Weight Lose easy tips : ఈ ఎర్రటి పూలను ఇలా వాడితే.. ఏడు రోజుల్లోనే కోరుకున్న బరువు తగ్గడం గ్యారెంటీ..!
బరువు తగ్గడానికి బ్లాక్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, అల్లం టీ వంటివి వాడాలని చెబుతుంటారు. అయితే బరువు తగ్గడమే కాకుండా అనేక ఇతర సమస్యలను పరిష్కరించడంలో సహాయపడే ఒక స్పెషల్ టీ గురించి ఇక్కడ తెలుసుకోబోతున్నాం. అవును ఈ స్పెషల్ టీ తో మీరు ఈజీగా బరువు తగ్గుతారు. అంతేకాదు.. చర్మానికి, జుట్టు సంరక్షణలో కూడా ఇది అద్భుతం చేస్తుంది. అదేంటి ఎలా తయారు చేయాలి. దాని వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Weight Lose easy tips : మనం బరువు తగ్గాలనుకున్నప్పుడు మన చుట్టూ ఉన్నవారు అనేక సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అందరూ చెప్పే మొదటి సలహా ఏమిటంటే వివిధ రకాల టీలు తాగడం. బ్లాక్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, అల్లం టీ వంటివి వాడాలని చెబుతుంటారు. అయితే బరువు తగ్గడమే కాకుండా అనేక ఇతర సమస్యలను పరిష్కరించడంలో సహాయపడే ఒక స్పెషల్ టీ గురించి ఇక్కడ తెలుసుకోబోతున్నాం. అవును ఈ స్పెషల్ టీ తో మీరు ఈజీగా బరువు తగ్గుతారు. అంతేకాదు.. చర్మానికి, జుట్టు సంరక్షణలో కూడా ఇది అద్భుతం చేస్తుంది. అదేంటి ఎలా తయారు చేయాలి. దాని వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
బరువు తగ్గడానికి మందార పువ్వు : అవును, మందార టీ తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మందార పువ్వు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో చూడటానికి అంతే అందంగా ఉంటుంది. మందార పూల టీ ఒక సహజ హెర్బల్ టీ. ఇది పూర్తిగా కెఫిన్ లేనిది. అంతేకాదు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
మందార టీ ఆరోగ్య ప్రయోజనాలు:
బరువు తగ్గడంలో పనిచేస్తుంది:
అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నా, బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి మందార పువ్వు టీ ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు త్వరగా కరుగుతుంది. మన బాడీ మాస్ ఇండెక్స్ కూడా తగ్గుతుంది. ఈ టీని రోజుకు 1-2 సార్లు తీసుకోవడం ద్వారా, శరీర బరువును చాలా సులభంగా నియంత్రించవచ్చు.
ఒత్తిడి ఉపశమనం:
మందార పువ్వులతో తయారు చేసిన టీ మన మానసిక ఒత్తిడిని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది . దీనికి కారణం ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు. ఇది మన మానసిక ఒత్తిడిని దూరం చేయడం ద్వారా ఒత్తిడి లేకుండా ఉండటానికి సహాయపడుతుంది.
ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలో సహాయపడుతుంది:
మన శరీరాన్ని బాహ్య ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో మందార చాలా మేలు చేస్తుంది. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్‌ల నుండి మీ శరీరాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే మందార టీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి ప్రతిరోజూ ఒక కప్పు మందార టీని తీసుకోవాలి.
జుట్టు రాలడాన్ని నివారించడానికి:
మీరు చాలా కాలంగా జుట్టు రాలడంతో బాధపడుతుంటే, ఒక కప్పు మందార టీ తాగండి. మందార టీ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అంతే కాదు జుట్టు సిల్క్ లాగా మెరిసిపోయేలా చేస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి