Face Serum: ముఖం అద్దంలా మెరిసిపోవాలా? అయితే, ఇంట్లోనే తయారు చేసిన ఈ సీర‌మ్ మీకోస‌మే..!

ఇంట్లో తయారుచేసిన సీరం విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న మీ చర్మానికి సహజమైన పోషణను అందిస్తుంది. ఇది పూర్తిగా సహజ పదార్ధాలతో తయారు చేయబడినందున, ఇది వాడటం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు వచ్చే అవకాశం లేదు.ఈ సీరం చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేసి, మృదువుగా చేస్తుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్న ఈ సీరం ముడతలు, ఫైన్ లైన్లను తగ్గించడంలో సహాయపడుతుంది.

Face Serum: ముఖం అద్దంలా మెరిసిపోవాలా? అయితే, ఇంట్లోనే తయారు చేసిన ఈ సీర‌మ్ మీకోస‌మే..!
Face Serum
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 13, 2024 | 9:10 AM

Face Serum: ప్రస్తుత రోజుల్లో చర్మ సంరక్షణపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెడుతున్నారు. మెరిసే, మచ్చలేని చర్మం కావాలని ప్రతి ఒక్కరూ కొరుకుంటారు. అలాగే, చర్మ సౌందర్యం కోసం వివిధ ప్రయత్నాలు, వంటింటి చిట్కాలు పాటిస్తుంటారు. కొందరు వేలకు వేలు పోసి చర్మ సంరక్షణ ఉత్పత్తులను వాడుతుంటారు. మరికొందరు బ్యూటీ పార్లర్లను ఆశ్రయిస్తుంటారు. చర్మ సంరక్షణ కోసం ఖరీదైన క్రీములు, లోషన్లు, మాయిశ్చరైజర్లు వంటివి ఉపయోగిస్తుంటారు. స్కిన్‌ కేర్‌లో భాగంగా ఫేషియల్ సీరమ్ కూడా ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. ఎటువంటి స్కీన్ ఉన్నవారైనా నిరభ్యంతరంగా ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే, అనేక రకాల చర్మ సమస్యలకు ఫేస్‌ సీరమ్‌ పరిష్కరం అవుతుందని కూడా అంటున్నారు. ఇంట్లోనే సీరమ్‌ను సులభంగా, సహజంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..దాంతో మీ ముఖం మరింత అందంగా, మెరుస్తూ, ముడతలు లేకుండా మారుతుంది.

ఈ సీరమ్‌ను తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..1 టీస్పూన్ విటమిన్ ఇ ఆయిల్, 2 టీస్పూన్ల అలోవెరా జెల్, అర టీస్పూన్ స్వచ్ఛమైన రోజ్ వాటర్, కావాలనుకుంటే, 3 నుండి 4 చుక్కల లావెండర్ ఉపయోగించవచ్చు. ఇక తయారీ విషయానికి వస్తే.. శుభ్రమైన గిన్నెలో విటమిన్ ఇ ఆయిల్, అలోవెరా జెల్, రోజ్ వాటర్ కలపండి. ఆ తర్వాత అందులో కొన్ని చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్‌ని కలపండి. ఇది చర్మానికి సువాసన, విశ్రాంతిని ఇస్తుంది. అన్ని పదార్థాలను బాగా కలపండి. తయారుచేసిన మిశ్రమాన్ని గాలి చొరబడని సీసాలో నింపి రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి.

ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఈ సీరమ్‌ని మీ ముఖం, మెడకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. మీరు ఉదయం నిద్ర లేవగానే, మీ చర్మం కొత్త మెరుపు, తాజాదనాన్ని పొందుతుంది. ఇంట్లో తయారుచేసిన సీరం విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న మీ చర్మానికి సహజమైన పోషణను అందిస్తుంది. ఇది పూర్తిగా సహజ పదార్ధాలతో తయారు చేయబడినందున, ఇది వాడటం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు వచ్చే అవకాశం లేదు.ఈ సీరం చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేసి, మృదువుగా చేస్తుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్న ఈ సీరం ముడతలు, ఫైన్ లైన్లను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?