Health: ఈ సింటమ్స్ కనిపిస్తే అస్సలు లేట్ చేయొద్దు.. పెను ప్రమాదం

బిజీ లైఫ్ స్టైల్.. ఉరుకులు పరుగుల జీవితంలో మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం మరచిపోతుంటాం.. సమయాన్ని ఆదా చేయడానికి లేదా సమయం లేకపోవడం వల్ల చాలా హానికరమైన ఆహారాన్ని తింటుంటాం.. అప్పటికప్పుడు దొరికే అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటూ కడుపు నింపుకుంటుంటాం.. ఇది శరీరంతోపాటు.. ప్రధానంగా మన కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ఈ లైఫ్ స్టైల్ వల్ల క్రమంగా ఆరోగ్యం క్షీణిస్తుంది.

Health: ఈ సింటమ్స్ కనిపిస్తే అస్సలు లేట్ చేయొద్దు.. పెను ప్రమాదం
Fatty Liver
Follow us

|

Updated on: May 23, 2024 | 2:13 PM

బిజీ లైఫ్ స్టైల్.. ఉరుకులు పరుగుల జీవితంలో మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం మరచిపోతుంటాం.. సమయాన్ని ఆదా చేయడానికి లేదా సమయం లేకపోవడం వల్ల చాలా హానికరమైన ఆహారాన్ని తింటుంటాం.. అప్పటికప్పుడు దొరికే అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటూ కడుపు నింపుకుంటుంటాం.. ఇది శరీరంతోపాటు.. ప్రధానంగా మన కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ఈ లైఫ్ స్టైల్ వల్ల క్రమంగా ఆరోగ్యం క్షీణిస్తుంది.. వాస్తవానికి ఫ్యాటీ లివర్ సమస్య చాలామందిలో కనిపిస్తుంది. ఫ్యాటీ లివర్ ను రెండు రకాలుగా నిర్ధారిస్తారు.. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌ గా పేర్కొంటారు.

ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ (ARLD) అనేది ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఆల్కహాల్‌ తాగని వారికి ఈ సమస్య వస్తే.. దాన్ని నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) అంటారు. కొన్నిరకాల జబ్బులు, జన్యువులు, ఆహారం, జీర్ణకోశ వ్యవస్థ లోపం కారణంగా ఫ్యాటీ లివర్‌ సమస్య వచ్చే అవకాశం ఉంది. అధిక బరువు, డయాబెటిస్‌ సమస్యతో బాధపడేవారికి ఫ్యాటీ లివర్‌ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువ అని నిపుణులు పేర్కొంటున్నారు.

ఫ్యాటీ లివర్ సంకేతాలు ఇవే..

సాధారణంగా, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మాత్రమే కాలేయం ఆరోగ్యం క్షీణిస్తుంది అనే ఆలోచన ఉంటుంది. కానీ ఈ ఆలోచన తప్పు. కాలేయ సమస్యలు ఎవరికైనా రావచ్చు. కాలేయం ఆరోగ్యం క్షీణించినప్పుడు శరీరం మనకు కొన్ని సంకేతాలను ఇస్తుంది.

కాలేయ కణాలలో కొవ్వు, ట్రైగ్లిజరైడ్స్ అసాధారణంగా చేరడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య ఉంటే.. రోజంతా అలసిపోయినట్లు అనిపిస్తుంది.

ఫ్యాటీ లివర్‌లో పొత్తికడుపు నొప్పి సాధారణం.. కారణం లేకుండా కడుపు నొప్పి వచ్చినట్లయితే లేదా నొప్పి కొనసాగితే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

ఏదైనా వ్యాధికి సంబంధించిన ప్రధాన లక్షణం బలహీనత… మీకు కాలేయ సమస్య ఉంటే.. మీరు రోజువారీ పనులను చేయలేరు. ఇలా అనిపిస్తే.. అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

ఆకలి లేకపోవడం కూడా కాలేయ సమస్యే.. ఇలా అనిపిస్తే.. రోజులో చాలా సేపటివరకు ఏమీ తినకుండా ఉంటారు. దీనివల్ల అలసట, నీరసం లాంటివి కనిపిస్తాయి. దీనివల్ల మీరు ఏ పని చేయలేకపోతారు.

మీరు తక్కువ తిన్నప్పుడు, మీరు బరువు కోల్పోతారు. కాలేయ సమస్య వచ్చినప్పుడు ఒక్కసారిగా బరువు తగ్గడం మొదలవుతుంది. ఇది సాధారణమైనదిగా అనిపించవచ్చు.. కానీ ఇది ఫ్యాటీ లివర్ కు సంబంధించిన కీలక లక్షణం..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..