Diabetes Symptoms In Men: మగవారిలో ఈ లక్షణాలు మధుమేహానికి సంకేతం కావచ్చు..! నిర్లక్ష్యం ఖరీదు పెను ముప్పు..

దీనివల్ల గుండెపోటు, పక్షవాతం, చూపు కోల్పోవడం, మూత్రపిండాల వైఫల్యం వంటివి సంభవించే ముప్పు ఉంటుంది. ప్రస్తుత సర్వేల ఆధారంగా మధుమేహం అత్యంత సాధారణ వ్యాధి. మధుమేహం అనేక లక్షణాలు మనందరికీ తెలిసినవే. కానీ, మగవారిలో కాళ్లు, పాదాలలో కనిపించే కొన్ని లక్షణాలు కూడా మధుమేహానికి సంకేతంగా ఉంటాయని మీకు తెలుసా? పురుషులలో మధుమేహం లక్షణాలు

Diabetes Symptoms In Men: మగవారిలో ఈ లక్షణాలు మధుమేహానికి సంకేతం కావచ్చు..! నిర్లక్ష్యం ఖరీదు పెను ముప్పు..
Diabetes Symptoms In Men
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 12, 2024 | 12:48 PM

Diabetes Symptoms In Men: డయాబెటిస్ దీనినే షుగర్‌ వ్యాధి, మధుమేహం అని కూడా అంటారు. ఈ మధుమేహం అనేది జీవితకాలం వేధించే తీవ్రమైన జబ్బు. వయసుతో సంబంధం లేకుండా లింగ విభేదం చూపించకుండా ఎవరికైనా ఈ జబ్బు రావొచ్చు. ప్రతీ ఏడాది లక్షల మంది డయాబెటిస్ కారణంగా చనిపోతున్నారు. రక్తంలోని గ్లూకోజ్‌ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం, చూపు కోల్పోవడం, మూత్రపిండాల వైఫల్యం వంటివి సంభవించే ముప్పు ఉంటుంది. ప్రస్తుత సర్వేల ఆధారంగా మధుమేహం అత్యంత సాధారణ వ్యాధి. మధుమేహం అనేక లక్షణాలు మనందరికీ తెలిసినవే. కానీ, మగవారిలో కాళ్లు, పాదాలలో కనిపించే కొన్ని లక్షణాలు కూడా మధుమేహానికి సంకేతంగా ఉంటాయని మీకు తెలుసా? పురుషులలో మధుమేహం లక్షణాలు ఎలా ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం..

దాహం, తరచుగా మూత్రవిసర్జన, హఠాత్తుగా బరువు తగ్గడం వంటి లక్షణాలు మధుమేహంలో సర్వసాధారణం. అలాగే, పురుషులలో కాళ్లు, పాదాలపై కనిపించే కొన్ని లక్షణాలు మధుమేహం ప్రారంభ సంకేతాలు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పురుషుల కాళ్లు, పాదాల్లో కనిపించే ఈ లక్షణాలు మధుమేహానికి సంకేతం కూడా!

* కాళ్లు మొద్దుబారడం:

ఇవి కూడా చదవండి

ఎక్కువ సేపు కాళ్లు వంచి కూర్చున్నప్పుడు కాళ్లు తిమ్మిర్లు రావడం సర్వసాధారణం. అయినప్పటికీ, కాళ్ళు, పాదాలలో నిరంతర కాలు జలదరింపు అనుభూతి లేదా తిమ్మిరి మధుమేహం నుండి నరాల నష్టం ప్రారంభ సూచికలలో ఒకటి.

* బర్నింగ్ సెన్సేషన్:

పురుషులు ముఖ్యంగా తమ అరికాళ్లపై మంటగా అనిపిస్తే పట్టించుకోకపోవడం మంచిది కాదు. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన టెస్టులు, మందులు వాడాలి.

* చిన్న గాయమైనా త్వరగా మానదు:

రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే రక్తప్రసరణ బలహీనపడుతుంది. అలాగే చిన్నపాటి గాయాలు కూడా త్వరగా మానవు. మగవారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అది కూడా మధుమేహానికి సూచన కావచ్చు. అలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి.

* కాలు తిమ్మిర్లు:

కాళ్ల తిమ్మిరి వివిధ కారణాలను కలిగి ఉంటుంది. అయినప్పటికీ, మధుమేహం ఉన్న పురుషులు తరచుగా తీవ్రమైన కాలు తిమ్మిరిని అనుభవిస్తారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు.

* సెన్సేషన్ తగ్గడం:

డయాబెటిస్ వల్ల కాళ్లు, పాదాల్లో సెన్సేషన్ తగ్గుతుంది. అటువంటి సందర్భాలలో గాయాలు లేదా రుగ్మతలను గుర్తించడం కష్టం అవుతుంది. తగ్గిన సున్నితత్వం కారణంగా పురుషులు వారి కాళ్ళు, పాదాలపై చిన్న గాయాలను విస్మరించవచ్చు. ఇది భవిష్యత్తులో తీవ్రమైన అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుందని చెప్పారు.

కాబట్టి పురుషులలో పైన పేర్కొన్న లక్షణాలు ఏవైనా ఉంటే, ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి సరైన సమయంలో తగిన చికిత్స పొందడం మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!