Afternoon Sleep: మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోతున్నారా..? ఈ ఆసక్తికర విషయం మీకు తెలుసా?

కొన్ని పరిశోధనలు చిన్న నిద్రలు చురుకుదనం, ఉత్పాదకతను పెంచడంలో సహాయపడతాయని సూచిస్తున్నాయి. బ్రెయిన్​ పవర్‌కు న్యాప్​బాగా పనిచేస్తుందని ఇప్పటికే చాలా పరిశోధనలు వెల్లడించాయి. ఇంతకుముందు చేసిన పరిశోధనల్లో న్యాప్​ వల్ల చురుకుదనం, జ్ఞాపకశక్తిలో మెరుగుదల కనిపించాయి. అంతేకాదు కాసేపు తీసే కునుకు..

Afternoon Sleep: మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోతున్నారా..? ఈ ఆసక్తికర విషయం మీకు తెలుసా?
Afternoon Sleep
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 12, 2024 | 1:30 PM

మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నిద్రపోవడం సాధారణం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనం మధ్యాహ్నం ఆహారం తీసుకుంటే జీర్ణవ్యవస్థలో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీని వల్ల మెదడుకు రక్త సరఫరా తగ్గిపోయే అవకాశం ఉంది. దీని వల్ల నిద్ర, అలసట సమస్యలు సర్వసాధారణం. తిన్న తర్వాత శరీరంలో గ్లూకోజ్ పరిమాణం పెరుగుతుందని కూడా చెబుతారు. దీనివల్ల ఎక్కువగా నిద్రపోతారు. ఇది సాధారణ ప్రక్రియ. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ మీరు ప్రతిరోజూ మధ్యాహ్నం నిద్రపోవడం అలవాటు చేసుకుంటే మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం, యునైటెడ్ స్టేట్స్‌లో మూడింట ఒక వంతు మంది పెద్దలు మధ్యాహ్నం నిద్రపోతారు. కొన్ని పరిశోధనలు చిన్న నిద్రలు చురుకుదనం, ఉత్పాదకతను పెంచడంలో సహాయపడతాయని సూచిస్తున్నాయి. బ్రెయిన్​ పవర్‌కు న్యాప్​బాగా పనిచేస్తుందని ఇప్పటికే చాలా పరిశోధనలు వెల్లడించాయి. ఇంతకుముందు చేసిన పరిశోధనల్లో న్యాప్​ వల్ల చురుకుదనం, జ్ఞాపకశక్తిలో మెరుగుదల కనిపించాయి. అంతేకాదు కాసేపు తీసే కునుకు క్రియేటివిటీని పెంచుతుంది. అయితే, ఇది ఒక అలవాటుగా మారితే మాత్రం అది ప్రతికూల పరిణామాలను కలిగిస్తుందని చెబుతున్నారు.

పగటి పూట నిద్రపోవడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది..?

ఇవి కూడా చదవండి

హార్వర్డ్ హెల్త్ రిపోర్ట్ ప్రకారం.. మధ్యాహ్నం వేళ నిద్రపోయే అలవాటు దీర్ఘకాలంలో చాలా నష్టాలను కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పగటిపూట ఎక్కువ సేపు నిద్రపోతే.. తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు చెబుతున్నారు.

పగలు నిద్రపోవాలా వద్దా?

పగటిపూట ఎక్కువ సమయం నిద్రపోయే పెద్దలకు మధుమేహం, గుండె జబ్బులు, డిప్రెషన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హార్వర్డ్ నిపుణులు చెబుతున్నారు. పగటిపూట నిద్రపోవడం అంటే మీకు రాత్రిపూట తగినంత నిద్ర రావడం కష్టంగా మారుతుంది. ఇది అనేక దీర్ఘకాలిక వ్యాధులను పెంచుతుంది. కాబట్టి, రాత్రి తగినంత నిద్ర పొయేలా చూసుకోండి. పగటిపూట ఎక్కువగా నిద్రపోవడం వల్ల నిద్ర చక్రానికి భంగం కలుగుతుంది. అందుకే పగటిపూట కాస్త కునుకు తీస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒక వ్యక్తి పగటి పూట 20-30 నిమిషాల కంటే ఎక్కువ నిద్రపోకూడదు. లేదంటే నష్టం జరగవచ్చునని సూచిస్తున్నారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి