AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milk Tea Side Effects: పరగడుపున పాలు కలిపిన టీ తాగితే ఏమవుతుందో తెలుసా..? సైడ్ ఎఫెక్ట్స్ తెలిస్తే పారిపోతారు..!

స్ట్రాంగ్ టీ తాగడానికి ఇష్టపడేవారికి ఇది నిజంగా షాకింగ్‌ విషయమే..ఎందుకంటే స్ట్రాంగ్ టీ ఆరోగ్యానికి అంత మంచిది కాదట. పదే పదే టీ తాగటం వల్ల శరీరం పొడిబారుతుంది. డీహైడ్రేట్ అవుతుంది. తద్వారా తీవ్రమైన మలబద్ధకం కలుగుతుందట. మిల్క్ టీ ఎక్కువగా తాగటం వల్ల డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. ఇది తలనొప్పికి కారణమవుతుంది. కాబట్టి పాలు, పంచదార కలిపిన టీని ఎక్కువగా తాగడం మానుకోవాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే మంచిది.

Milk Tea Side Effects: పరగడుపున పాలు కలిపిన టీ తాగితే ఏమవుతుందో తెలుసా..? సైడ్ ఎఫెక్ట్స్ తెలిస్తే పారిపోతారు..!
Milk Tea Side Effects
Jyothi Gadda
|

Updated on: Mar 13, 2024 | 9:39 AM

Share

మన దేశంలో టీ ప్రియులు చాలా ఎక్కువ మందే ఉంటారు. చాయ్‌ విషయంలో దిల్ మాంగే మోర్ అంటారు. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఎప్పుడైనా సరే.. ఇక్కడి ప్రజలను టీ కావాలా అని అడిగితే..వద్దని ఎవరూ చెప్పారు. చాలామందికి టీ తాగకపోతే రోజు గడవదు. టైమ్‌కు టీ పడకపోతే తలనొప్పి కూడా వస్తుంది. కానీ, పదే పదే టీ తాగడాన్ని అలవాటుగా మార్చకుంటే భవిష్యత్తులో సమస్యేనట. అయితే, ఈ కథనం ద్వారా మిల్క్ టీ గురించి ఒక షాకింగ్‌ విషయం చెప్పబోతున్నాం. ఖాళీ కడుపుతో పాలతో చేసిన టీ తాగడం వల్ల చాలా హాని జరుగుతుందని అనేక పరిశోధనలలో నిరూపించబడింది. ఇది టీ ప్రియులు చదివిన తర్వాత బాధపడతారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మిల్క్‌ టీ తాగితే ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

టీ తాగడం వల్ల కాలేయంపై చెడు ప్రభావం చూపుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కాలేయంలో ఉండే పైత్యరసం ఉత్తేజితమవుతుంది. దీని కారణంగా టీ తాగిన వెంటనే ఉద్వేగానికి లోనవుతారు. ఇది కూడా మీకు అసౌకర్యాన్ని కలిగించవచ్చు. మిల్క్‌టీ, డికాక్షన్‌ వంటివి ఆకలిని తగ్గిస్తుంది..పాలతో చేసిన టీ మాదిరిగానే బ్లాక్ టీ కూడా ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు.. దీని కారణంగా మీ శరీరంలో వాపు, ఉబ్బరం సమస్య పెరుగుతుంది. బ్లాక్ టీ ఎక్కువగా తాగడం వల్ల ఆకలి కూడా తగ్గుతుంది. అంతేకాదు..మిల్క్‌ టీ కోసం డికాషన్‌, పాలు కలిపినప్పుడు రెండూ గ్యాస్ ఉత్పత్తిని పెంచుతాయి. టీలో ఉండే టానిన్లు జీర్ణవ్యవస్థకు అంతరాయం కలిగిస్తాయి. దాంతో కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి.

స్ట్రాంగ్ టీ తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు: స్ట్రాంగ్ టీ తాగడానికి ఇష్టపడేవారికి ఇది నిజంగా షాకింగ్‌ విషయమే..ఎందుకంటే స్ట్రాంగ్ టీ ఆరోగ్యానికి అంత మంచిది కాదట. స్ట్రాంగ్‌ టీ తాగేటప్పుడు కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ని ఏర్పరుస్తుంది. ఇది కడుపులో గాయం, పుండ్లు వంటివి ఏర్పడటానికి కారణం కావచ్చు. దీనికి సమయానికి చికిత్స చేయకపోతే ఇది అల్సర్లకు కూడా దారి తీస్తుంది. ఇది శరీరానికి మరింత హానికరం. దీని కారణంగా మీరు మరింత చిరాకు, కలత చెందుతారు. మిల్క్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు అసమతుల్యత కూడా ఏర్పడుతుంది.

ఇవి కూడా చదవండి

మిల్క్‌టీలో కెఫిన్‌తో పాటు, టీలో థియోఫిలిన్ కూడా ఉంటుంది. పదే పదే టీ తాగటం వల్ల శరీరం పొడిబారుతుంది. డీహైడ్రేట్ అవుతుంది. తద్వారా తీవ్రమైన మలబద్ధకం కలుగుతుందట. మిల్క్ టీ ఎక్కువగా తాగటం వల్ల డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. ఇది తలనొప్పికి కారణమవుతుంది. కాబట్టి పాలు, పంచదార కలిపిన టీని ఎక్కువగా తాగడం మానుకోవాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి