Lifestyle: ఈ ఏడు సంకేతాలు.. కిడ్నీ సమస్యకు లక్షణాలు..

శరీరంలో కిడ్నీ ఉండే ప్రాముఖ్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించడంలో కిడ్నీలదే కీలక పాత్ర. అలాంటి కిడ్నీల ఏమైనా సమస్యలు ఏర్పడితే ఇట్టే దాని ప్రభావం కనిపిస్తుంది. అందుకే కిడ్నీల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. కిడ్నీల పనితీరులో...

Lifestyle: ఈ ఏడు సంకేతాలు.. కిడ్నీ సమస్యకు లక్షణాలు..
Kidney
Follow us

|

Updated on: Oct 01, 2024 | 3:15 PM

శరీరంలో కిడ్నీ ఉండే ప్రాముఖ్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించడంలో కిడ్నీలదే కీలక పాత్ర. అలాంటి కిడ్నీల ఏమైనా సమస్యలు ఏర్పడితే ఇట్టే దాని ప్రభావం కనిపిస్తుంది. అందుకే కిడ్నీల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. కిడ్నీల పనితీరులో ఏమాత్రం మార్పు వచ్చినా శరీరం వెంటనే అలర్ట్‌ చేస్తుంది. ఇంతకీ కిడ్నీ పనితీరు దెబ్బతిందని చెప్పే ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారిలో కనిపించే ప్రధాన లక్షణం నిద్రలేమి. కిడ్నీ పనితీరులో ఏమైనా లోపాలు ఉంటే, నిద్రలేమి సమస్య వెంటాడుతుంది. అందుకే దీర్ఘకాలంగా ఈ సమస్యతో బాధపడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

* కిడ్నీల్లో ఏవైనా సమస్యలు ఏర్పడితే రక్తంలో మినరల్స్, న్యూట్రియంట్స్‌ను బ్యాలెన్స్‌ చేయలేవు ఈ కారణంగా చర్మంపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా డ్రై స్కిన్‌, దురద వంటి లక్షణాలు కనిపిస్తే అది కిడ్నీ సంబంధిత సమస్యగా భావించాలి.

* కంటి చుట్టూ ఉబ్బినట్లు కనిపిస్తే కిడ్నీ సమస్య ఏదో వెంటాడుతోందని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలో ఏదైనా సమస్య తలెత్తితే శరీరంలో కొన్ని చోట్ల వాపు కనిపిస్తుంది. అందులో కంటి కింద ఒకటి.

* ఎలాంటి కారణం లేకుండా తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంటే కూడా కిడ్నీ సంబంధిత సమస్యగా భావించాలి. ముఖ్యంగా తక్కువ వయసుఉన్న వారిలో ఇలాంటి లక్షణం కనిపిస్తే అది ముమ్మాటికీ కిడ్నీ సంబంధిత సమస్యగా భావించాలి.

* పాదాల్లో, కీళ్లలో వాపు కనిపించినా వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీ సంబంధిత సమస్యలు ఉండే వారిలోనే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

* కొందరిలో కిడ్నీల్లో సమస్యలు తలెత్తితే అది కండరాల పనితీరుపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబున్నారు. ముఖ్యంగా కండరాల్లో నొప్పులు వంటివి ప్రాథమిక లక్షణంగా చెప్పొచ్చు. ఈ లక్షణాలు కనిపించినవ వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. వ్యాధిని సకాలంలో గుర్తిస్తే చికిత్స కూడా అంతే సులువుగా ఉంటుంది.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

వీడేం డాక్టర్.? అనంతపురం ప్రభుత్వ వైద్యుడి నిర్లక్ష్యం..
వీడేం డాక్టర్.? అనంతపురం ప్రభుత్వ వైద్యుడి నిర్లక్ష్యం..
అమ్మో.. అన్ని అణు బాంబులే.! చైనా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి..
అమ్మో.. అన్ని అణు బాంబులే.! చైనా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి..
ఇది.. దేవర జాతర.! తారక రాముడి కలెక్షన్ ప్రభంజనం.
ఇది.. దేవర జాతర.! తారక రాముడి కలెక్షన్ ప్రభంజనం.
వాళ్ళిద్దరూ హిందువులే కాదు.. జ్యోతిర్‌మఠ్ శంకరాచార్య వ్యాఖ్యలు.
వాళ్ళిద్దరూ హిందువులే కాదు.. జ్యోతిర్‌మఠ్ శంకరాచార్య వ్యాఖ్యలు.
పూల మొక్కలకోసం వెళ్తే.. పులి కనిపించింది.! వైరల్ అవుతున్న వీడియో.
పూల మొక్కలకోసం వెళ్తే.. పులి కనిపించింది.! వైరల్ అవుతున్న వీడియో.
ఆరేళ్లప్పుడు కిడ్నాపయ్యాడు.. 70 ఏళ్ల తర్వాత ఊహించని క్షణాలు.!
ఆరేళ్లప్పుడు కిడ్నాపయ్యాడు.. 70 ఏళ్ల తర్వాత ఊహించని క్షణాలు.!
AIతో మీలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా.? వీడియో
AIతో మీలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా.? వీడియో
ఇది మామూలు పిల్లి కాదు.! 1000 మైళ్ల దూరంలోని ఇంటికి..
ఇది మామూలు పిల్లి కాదు.! 1000 మైళ్ల దూరంలోని ఇంటికి..
పడవలో 30 కుళ్లిన మృతదేహాలు.. అవి ఎవరివంటే.! వీడియో
పడవలో 30 కుళ్లిన మృతదేహాలు.. అవి ఎవరివంటే.! వీడియో
దేవుడి ప్రసాదంలో ఎలుక.! సిద్ధి వినాయకుని ప్రసాదంలో.. వీడియో వైరల్
దేవుడి ప్రసాదంలో ఎలుక.! సిద్ధి వినాయకుని ప్రసాదంలో.. వీడియో వైరల్