AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Accident Viral Video: ట్రక్కును ఢీకొట్టి నుజ్జు నుజ్జైన కారు..అంతటి డేంజర్‌లో అద్భుతం జరిగింది..వీడియో చూస్తే కళ్లు బైర్లే..!

ఓ ఘోర కారు ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదం ఎంత భయానకంగా ఉందంటే.. కారు మొత్తం ట్రక్కు కింద కూరుకుపోయింది. కారు పూర్తిగా దెబ్బతిన్నది. వెనుక నుంచి లారీని ఢీకొట్టిన కారు ఏకంగా లారీ కిందకు దూసుకెళ్లి నుజ్జు నుజ్జుగా మారింది. ప్రమాదాన్ని చూస్తుంటే అందులో ప్రయాణించే వారు బతకడం కష్టమే కాదు అసాధ్యమని స్పష్టంగా చెప్పొచ్చు.

Accident Viral Video: ట్రక్కును ఢీకొట్టి నుజ్జు నుజ్జైన కారు..అంతటి డేంజర్‌లో అద్భుతం జరిగింది..వీడియో చూస్తే కళ్లు బైర్లే..!
Car Stuck Under Truck
Jyothi Gadda
|

Updated on: Mar 12, 2024 | 2:38 PM

Share

సోషల్ మీడియా ద్వారా ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలు బయటకు వస్తున్నాయి. ప్రమాదాల సమయంలో జరిగిన అద్భుతాలను మనం అనేకం వీడియోలలో చూస్తుంటాం..అటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక కారు డ్రైవర్‌ పెను పెద్ద ప్రమాదం నుండి అద్భుతంగా బయటపడటం కనిపించింది. ప్రమాదం చాలా తీవ్రంగా ఉంది. కారు వెనుక నుండి ట్రక్కును పూర్తిగా ఢీకొట్టింది. అయితే వారిని రక్షించేందుకు వచ్చిన వ్యక్తులు కారు డోర్ తెరిచి చూడగా ఓ అద్భుతం కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ ఘోర కారు ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదం ఎంత భయానకంగా ఉందంటే.. కారు మొత్తం ట్రక్కు కింద కూరుకుపోయింది. కారు పూర్తిగా దెబ్బతిన్నది. వెనుక నుంచి లారీని ఢీకొట్టిన కారు ఏకంగా లారీ కిందకు దూసుకెళ్లి నుజ్జు నుజ్జుగా మారింది. ప్రమాదాన్ని చూస్తుంటే అందులో ప్రయాణించే వారు బతకడం కష్టమే కాదు అసాధ్యమని స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత కొందరు వ్యక్తులు వచ్చి కారు డోర్‌ను బలవంతంగా తెరవడంతో డ్రైవర్‌ లోపలి నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఎయిర్‌బ్యాగ్‌, సీట్‌ బెల్ట్‌ వల్లే ఈ వ్యక్తి ప్రాణాలు రక్షించబడ్డాయని చెబుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వైరల్‌ వీడియోపై నెటిజన్లు విపరీతంగా స్పందించారు. ఇంత ఘోర ప్రమాదం జరిగిన తర్వాత అతను బయటకు రాగానే మొదటి పని తన ఫోన్‌ని చెక్ చేయడమేనని ఒకరు రాశారు. అందుకే ఎప్పుడూ సీటు బెల్టు పెట్టుకోవాలని అంటారు అని ఒకరు రాశారు. ఏమీ పట్టనట్టు బయటికి వస్తున్నాడంటూ మరొకరు రాశారు. కారు దిగిన వెంటనే ఈ వ్యక్తి ఫోన్ వాడుతూ కనిపించాడని.. ఈ ప్రమాదానికి ఫోన్ వాడడమే కారణమా? బహుశా అతను ఫోన్‌లో చాట్ చేస్తూ డ్రైవింగ్ చేస్తున్నాడని, అతనిపై కేసు నమోదు చేయాలని ఒకరు రాశారు. ఈ ప్రమాదం డ్రైవర్ అజాగ్రత్తను కూడా తెలియజేస్తోందని ఒకరు రాశారు.

@InternetH0F పేరు గల ఖాతాతో వీడియో షేర్‌ చేశారు. ఈ వీడియోను 7 మిలియన్ల కంటే ఎక్కువ మంది వీక్షించారు. దీనిపై వేలాది మంది కామెంట్లు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
బాలయ్య బర్త్ డే స్పెషల్.. మందుబాబులకు బంపర్ ఆఫర్..!
బాలయ్య బర్త్ డే స్పెషల్.. మందుబాబులకు బంపర్ ఆఫర్..!