Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water after Food: భోజనం తిన్నవెంటనే నీళ్లు తాగేస్తున్నారా.. డేంజర్‌లో పడ్డట్టే!

నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ నీటిని మాత్రం తాగరు. అదే విధంగా నీళ్లు తాగేందుకు కూడా ఓ సమయం ఉంది. నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. బాడీ డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా.. తేమగా ఉంటుంది. అప్పుడే అన్ని శరీరం, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. కానీ చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. ఏదన్నా ఆహారం తీసుకున్నాక నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇలా తాగడం వల్ల అనేక సమస్యలు వస్తాయని..

Water after Food: భోజనం తిన్నవెంటనే నీళ్లు తాగేస్తున్నారా.. డేంజర్‌లో పడ్డట్టే!
Water After Food
Follow us
Chinni Enni

|

Updated on: May 22, 2024 | 2:13 PM

నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ నీటిని మాత్రం తాగరు. అదే విధంగా నీళ్లు తాగేందుకు కూడా ఓ సమయం ఉంది. నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. బాడీ డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా.. తేమగా ఉంటుంది. అప్పుడే అన్ని శరీరం, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. కానీ చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. ఏదన్నా ఆహారం తీసుకున్నాక నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇలా తాగడం వల్ల అనేక సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజనం చేశాక నీళ్లను తాగితే ఏం జరుగుతుంది? ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణ సమస్యలు:

ఆహారం తిన్న వెంటనే నీటిని తాగితే.. జీర్ణ సమస్యలు అనేవి వస్తాయి. నీటిని అధికంగా తీసుకోవడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా అరగదు. ఆహారం నిల్వ ఉండిపోయి.. మల బద్ధకం, అజీర్తి, కొవ్వు పెరిగిపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఆహారం తినేటప్పుడు ఎక్కువగా దాహం వేస్తే తప్ప తీసుకోకూడదు. భోజనం చేసిన అరగంట వరకూ నీరు తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బరువు పెరుగుతారు:

తిన్న వెంటనే నీటిని ఎక్కువగా తీసుకుంటే.. వచ్చే సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. ఎందుకంటే.. నీళ్లు తాగడం వల్ల తిన్న ఆహారం అరగదు. నిల్వ ఉండిపోతుంది. దీంతో బరువు పెరగడం, ఊబకాయం సమస్యలు తలెత్తడం జరుగుతాయి. తిన్న ఆహారం జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ఆ సమయాన్ని నీళ్లు మార్చేస్తాయి. దీంతో మళ్లీ త్వరగా ఆకలి వేస్తుంది. ఇలా బరువు పెరుగుతారు.

ఇవి కూడా చదవండి

గ్యాస్ సమస్యలు:

తిన్న వెంటనే నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల గ్యాస్ కూడా బాగా పెరుగుతుంది. ఎందుకంటే అన్నం జీర్ణం అవడానికి సమయం పడుతుంది. ఈలోపు మీరు అధికంగా నీళ్లు తాగేస్తే.. ఆ ఆహారం అరగకుండా పక్కకు వెళ్తుంది. దీంతో గ్యాస్, అజీర్తి, అసిడిటీ, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం తలెత్తుతాయి.

డయాబెటీస్ వస్తుంది:

భోజనం చేశాక నీళ్ళు ఎక్కువగా తీసుకుంటే.. డయాబెటీస్ కూడా రావచ్చు. అదే విధంగా మధుమేహం ఉన్నవారు నీళ్లు తాగితే.. వెంటనే రక్తంలో షుగర్‌ లెవల్స్ పెరుగుతాయి.

ఎలా తాగాలి:

భోజనం చేసే అరగంట ముందు.. లేదంటే భోజనం చేసిన అరగంట తర్వాత నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల తిన్న ఆహారం అరగడానికి సమయం ఇచ్చినట్టు అవుతుంది. భోజనం చేసేటప్పుడు కూల్ డ్రింకులు అస్సలు తీసుకోకూడదు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..