AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dry Fruits Eating Time: డ్రై ఫ్రూట్స్‌ తింటున్నారా..? సరైన సమయంలో తింటే ఊహించని ప్రయోజనాలు..!

ఇలా చేయడం వల్ల గింజల్లో వేడి కలిగించే గుణం తగ్గుతుంది. అలాగే ఫైటిక్ యాసిడ్/టానిన్ విడుదల అవుతుంది. దీని వల్ల మనం వాటి నుంచి పోషకాలు గ్రహించడం సులభమవుతుంది. ఒకవేళ మీరు వాటిని నానబెట్టడం మర్చిపోతే.. డ్రై రోస్ట్‌ చేసి తినడం మంచిది. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి రోజూ 15 నుండి 25 గ్రాముల డ్రై ఫ్రూట్స్ తినవచ్చునని చెబుతున్నారు.

Dry Fruits Eating Time: డ్రై ఫ్రూట్స్‌ తింటున్నారా..? సరైన సమయంలో తింటే ఊహించని ప్రయోజనాలు..!
Dry Fruits
Jyothi Gadda
|

Updated on: Mar 13, 2024 | 10:07 AM

Share

ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని కోరుకుంటారు. దీని కోసం కొందరు జిమ్‌కి వెళ్తుంటారు. పండ్లు, నట్స్‌ వంటి పోషకాహారం తింటారు. తమను తాము ఫిట్‌గా ఉంచుకోవటానికి వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు కూడా ఫిట్‌గా ఉండాలనుకుంటే, ఈ వార్త మీకోసమే. నిజానికి, మెరుగైన ఆరోగ్యం కోసం మార్కెట్లో అనేక జ్యూస్‌లు, పౌడర్‌లు, మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా మీరు ఫిట్‌గా ఉండగలరు. కానీ కొన్నిసార్లు అధిక వినియోగం హానికరం. కానీ, మీరు ఇంట్లో ఉంటూనే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి డ్రై ఫ్రూట్స్ తినవచ్చు. డ్రై ఫ్రూట్స్‌లో వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్‌ వినియోగం శరీరానికి చాలా మేలు చేస్తుంది. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి బలం చేకూరుతుంది. రోజూ గుప్పెడు డ్రైఫ్రూట్స్‌ తీసుకుంటే.. నీరసం, నిస్సత్తువ దరిచేరవు, శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. అయితే, డ్రైఫ్రూట్స్‌ తినేప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే .. ఇంకా మెరుగైన లాభాలు పొందవచ్చునని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. సరైన సమయంలో, సరైన మోతాదులో డ్రై ఫ్రూట్స్‌ తీసుకోవాలని చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు..

డ్రై ఫ్రూట్స్‌లో విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం బలపడుతుంది. డ్రై ఫ్రూట్స్ శక్తిని కలిగి ఉంటాయి. ఇది రోజంతా మీకు శక్తిని ఇస్తుంది. కొన్ని డ్రై ఫ్రూట్స్, ముఖ్యంగా బాదంపప్పులో విటమిన్ ఇ, ఫైబర్, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఆకలి తగ్గుతుంది. నోటి అందాన్ని కాపాడుతుంది. డ్రై ఫ్రూట్స్‌లో ఉండే ప్రొటీన్లు, మినరల్స్, క్యాల్షియం శరీర కండరాలను నిర్వహించడానికి సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

జీర్ణశక్తి బలన్నిస్తుంది..

డ్రై ఫ్రూట్స్‌ తినడానికి మార్నింగ్‌ టైమ్‌ బెటర్‌ అంటున్నారు నిపుణులు. వేడి స్వభావం కలిగిన డ్రై ఫ్రూట్స్‌ నీటిలో నానబెట్టి, వాటి పై తొక్క తీసి తర్వాత తినాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆరోగ్యకరమైన పెద్దలు ప్రతిరోజూ 15 నుండి 25 గ్రాముల డ్రై ఫ్రూట్స్ తినవచ్చు. కానీ, వయస్సు, ఆరోగ్య పరిస్థితిలను దృష్టిలో ఉంచుకుని తింటే మంచిది. డ్రై ఫ్రూట్స్ జీర్ణక్రియ ప్రక్రియకు మద్దతునిస్తాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో డ్రైఫ్రూట్స్‌ తినడం మంచిదని చెబుతున్నారు. లేదంటే, సాయంత్రం స్నాక్‌గా కూడా నట్స్‌ తినొచ్చని సూచిస్తున్నారు. ఇలా తింటే.. ఎక్కువగా ఆహారం తినాలనే కోరిక తగ్గుతుందని చెబుతున్నారు.

డ్రై ఫ్రూట్స్ ఇలా తింటే..

రోజూ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం హానికరం కాదు. కానీ, తినడానికి సరైన సమయం తెలుసుకోవటం మంచిది. డ్రై ఫ్రూట్స్ తినేముందు వాటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే పొట్టు తీసి తినాలి. ఇలా చేయడం వల్ల గింజల్లో వేడి కలిగించే గుణం తగ్గుతుంది. అలాగే ఫైటిక్ యాసిడ్/టానిన్ విడుదల అవుతుంది. దీని వల్ల మనం వాటి నుంచి పోషకాలు గ్రహించడం సులభమవుతుంది. ఒకవేళ మీరు వాటిని నానబెట్టడం మర్చిపోతే.. డ్రై రోస్ట్‌ చేసి తినడం మంచిది. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి రోజూ 15 నుండి 25 గ్రాముల డ్రై ఫ్రూట్స్ తినవచ్చునని చెబుతున్నారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి