీ కంటే 1000 రెట్ల బెస్ట్ చాయ్..! నిజంగా అమృతమే.. రోజూ ఉదయం ఖాళీకడుపుతో తాగండి!
అయితే టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి ఎంత హానికరమో ఇప్పటికే మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం..అయినప్పటికీ చాయ్ లేకుండా ఉండలేకపోతున్నాం. అయితే ఆ టీని ఉపయోగపడేలా చేయగలిగితే నష్టమేంటి..! అవును మీరు హెర్బల్ టీ గురించి విని ఉంటారు. అయితే దీన్ని ఇంట్లోనే ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో తెలుసా? హెర్బల్ టీ మీ రోజువారీ రుచికరమైన టీ లాగా ఉండదు. కానీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
చాయ్ అంటే మనందరికీ ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఎందుకంటే.. ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ తాగకపోతే మనలో చాలా మందికి ఏ పని జరగదు. అంతేకాదు.. కడుపులో కప్పు చాయ్ పడకపోతే, రోజంతా శక్తి రాదు. కొందరైతే రోజుకు రెండు నుంచి మూడసార్లు చాయ్ తాగుతుంటారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా ఎప్పుడు పడితే అప్పుడు తాగేస్తుంటారు. మన దేశంలో దాదాపు 64 శాతం మంది రెగ్యులర్ గా చాయ్ తాగుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి ఎంత హానికరమో ఇప్పటికే మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం..అయినప్పటికీ చాయ్ లేకుండా ఉండలేకపోతున్నాం. అయితే ఆ టీని ఉపయోగపడేలా చేయగలిగితే నష్టమేంటి..! అవును మీరు హెర్బల్ టీ గురించి విని ఉంటారు. అయితే దీన్ని ఇంట్లోనే ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో తెలుసా?
హెర్బల్ టీ మీ రోజువారీ రుచికరమైన టీ లాగా ఉండదు. కానీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బరువు తగ్గేందుకు చాలా మంది గ్రీన్ టీ తాగుతుంటారు. అయితే రోజ్‌మేరీ టీ నాణ్యత తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీరు ప్రతిరోజూ ఉదయం రోజ్మేరీ లీఫ్ టీని తాగగలిగితే, అప్పుడు మీరు అదనంగా చర్మానికి ఎలాంటి క్రీములు అప్లై చేయవలసిన అవసరం ఉండదు. ఈ టీ తాగడం వల్ల చర్మం సహజంగా మెరుస్తుంది. అయితే ఈ టీ ఎలా తయారు చేయాలి? రోజ్మేరీ టీని తయారు చేయడానికి మీకు పెద్దగా శ్రమ అవసరం లేదు. దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..
రోజ్మేరి టీ తయారీకి కావలసింది రోజ్మేరీ ఆకులు, కొద్దిగా అల్లం. బాణలిలో నీళ్లు పోసి అందులో కొన్ని రోజ్‌మేరీ ఆకులు, దంచిన అల్లం వేయాలి. ఇప్పుడు బాగా మరిగించాలి. బాగా మరిగిన తర్వాత నీటి రంగు మారినట్లు మీరు చూస్తారు. ఆ తర్వాత వడకట్టి కప్పులో పోసుకుంటే.. రోజ్మేరీ టీ రెడీగా ఉంటుంది. కావాలంటే మీరు దాని ప్రయోజనాలను పెంచడానికి కాస్త తేనె, నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు.
* రోజ్మేరీ టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
రోజ్మేరీ దాని యాంటీమైక్రోబయల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది, ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. రోజ్మేరీలో ఉండే లక్షణాలు రోస్మరినిక్ యాసిడ్, కెఫిక్ యాసిడ్, కార్నోసిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు అతి ముఖ్యమైనవి. ఇవి మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడతాయి. రోజ్మేరీ మనం తిన్న ఆహారం విచ్ఛిన్నం కావడానికి సహాయపడుతుంది. పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి లక్షణాలను దూరం చేస్తుంది. రోజ్మేరీలోని శోథ నిరోధక లక్షణాలు, శరీరంలో వాపును, ఇతర వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సమర్థవంతంగా సహాయపడతాయి.
రోజ్మేరీ టీ తాగితే మెదడు పనితీరు మెరుగుపడుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. రోజ్మేరీ వాసనను పీల్చడం వల్ల జ్ఞాపకశక్తి, చురుకుదనం పెరుగుతుంది. రోజ్మేరీ టీ తాగితే మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఇందులోని యాంటీ ఇన్ల్ఫమేటరీ , యాంటీఆక్సిడెంట్ ప్రభావాలు కంటి చూపుకు మంచిది. రోజ్మేరీలో కార్నోసోల్ పుష్కలంగా ఉంటుంది, ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను మందగించే ఫైటోకెమికల్. రోజ్మేరీలో యాంటీఆక్సిడెంట్లు, అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ టీని రోజూ డైట్‌లో చేర్చుకుంటే ఎలాంటి చర్మ సమస్య అయినా దూరమవుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి