Things on Fridge: మీరు కూడా ఫ్రిజ్ మీద ఈ వస్తువులు పెడుతున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
ఫ్రిజ్ అనేది ఇప్పుడు నిత్యవసర వస్తువుగా మారిపోయింది. సాధ్యమైనంత వరకూ ఫ్రిజ్ లేని ఇల్లు ఉండదు. ఎలాంటి మధ్య తరగతికి సంబంధించిన వారి ఇంట్లో అయినా ఫ్రిజ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇక ఇంట్లో ఫ్రిజ్ ఉందంటే దాన్ని ఖాళీ వదులుతామా.. పనికి వచ్చినవి.. పనికి రానివి ఇలా ఒక్కటేంటి.. ఎన్నో ఫ్రిజ్‌లో పెడుతూ ఉంటారు. ఫ్రిజ్‌లు వచ్చాక చాలా వరకు మహిళలకు పని అనేది సులువు అయిందని చెప్పొచ్చు. ఇంట్లో ఫ్రిజ్ ఉంటే లోపలే కాదు..
ఫ్రిజ్ అనేది ఇప్పుడు నిత్యవసర వస్తువుగా మారిపోయింది. సాధ్యమైనంత వరకూ ఫ్రిజ్ లేని ఇల్లు ఉండదు. ఎలాంటి మధ్య తరగతికి సంబంధించిన వారి ఇంట్లో అయినా ఫ్రిజ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇక ఇంట్లో ఫ్రిజ్ ఉందంటే దాన్ని ఖాళీ వదులుతామా.. పనికి వచ్చినవి.. పనికి రానివి ఇలా ఒక్కటేంటి.. ఎన్నో ఫ్రిజ్‌లో పెడుతూ ఉంటారు. ఫ్రిజ్‌లు వచ్చాక చాలా వరకు మహిళలకు పని అనేది సులువు అయిందని చెప్పొచ్చు. ఇంట్లో ఫ్రిజ్ ఉంటే లోపలే కాదు.. పైన కూడా ఏమాత్రం ఖాళీ లేకుండా వస్తువులు పెడుతూ ఉంటారు. ఫ్రిజ్‌పై ఏమాత్రం ఖాళీ అనేది కనిపించదు. వాటిని కూడా ఏ పండగకో.. ఫంక్షన్‌కో శుభ్రం చేస్తారు. కానీ కొన్నింటిని మాత్రం ఫ్రిజ్‌పై ఉంచకూడదట. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మొక్కలు:
ప్రస్తుత కాలంలో చాలా మంది ఇంట్లో మొక్కలను పెంచుతున్నారు. ఫ్యాషన్‌కో అందంగా కనిపించడానికో ఎక్కడ ప్లేస్ ఉన్నా ఇన్ డోర్ మొక్కలను పెడుతున్నారు. ఇవి చూడటానికి కూడా అందంగానే కనిపిస్తాయి. అలాగే ఫ్రిజ్‌పైన కూడా మొక్కలను ఉంచుతున్నారు. కానీ ఇలా ఫ్రిజ్‌పైన మొక్కలను ఉంచకూడదట. ఇలా ఉంచడం వల్ల మొక్కలతో పాటు ఫ్రిజ్ కూడా పాడవుతుందని అంటున్నారు.
చేపల ఆక్వేరియం:
చాలా మంది అందంగా ఉంటుంది కదా అని చేపల ఆక్వేరియాన్ని కూడా ఫ్రిజ్ పైన పెడుతూ ఉంటారు. ఇలా అస్సలు పెట్టకూడదు. దీని వలన చేపలు త్వరగా చనిపోతాయి.
మందులు:
రెగ్యులర్‌గా ఉపయోగంచే మందులను కూడా ఫ్రిజ్‌పైన, కవర్‌లో కూడా పెట్టకూడదు. చాలా మంది త్వరగా దొరుకుతాయని మందులను ఫ్రిజ్‌పైన పెడతారు. ఇలా పెట్టడం వల్ల.. ఫ్రిజ్ వేడికి మందుల పవర్ అనేది తగ్గిపోతుంది. కొన్ని రకాల మందులు కూడా పాడైపోతాయి.
డబ్బులు:
చాలా మంది ఫ్రిజ్‌పైన, పైన ఉండే కవర్స్ సైడ్స్‌లో డబ్బులను ఉంచుతూ ఉంటారు. అవసరానికి డబ్బులు త్వరగా దొరుకుతాయని ఇలా పెడతారు. కానీ ఇలా ఉంచడం అస్సలు మంచిది కాదు. వాస్తు ప్రకారం.. ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉందట. కాబట్టి మీ ఫ్రిజ్‌పై ఈ వస్తువులు ఉంటే వెంటనే తీసివేయండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..