World Largest Snake: ప్రపంచంలోనే అతి పెద్ద పాము ఇదే.. దీనిని చూస్తే బిత్తరపోతారు.. వీడియో చూస్తే వెన్నులో వణుకు ఖాయం..

ఒక భారీ అనకొండను గుర్తించారు పరిశోధకులు. ప్రపంచంలోనే అతిపెద్ద పాము ఇదేనని చెబుతున్నారు. ఈ పాము సగటు మనిషి బరువు కంటే మూడు రెట్లు, దాదాపు 200 కిలోల బరువు ఉంటుందని చెప్పారు. పరిమాణంలో ఇది 26 అడుగుల పొడవు ఉందని చెప్పారు. దాని తల మనిషి తలతో సమానంగా ఉంటుంది. ఈ పాము పేరు నార్తర్న్ గ్రీన్ అనకొండ. వైల్డ్ లైఫ్ ప్రెజెంటర్ ప్రొఫెసర్ ఫ్రీక్ వోంక్ బ్రెజిల్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో దీనిని కనుగొన్నారు.

World Largest Snake: ప్రపంచంలోనే అతి పెద్ద పాము ఇదే.. దీనిని చూస్తే బిత్తరపోతారు.. వీడియో చూస్తే వెన్నులో వణుకు ఖాయం..
World Largest Snake
Follow us

|

Updated on: Mar 13, 2024 | 7:51 AM

World Largest Snake: అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో ఒక భారీ అనకొండను గుర్తించారు పరిశోధకులు. ప్రపంచంలోనే అతిపెద్ద పాము ఇదేనని చెబుతున్నారు. ఈ పాము సగటు మనిషి బరువు కంటే మూడు రెట్లు, దాదాపు 200 కిలోల బరువు ఉంటుందని చెప్పారు. పరిమాణంలో ఇది 26 అడుగుల పొడవు ఉందని చెప్పారు. దాని తల మనిషి తలతో సమానంగా ఉంటుంది. ఈ పాము పేరు నార్తర్న్ గ్రీన్ అనకొండ. వైల్డ్ లైఫ్ ప్రెజెంటర్ ప్రొఫెసర్ ఫ్రీక్ వోంక్ బ్రెజిల్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో దీనిని కనుగొన్నారు. సోషల్‌ మీడియాలో ఈ భారీ పాము నార్తర్న్‌గ్రీన్‌ అనకొండ వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో ఒక భారీ అనకొండ కనిపించింది. ప్రపంచంలోనే అతిపెద్ద పాము ఇదేనని చెబుతున్నారు పరిశోధకులు. ఈ పాము సగటు మనిషి బరువు కంటే మూడు రెట్లు, దాదాపు 200 కిలోల బరువు ఉంటుంది. పరిమాణంలో ఇది 26 అడుగుల పొడవు ఉంది. దాని తల మనిషి తలతో సమానంగా ఉంటుంది. ఈ పాము పేరు నార్తర్న్ గ్రీన్ అనకొండ. వైల్డ్ లైఫ్ ప్రెజెంటర్ ప్రొఫెసర్ ఫ్రీక్ వోంక్ బ్రెజిల్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో దీనిని కనుగొన్నారు. ఇంతకుముందు తెలిసిన అతిపెద్ద పాము జాతి రెటిక్యులేటెడ్ పైథాన్, ఇది సగటు పొడవు 20 అడుగుల 5 అంగుళాలు. అయితే ఇప్పుడు కొత్తగా కనిపించిన ఈ పాము సైజు దానికంటే చాలా పెద్దది.

ఇవి కూడా చదవండి

ఇంతకుముందు అమెజాన్‌లో ఒక జాతి ఆకుపచ్చ అనకొండ మాత్రమే ఉండేది. గ్రీన్ అనకొండపై అధ్యయనం ఫిబ్రవరి 16న సైంటిఫిక్ జర్నల్ డైవర్సిటీలో ప్రచురించబడింది. 40 ఏళ్ల డచ్ బయాలజిస్ట్ ప్రొఫెసర్ వోంక్ దిగ్గజం అనకొండ పక్కన ఈత కొడుతూ కనిపించాడు. ఇది 26 అడుగుల పొడవు, దాదాపు 200 కిలోల బరువు ఉంటుందని తెలిపారు. తొమ్మిది దేశాలకు చెందిన మరో 14 మంది శాస్త్రవేత్తలతో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద పాము జాతి గ్రీన్ అనకొండను కనుగొన్నాం’ అని ఆయన చెప్పారు.

ప్రొఫెసర్ వోంక్ మాట్లాడుతూ, ‘మేము కొత్త జాతికి లాటిన్ పేరు యునెక్టెస్ అకాయామా, నార్తర్న్ గ్రీన్ అనకొండ అని పెట్టాము. అకాయామా అనే పదం ఉత్తర, దక్షిణ అమెరికాలోని వివిధ దేశీయ భాషల నుండి వచ్చింది. మహా పాము అని అర్థం. వీడియోలో మీరు చూస్తున్నది నేను చూసిన అతిపెద్ద అనకొండ ఇదే అని ప్రొఫెసర్ వోంక్ చెప్పారు. అది కారు టైరులా మందంగా ఉందన్నారు. దీని పరిమాణం 26 అడుగుల పొడవు, 200 కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. నా శరీరమంతా దాని తలతో సమానంగా ఉందన్నారు.

అయితే, ఈ అతిపెద్ద పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాము పొడవును చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పాము అని పేర్కొన్నారు. ప్రస్తుతానికి పామును నిశితంగా పరిశీలిస్తున్నారు. అనకొండ సమూహంలో ఈ పాముకు చెందిన ఇతర ఉపజాతి ఏమైనా ఉందా అనే దానిపై కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

టాలీవుడ్‌ వజ్రోత్సవాల వివాదాన్ని గుర్తు చేసిన చిరంజీవి
టాలీవుడ్‌ వజ్రోత్సవాల వివాదాన్ని గుర్తు చేసిన చిరంజీవి
ఆశీష్‌ మెరిసే.. తెలుగు టైటాన్స్‌ మురిసే...
ఆశీష్‌ మెరిసే.. తెలుగు టైటాన్స్‌ మురిసే...
హైదరాబాద్‌లో దీపావళిపై పోలీసులు ఆంక్షలు విధించారా...?
హైదరాబాద్‌లో దీపావళిపై పోలీసులు ఆంక్షలు విధించారా...?
ఎదురులేని హర్యానా స్టీలర్స్‌.. దబంగ్‌ ఢిల్లీపై 41-34తో ఘన విజయం
ఎదురులేని హర్యానా స్టీలర్స్‌.. దబంగ్‌ ఢిల్లీపై 41-34తో ఘన విజయం
రతన్ టాటా గౌరవార్థం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కీలక ప్రకటన.. ఏంటంటే
రతన్ టాటా గౌరవార్థం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కీలక ప్రకటన.. ఏంటంటే
ఖైదీ 2 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. దానితో పాటు మరొక సర్‌ప్రైజ్‌
ఖైదీ 2 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. దానితో పాటు మరొక సర్‌ప్రైజ్‌
'రక్తపు మడుగులో ఉన్న నన్ను చూసి నా భర్త'.. నటి శ్రీవాణి ఎమోషనల్
'రక్తపు మడుగులో ఉన్న నన్ను చూసి నా భర్త'.. నటి శ్రీవాణి ఎమోషనల్
తెలుగు స్టేట్స్‌లో కంగువాకు తప్పని కస్టాలు
తెలుగు స్టేట్స్‌లో కంగువాకు తప్పని కస్టాలు
గీజర్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 5వేలలో బెస్ట్‌ డీల్స్ ఇవే..
గీజర్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 5వేలలో బెస్ట్‌ డీల్స్ ఇవే..
ఆదివాసీ గూడాల్లో దండారిసంబరాలు..అడవి బిడ్డల గుండెల్లో ఆనందోత్సహలు
ఆదివాసీ గూడాల్లో దండారిసంబరాలు..అడవి బిడ్డల గుండెల్లో ఆనందోత్సహలు